కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి?
కంప్యూటర్ వైరస్, తక్కిన సాఫ్ట్వేర్‌లలానే ఒక చిన్న ప్రోగ్రాం. కానీ ఇది చేసే పనులు చాలా కౄరమైనవి. ఇవి మనం గుర్తించటానికి వీలుకాకుండా ఉండటానికి సాధారణంగా వేరొక సాఫ్ట్వేర్‌లో దాగి ఉంటాయి. అందుకే మనం వీటిని వైరస్ అని అంటాం. ఇవి మన ప్రమేయం లేకుండా మన కంప్యూటర్‌లోనే పలు ఫైల్లకు లేదా ఒక కంప్యూటర్ నుంటి మరొకదానికి వ్యాపిస్తూ ఉంటాయి.
వీటి గూర్చి నేనెందుకు పట్టించుకోవాలి?
మీరు లినక్‌స్ వాడుతున్నటైతే వీటి గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు, ఎందుకంటే ఇవి లినక్స్‌లో చాలా అరుదు(లేవని కాదు). కానీ ప్రస్తుతం 95% మంది విండోస్ వాడుకరులే.
వైరస్‌లు చాలా రకాలు ఉన్నాయి. అతి తక్కువ హాని తలపెట్టేవి అంటే వార్నింగ్ మెసేజిలు మనకు ఇచ్చి అంతటితో ఆగిపోయేవి. అత్యంత హానికరమైనవి అంటే మన డేటా మొత్తాన్నీ తుడిచిపెట్టెస్తాయి, లేదా మన ప్రమేయం లేకుండా మన ఈ-మైల్ నుండి మన అడ్రస్ బుక్కులో ఉండే వారందకీ అసబ్యకరమైన మైల్లను పంపేస్తుంటాయి.
వీటిని అరికట్టటం ఎలా?
1. ఒక మంచి Anti-Virus మీ కంప్యూటర్‌లో ఇంస్టాల్ చేసుకోవటం. కొన్ని ఉచితంగా లభిస్తాయి. కొన్ని ౩౦ రోజుల కాల పరిమితితో లభిస్తాయి ఇంకా మంచివి కావాలంటే రూ.750/- నుంటి లభిస్తాయి. దగ్గరే ఉన్న కంప్యూటర్ షాపులో అడగండి.
2. ఎప్పటికప్పుడు ఇంటెర్నెట్ ద్వారా మీ యాంటీ వైరస్‌లను అప్డేట్ చేసుకోవాలి. కనీసం వారానికి ఒకసారి, ఎందుకంటే ఏదో ఒక కొత్త వైరస్ వచ్చే ఉంటుంది.
3. మరీ ముఖ్యమైన డేటా ఏదైనా ఉంటే దానిని డీ.వీ.డీ లలో బద్రపరుచుకోవాలి.
4. .exe .vbs .scr .vbe .com .bat .shs .cpl .dll .ocx .pif .drv .lnk .bin .sys .eml .nws. ఎరుపు రంగులో తెలిపిన ఎక్స్టెన్‌షన్ ఉన్న ఫైల్లు మీ ఈ-మైల్‌లో వస్తే వాటిని తెరవకండి, అవి మీకు తెలిసిన వారు పంపినప్పటికి కూడా. ఎందుకంటే అవి వారి ప్రమేయలేకుండా వచ్చినవి ఉంటాయి.
5. పెన్‌డ్రైవ్ లను యాన్‌టీ-వైరస్ స్క్యాన్ చేయకుండా తెరవకండి.
6. ప్రతి వైరస్‌నూ అరికట్టే సామర్థ్యం ఏ యాన్‌టీ-వైరస్సుకూ ఉండదు, కావున అప్రమత్తంగా ఉండండి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి