మెయిల్
ఇదివరకంటే ఉత్తరం కోసం పడిగాపులు గాని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులేమీ లేవు. అలా మెయిల్ కొడితే ఇలా అందుకోవచ్చు. అలాంటి మెయిల్ సర్వీసులలో బాగా పేరు మోసిన గూగుల్ మెయిల్ లో ఎన్ని సౌకర్యలున్నాయో అంతే తేలికగా వాడుకోవచ్చు! ఇప్పటి వరకు మీకు జిమెయిల్ లో ఎకౌంటు లేకపోతే ఇక్కడ నొక్కి సృష్టించుకోండి. మీ జిమెయిల్ ఎకౌంటు ని తెలుగులో చూసుకోవాలి అనుకుంటే, settings అని పైన ఉంటుంది, అది నొక్కితే వచ్చిన పేజిలో General లో Language అని ఉంటుంది. అక్కడ తెలుగు ఎంచుకోండి. ఒకవేళ మీకు తెలుగులో టైపు చెయాలని ఉంటే అక్కడే "Enable Transliteration" ని టిక్ చేసి దాని క్రిందే ఉన్న "Default Transliteration Language" లో తెలుగు ఎంచుకోండి. ఇప్పుడు బాగా క్రిందకి వచ్చి "Save changes" కొట్టేయండి. ఇకపై జిమెయిల్ తెలుగులో కనిపిస్తుంది.
లిప్యంతరీకరణ(Transliteration) అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, లిప్యంతరీకరణ అంటే తెలుగుని ఇంగ్లీష్ లో టైపు చేయడం అన్నమాట. అంటే చాట్ భాష :) అర్థం కావడానికి ఈ క్రింది ఉదాహరణ చూడండి.
amma - "అమ్మ" గా మారుతుంది.
nenu school ki vellanu - "నేను స్కూల్ కి వెళ్ళను" గా మారుతుంది.
ఒకవేళ మీరు అనుకున్నట్టు రాకపోతే సరిచేసుకోవడం చాలా తేలిక. ఏదైతే పదం సరిగ్గా రాలేదో ఆ పదం దగ్గరికి వెళ్లి "Backspace" నొక్కినా, ఆ పదం మీద క్లిక్ చేసిన, మీరు టైపు చేసిన ఇంగ్లీష్ అక్షరాలకిఇంకా దగ్గరి తెలుగు పదాలు చూపిస్తుంది. వాటిల్లోంచి మీరు అనుకున్న పదం ఎంచుకోండి.
ఇవన్నీ ఎందుకయ్యా, మేము తెలుగుని తెలుగు కీబోర్డు మీదే టైపు చేస్తాం అంటే మరీ మంచిది :) అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి. జిమెయిల్ గురించి మరింత సమాచారం కోసం టెక్ సేతు లో శోధించండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వార్తలతో తాజకరిస్తూ ఉంటాం.
డాక్స్
గూగుల్ డాక్స్ అంటే ఆన్‌లైన్ ఆఫీసు సాఫ్ట్వేర్ అనే చెప్పుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీసు సాఫ్ట్వేర్ లో ఉన్నన్ని ప్రయోజనాలు ఇందులో లేకపోయినప్పటికీ దీనికున్న ప్రయోజనాలు వాంఛనీయం! ఇంతకీ ఆఫీసు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? లావాదేవీలు, డాక్యుమెంట్లు, ప్రెజంటేషన్లు లాంటివన్నీ ఈ ఆఫీసు సాఫ్ట్వేర్ లోనే చేస్తారు. దాదాపు కంప్యూటర్ వాడేవరందరికీ దీని అవసరం తప్పనిసరిగా ఉంటుందనే చెప్పొచ్చు! కాబట్టి ఒకవేళ మీ దగ్గర మైక్రోసాఫ్ట్ ఆఫీసు సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోయినా ఒకసారి గూగుల్ డాక్స్ మాత్రం చూడండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, ఇది మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ ఐన సాఫ్ట్వేర్ కాదు. మీరు సృష్టించి సేవ్ చేస్కున్న డాక్యుమెంట్లన్నీ ఏ ప్రదేశంలో ఐనా, ఏ సిస్టంనుంచి ఐనా విహారిణి సహాయంతో చుస్కోవచ్చు, మార్చుకోవచ్చు. అదే కాక, స్నేహితులతో గాని, ఇంకొంతమంది వ్యక్తులతో కానీ, ఒక గ్రూప్ తో గాని పంచుకోవాలంటే చాలా తేలికగా చేయవచ్చు.(గ్రూప్ అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే ఈ టపా చివర్లో చూడండి)
మీరు గూగుల్ డాక్స్ ని తెలుగులో వాడుకోవలనుకుంటే మీ గూగుల్ డాక్స్ ఖాతాకు వెళ్లి అక్కడ పైన ఉన్న "Settings" ని నొక్కి, "Language" ని తెలుగు గా ఎంచుకోండి. ఇకపై గూగుల్ డాక్స్ మీకు తెలుగులోనే కనిపిస్తుంది.
క్యాలెండర్
మీ పనులన్నీ చక్కబెట్టి చూసుకోవడానికి గూగుల్ ఫ్రీగా ఇచ్చే పర్సనల్ సెక్రటరీయే గూగుల్ క్యాలెండర్! ఇందుల్లో మనం మన పనులు ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడో, ఎవరెవరు అందులో భాగస్వాములో, ఏయే రోజుల్లో అదే పని పునరీకృతమవుతుందో చూసుకోవచ్చు. అంతే కాదు, మన దగ్గరవాళ్ళ పుట్టిన రోజులు, పండగలు-పబ్బాలు ఒక్కసారి నోట్ చేస్కుంటే చాలు, ఇంక జీవితకాలం మొత్తం మనకి గుర్తుచేస్తుంది. హా! గుర్తు చేయడం అంటే మనం సైట్ తెరిచి చూడనక్కర్లేదు, మన మొబైల్ నెంబర్ ఇస్తే సమయానికి అదే మెసేజ్ పంపిస్తుంది. అలాగే మనకి 24x7 ఇంటర్నెట్ సదుపాయం ఉంటే మన కంప్యూటర్ మీద క్యాలెండర్ కో, మొబైల్ లో ఉన్న క్యాలెండర్ కో కూడా దాన్ని అనుసంధానించుకోవచ్చు. ఇంతేనా అనుకుంటే ఇంకా ఉన్నాయ్! మన క్యాలెండర్ మన స్నేహితులతో పంచుకోవచ్చు. అప్పుడు మనం ఎప్పుడు ఖాళీగా ఉంటామో, ఎప్పుడు బిజీగా ఉంటామో వాళ్ళకి తెలుస్తుంది.
ప్రయత్నిస్తారా మరి? :)
రీడర్
ఇంటర్నెట్ వచ్చాక సమాచారం అతిపెద్ద సముద్రంలా గోచరిస్తుంది! అంత పెద్ద కడలిని ఈదాలంటే మనకు కావాల్సిన కొద్ది పాటి సమాచారాన్నే ఏరుకుని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. కానీ మనకు కావాల్సినవన్నీ ఒకేచోట నిక్షిప్తమయ్యి, మనం మళ్లీ మళ్లీ ఆ సైట్లకు వెళ్ళనక్కర్లేకుండా వాటిల్లో కొత్త సమాచారం వచ్చినప్పుడే, ఆ సమాచారాన్ని మనకు చూపిస్తే బావుంటుంది కదూ? ఇంక మనం మెచ్చిన సమాచారాన్ని నలుగురితో పంచుకోవడానికి ఒక సదుపాయం ఉంటే ఎంత సంతోషం? మనకి ముఖ్యం అనుకున్నవి గుర్తుపెట్టుకునేల ఒక సౌలభ్యమ్ ఉంటే ఎంత హాయి? ఇవన్నీ కలుపుకునే గూగుల్ వారు గూగుల్ రీడర్ ని అందించారు. కొన్నాళ్ళ తర్వాత మనం ఏం చదువుతున్నామో, ఏది అప్రస్తుతమని వదిలేస్తున్నమో ఇలాంటివన్ని లెక్కలతో సహా చూపిస్తుంది. సమాచారాన్ని ప్రేమించే వారు తప్పక చూసి వాడాల్సినసాయుధమిది :)
గ్రూపులు/గుంపులు
నలుగురు కలిస్తే అదో గ్రూపు! ఎందుకు కలిసారో, ఎలా కలిసారో అనవసరం. ఒక్కొక్కర్నీ సంప్రదించే బదులు ఇప్పుడు ఆ నలుగుర్ని కలిపి ఒక గ్రూపుగా సంప్రదించవచ్చు. అది మీ వ్యక్తిగతం కావచ్చు. ఆఫీసు పనే కావచ్చు, సరదాకైన సరే కావచ్చు, లేదూ ఇంకేదైనా కావచ్చు. దీని వల్ల ఉపయోగాలు పైనా చెప్పిన గూగుల్ ఉపకరణాలన్నిటితో ముడి పడి ఉన్నాయి. మెయిల్ ఒక్కరికి బదులు గుంపుకి కొట్టొచ్చు. డాక్యుమెంట్లు ఒకరికి బదులు గ్రూపుతో పంచుకోవచ్చు, ఇలా అన్నమాట. మీకు ఆసక్తి కలిగిన విషయాలపై ఇప్పటికే చాలా గ్రూపులు ఉండి ఉంటాయి. వెళ్లి చేరిపోండి మరి. ఒకవేళ లేకపోతే మీరు ఒకటి సృష్టించి, మీకు తెలిసిన వారిని, తెలియని వారిని ఆహ్వానించి అభిరుచుల్ని, ఆలోచనల్ని పంచుకోవచ్చు.
ఉదాహరణకి, మన తెలుగుబ్లాగు గుంపు ఉంది, చూడండి.
గూగుల్ ఉపకరణాలు కోసం ఇక్కడ నొక్కండి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి