NTFS Config ( యన్.టీ.ఎఫ్.ఎస్ కాన్‌ఫిగ్ ) అనే సాఫ్ట్వేర్‌ని ఇంస్టాల్ చేసుకుంటే అది మీ డ్రైవ్‌లను చూపుతుంది, ఏవైతే డీఫాల్‌ట్‌గా మౌంట్ కావాలనుకొంటున్నారో వాటిని ఎంచుకోండి.
ఒక వేళ మీ కంప్యూటర్‌లో విండోస్ కూడా ఉంటే, విండోస్‌ని సరిగ్గా షట్‌డౌన్ చేయటం మరవకండి.
మీరు ఒక వేళ NTFS Configను ఏ కారణంగా ఐనా ఇంస్టాల్ చేసుకోలేకపోతే క్రింది ప్రక్రియను పాటించండి.
కమ్యాండ్‌ల ద్వారా :
మీరు ఈ ప్రక్రియను పాటించటానికి ముందు మీరు మీ డ్రైవులన్నింటినీ మౌంట్ చేసుకోవాలి.
1. అవి ఏ పేరుతో మౌంట్ అవుతున్నాయో గమనించండి, ఇవి చూడటానికి మీరు క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేస్తే వాటి పేర్లు చూపుతుంది.
ls /media/
చూపిన పేర్లను నోట్ చేసుకోండి. (గమనిక : Disk అన్నదానికీ disk అన్నదానికీ తేడా ఉంది.)
2. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయగానే ఒక టేక్స్టు ఫైల్ ఓపెన్ అవుతుంది.
gedit /etc/mtab
మీరు ఏ డ్రైవులనైతే మౌంట్ చేశారో, వాటికి సంభందించిన లైంలు క్రింద తెలిపిన విదంగా ఉంటాయి.
/dev/sda6 /media/disk fuseblk rw,nosuid,nodev,uhelper=hal,shortname=mixed,uid=1000,utf8,umask=077,flush 0 0
చివరిలో ఉన్న ఇలాంటి లైన్లు అన్నింటినీ కాపీ చేసుకోండి. ఆ ఓపెన్ ఐన ఫైల్ను మూసివేయండి.
3. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయగానే వేరొక టేక్స్టు ఫైల్ ఓపెన్ అవుతుంది.
sudo gedit /etc/fstab
ఇందులో చివరిలో మీరు కాపీ చేసుకున్న లైంలను పేస్ట్ చేయండి.(Enter నొక్కిన తరువాత కొత్త లైనులో పేస్టు చేయాలి)
ఒక వేళ fuseblk అని ఎక్కడైనా కనబడితే, దాన్ని ntfsగా మార్చండి.
Save చేసి దీనిని మూసివేయండి.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
పొరపాటుగా విండోస్ ను(ఒక వేళ మీ కంప్యూటర్లో ఉంటే) సరిగా Shutdown చేయనట్టైతే చిక్కుల్లో పడతారు. దీనికి పరిష్కారం క్రింద తెలిపిన ప్రక్రియను జాగ్రత్తగా పాటిస్తే చాలు.
1. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయండి. అన్ని డ్రైవులూ unmount అవుతాయి. ఇలా చేసేటప్పుడు ఏ డ్రైవునుంటి కూడా ఫైల్లను వాడుతూ ఉండరాదు. అంటే పాటలు సినిమాలూ ఇలాంటివి అన్నమాట.(అవి ఈ డ్రైవుల్లో ఉంటేనే).
sudo umount -a
2. ఇప్పుడు, క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో ఒక్కొక్క డ్రైవ్ కూ ఒక్కొక్క సారి వాడవలసి ఉంటుంది.
sudo mkdir /media/disk —- ఇక్కడ disk అన్నది డ్రైవ్ పేరు. ఇలా ప్రతి డ్రవ్ కూ చేయాలి( disk అని ఉన్న స్థానంలో మీరు ls /media/ అన్న కమాండ్ నుంటీ నోట్ చేసుకున్నారు కదా! ఆ పేర్లు ఒక్కొక్కటిగా వాడండి ).
ఉదాహరణకు :
sudo mkdir /media/fun
sudo mkdir /media/Videos
3. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయగానే అన్ని డ్రైవ్ లనూ మౌంట్ చేస్తుంది.
sudo mount -a
ఇక మీరు ఎప్పుడు కంప్యూటర్ను స్టార్టు చేసినా అన్ని డ్రైవులూ వాటంతటవే మౌంటు అవుతాయి. ఒక వేళ అవ్వకపోతే(ఇలా జరగటం చాలా అరుదు), రీస్టార్టు చేయండి, లేదా sudo mount -a కమాండును వాడి చూడండి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి