లక్ష్యం:
గమనిక : ఇది విండోస్ వాడుకరులకు మాత్రమే! ఉదాహరణకు ఈనాడు వెబ్‌సైట్ ఫైయర్-ఫాక్స్ లో మనకు అర్థం కానీ అక్షరాలలో కనిపిస్తుంది, మరి కొన్ని వెబ్‌సైట్లు అవి కనపడే విధానాన్ని కొల్పొతాయి. కొన్నివెబ్‌సైట్లలో లభించే ఆటలు ఆడటం వీలుకాదు. ఇలాంటి సమస్యలు మరెన్నో ఉంటాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో ఆడ్-ఆన్ ఇన్‌స్టాల్ చేసుకోవటం కన్నాIE Tab ఆడ్-ఆన్ వాడటం సులువు.
ఫైయర్-ఫాక్స్ యొక్క ప్రయోజనాలు చాలామందికి తెలిసినవే. మీరు వాడాలనుకుంటే ఇక్కన్నుటి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కానీ ఇప్పటిదాకా ఒక ఆటంకం ఉండేది
వాడటం ఎలా?
మీ ఫైయర్-ఫాక్స్ బ్రౌసర్ నుండి ఈ లంకెకు(వెబ్‌సైట్) వెళ్లండి. అక్కడ Add to Firefox(Windows) అన్న బటన్ను నొక్కండి, కొత్తగా వచ్చిన విండోలో Install బటన్ను నొక్కండి. ఫైయర్-ఫాక్సును రీ-స్టార్ట్ చేయండి (క్లోజ్ చేసి మరో మారు తెరవండి).
ఇక నుంచీ మీరెప్పుడైనా ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్లో చక్కగా కనపడుతూ ఫైయర్-ఫాక్సులో సరిగ్గా కనపడని వెబ్‌సైట్ చూస్తున్నప్పుడు, ఆ వెబ్‌సైట్లో రైట్ క్లిక్ చేసి, వచ్చిన మెనూ నుంటి View tab in IE Tab అన్న ఆప్షను ఎంచుకొంటే (బొమ్మలో చూపినట్టుగా) ఆది ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్లో కనిపించినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి