అసలు ముందుగా ఈ పాఠ్యాంశం చదవి, చెప్పింది చేయడానికి, తెలియాల్సినవి ఏమన్నా తెలియకపోతే తెలుసుకుందాం. ఏది తెలియకపోయినా దాని మీద నొక్కేసి, చదివేసి మళ్ళీ వెనక్కి వచ్చేయండి.
- terminal (టర్మినల్)
- yum (యమ్)
- apt-get (యాప్ట్-గెట్) లేదా synaptic(సినాప్టిక్)
హా! ఇప్పుడు అన్నీ తెలుసన్నమాట! మీకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటే ఇదిగో ఈ క్రింది చెప్పింది చేసేయ్యండి. లేకపోతే ఇక్కడ నొక్కితే ఇంకొంచెం క్రిందికెళతారు, అక్కడ చెప్పింది చేసేయ్యండి.
ఇంటర్నెట్ సదుపాయం ఉంటే
Alt+F2 కొట్టి ఆ వచ్చిన బాక్సులో gnome-terminal అని కొట్టి ఈ కిందున్న commands ని copy paste చేసి రన్ చేయండి
ఫెడోరా(Fedora) వాడేవారు
yum -y install openoffice.org-langpack-te_IN aspell-te fonts-telugu.noarch lohit-fonts-telugu.noarch
ఉబుంటు(Ubuntu) వాడేవారు
sudo apt-get install aspell-te language-pack-te language-support-te openoffice.orgl10n-te-in ttf-telugu-fonts
ఒకసారి కంప్యూటర్ రీబూట్ చేయండి. పైన చెప్పినట్టు చేసినప్పటికీ, అప్పుడప్పుడు విహారిణిలో(browsers) బాగా చదవగలగాలంటే అందులో కూడా తగు మార్పులు చేయాల్సుంటుంది.
పైర్‌ఫాక్స్ వాడేవారికి అదంతా అవసరం లేదులేండి. ఫైర్‌ఫాక్స్ ౩.౦ వర్షన్ నుండి ఏం చేయనక్కర్లేకుండానే తెలుగు శుభ్రంగా కనిపిస్తుంది. కాని అంతకు ముందు వర్షన్‌లలో ఏమన్నా తేడగా ఉంటే మాత్రం తలనొప్పే సుమా. అందుకే, ఇక్కడ నుండి అత్యాధునిక వర్షన్‌ని దింపుకుని(download చేస్కుని), స్థాపించేస్కోండి(install అన్నమాట). అంతే!
ఒకవేళ మీరు ఎపిఫనీ(Epiphany) విహారిణి(browser) వాడే అరకొరమందిలో ఒకరైతే, అందులో తెలుగు పదాలు సరైన రీతిలో కనబడడానికి Pango rendering అనేది ఒకటవసరం. దానికోసం మీరు చేయాల్సిందల్లా…
- Alt+F2 కొట్టి ఆ వచ్చిన Run Application బాక్సులో gconf-editor అని కొట్టి Run కొట్టండి.
- అలా కొడితే వచ్చిన విండోలో ఎడమవైపునున్న menu లో apps>epiphany లో web section కి వెళ్ళండి.
- ఇప్పుడు అదే విండోలో కుడివైపు చూస్తే enable_pango అనేదొకటుంటుంది. దానికి టిక్ పెట్టేయండి.
- హమ్మయ్య! ఓ మారు ఎపిఫనీని మూసి-తెరిస్తే మన తెలుగు, తెలుగులా అందంగా కనబడుతుంది :)
ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే
- ఈ లంకె నొక్కి పోతన, వేమన ఫోంట్లు దించుకోండి.
- దించుకున్నాక, దాన్ని unzip చేస్తే వచ్చే Pothana2000.ttf మరియు vemana.ttf లను ~/.fonts డైరెక్టరీలోకి copy చేయండి. విహారిణిని(బ్రౌజర్) తెరిచివుంటే ఒకసారి మూసి, తెరవండి.
- ఏదైన తెలుగు వెబ్‌సైట్ కి వెళ్ళి తెలుగు చదవడం మొదలెట్టండి.
అక్కడికీ సమస్య తీరకపోతే, పోనీ ఇక్కడ చెప్పిన పద్దతి మీకు నచ్చకపోతే మీరు వాడుతున్న OS, విహారిణి(browser) పేర్లు, వర్షన్‌ల వివరాలతో ఇక్కడే అడిగేస్తే నా శక్తి కొద్దీ సమాధానం చెప్తాను.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి