లక్ష్యం:
మనం వాడుతున్న హార్డ్ డిస్క్ ఎంత పెద్దదైనా, కొన్నాళ్లకు ఆది నిండిపోక తప్పదు. కానీ అందులొ అన్నీ మనకు కావలసినవి ఉండవు. అనవసరమైన వాటిని తొలగించటానికి ఎక్కడ ఎక్కువ ఖాళీ వృధా అవుతుందో ఒక అవగాహనకు రావాలి. ఈ పనిని సులువుగా చేయటానికి TreeSize Free ఉపయోగపడుతుంది.
ఇన్‌స్టాల్ చెయటం ఎలా?
ఈ లంకెకు(వెబ్‌సైట్) వెళ్ళి డౌన్‌లోడ్(Download) బటన్ని క్లిక్ చేసి, ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకొగలరు.
వాడటం ఎలా?
ఏదైనా డ్రైవ్ లేదా ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి TreeSize Free అన్న ఆప్షన్ను ఎంచుకొంటే, దానిలో ఉన్న ఫైల్ల యొక్క సమాచారాన్ని మనకు చూపుతుంది.
ప్రత్యేకతలు :
ఇది ఒక థ్రెడ్ సాయంతో పనిచేయటం మూలానా, పని జెరుగుతున్న కొద్దీ ఫలితం చూపుతుంది.
ప్రింట్ తీసుకొనే సదుపాయం కూడా కలదు.
KB, MB మరియు GBలలో వాడకాన్ని చూడవచ్చు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి