భారతదేశంలో కలనయంత్రంలో ఆటలకి, ప్రపంచంలో మిగతాచోట్ల, అంటే, యూరప్, అమెరికా లాంటి దేశాల్లో ఉన్నంత ప్రచారం, ప్రసిద్ది ఇంకా లేవు. కానీ, మన దేశంలో ఉన్న కథలతో, ఇతిహాసాలతో ఎన్నో, ఎన్నెన్నో అద్భుతమైన ఆటలు తయారుచేయవచ్చనే సదావకాశన్ని చేజిక్కించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు, ఫలితాలు సాధిస్తున్నారు కూడా!
అలాంటి ప్రయత్నాల్లో చెప్పుకోదగ్గ పెద్ద ప్రయత్నం, ఫలించిన ప్రయత్నం, హనుమాన్ ఆట! బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం, అసలు హనుమాన్ గేమ్ ని రిలీజ్ చేసిన రోజే 10000 వేల యూనిట్లు అమ్ముడుపోయాయంట. మామూలుగా ఐతే ఇలాంటి ఒక అంతర్జాతీయ గేమ్ టైటిల్ 3000-4000 యూనిట్ల దాకా అమ్ముడుపోతాయి. మొత్తం మొదటి సం॥నికి గాను ముందు 30000 యూనిట్లు గమ్యం పెట్టుకున్నా, అంతా కలిపి 50000 యూనిట్ల దాకాఅమ్ముడుపోయాయని సోనీ యాజమన్యం పేర్కొంది. హైదరాబాద్ లో ఉన్న అరోనా టెక్నాలజీస్ అనే సంస్థ హనుమాన్ గేమ్ ని తయారు చేసింది. హైసియా వారు పెట్టిన Product Showcase లో దీన్ని చూశాను. 7-14 ఏళ్ళ పిల్లలకైతే హనుమాన్ గేమ్ బావుంటుందని అరోనా యాజమాన్యం పేర్కొంది.
బెల్టులు బిగించి ఆటపాటలకి సిద్దం కండి! సోనీ కంపెనీ ఆటలకి పెట్టింది పేరు. మంచి మంచి ఆటలు మన ముందుకు తెస్తుందని ఆశిద్దాం.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి