సంక్షిప్తంగా:
ఇకపై జోహో అప్లికేషన్లు సర్వత్రా ఉపయోగించుకోవచ్చు. అంటే, జీ-మెయిల్, ఐగూగుల్, ఆర్కుట్, ఫేస్‌బుక్, మీ మీ వెబ్‌పేజీల్లోనూ వాటిని ఇనుమడింపజేయొచ్చు. ప్రస్తుతానికి ఈ గాడ్జెట్లు పత్రములకి(డాక్స్), వేగులకి(మెయిల్), సంపర్కాలకి(కాంటాక్ట్స్), ప్లానర్, కాలెండర్లకి అందిస్తున్నారు.
జోహో సంస్థ జాలంలో అటు గూగుల్ తోనూ, డెస్క్ టాప్ అప్లికేషన్ల విషయంలో ఇటు మైక్రోసాఫ్ట్ తోనూ పోటీ పడుతుంది. ఇప్పటివరకు తను అందించిన సేవలకు గానూ మంచి పేరే సాధించుకుంది. ఇంకో అడుగు ముందుకేసి, ఆ సంస్థ అందించే సేవలన్నీ మరింత సులువుగా ఉపయోగించడానికి వీలుగా ఈ గాడ్జెట్లను రీలీజ్ చేస్తూ ఒక వార్తా కథనాన్ని వారి బ్లాగ్ లో ప్రచురించారు. అవి మీరు వాడాలనుకుంటే ఈ జోహో గాడ్జెట్ల పేజీకి వెళ్ళి మిగతా వివరాలు తెలుసుకోగలరు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి