ఇహ విషయానికొస్తే, టైప్ చేయడంలో ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి, ఇన్‌స్క్రిప్ట్(inscript), ఇంకోటి లిప్యంతరీకరణం(transliteration).
ఇన్‌స్క్రిప్ట్ అంటే సరాసరి తెలుగు కీబోర్డ్ మీద టైప్ చేసినట్టు చేసేయడం. లిప్యంతరీకరణం అంటే మనం ఇంగ్లీషులిపిలో తెలుగు టైప్ చేస్తే అది తెలుగులిపిలోకి మారడం. అంటే మనం amma అన్ని టైప్ చెస్తే అది అమ్మ గా మారుతుందన్నమాట. మీకు ఏది తేలికనిపిస్తే అదే ఉపయోగించమని నేను చెప్పక్కర్లేదనుకుంటా.
ఇన్‌స్క్రిప్ట్(Inscript)
KDE లో ఐతే
- System Settings లో Regional & Language ని వెతికి పట్టుకోండి(అంటే అక్కడో search బాక్సుంటుంది, ఉపయోగించమని).
- అందులో Keyboard Layout అనే దాంట్లోకి వెళ్ళి, Enable keyboard layouts అన్నదాన్ని టిక్ చేయండి.
- దాని కిందే, Available layouts అని ఉంటుంది, దాంట్లో India ని ఎంచుకుని Add బటన్ క్లిక్ చేయండి.
- ఇప్పుడు పైన కొత్తగా చెర్చిన India ని ఎంచుకుని Layout variant కి tel అని ఎంచుకోండి.
- చివరిగా Apply బటన్ కొట్టేశక మీకు ప్యానల్‌లోlayout బటన్ ఒకటి కనిపిస్తుంది. క్లిక్ చేసినప్పుడల్లా layout మారుతుందన్నమాట.
Gnome లో ఐతే
కింద చెప్పిన లిప్యంతరీకరణం పద్దతితోనే ఇన్‌స్క్రిప్ట్ టైప్ చేయడానికి కూడా వీలు కలుగుతుంది. దీని కోసం వేరేగా ఇంకోటి చేసే బదులు ఇన్‌స్క్రిప్ట్ కి కూడా అదే ఉపయోగించుకోవడం మేలని నా అభిప్రాయం. ఇది KDE కి కూడా ఉపయోగపడుతుందనుకోండి.
లిప్యంతరీకరణ(Transliteration)
ఈ పాఠ్యాంశం రాసింది ఈ పద్దతిలోనే.ఇంగ్లీషు కీ-బోర్డ్ కి అలవాటు పడి, నాకిది సులువనిపిస్తుంది. కాని మీరు టైపింగ్ కి కొత్త ఐతే మాత్రం నేను ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోమని ప్రోత్సహిస్తాను. ఇక లిప్యంతరీకరణ(transliteration) ఉపయోగించాలంటే, మనకి SCIM అనే పరికరం కావాలి. దీంతో లిప్యంతరీకరణం పద్దతే కాకుండా, ఇన్‌స్క్రిప్ట్ మరియు Phonetic పద్దతిలో కూడా టైప్ చేసే వీలుంటుంది.ఇప్పటి వరకూ వచ్చిన complex script input సాఫ్ట్వేర్ పరికరాల్లోకెల్లా అత్యున్నతమైంది, ఈ SCIM. అందుకే నాకిదంటే భలే ఇష్టం. ఇది మీక్కూడా కావాలి అంటె ఇలా చేయాలి.
ఫెడోరా(Fedora) వాడేవారైతే
ఈ క్రింది కమాండ్ టర్మినల్ తెరిచి రన్ చేయండి.
yum -y install scim scim-devel scim-m17n m17n-contrib-telugu.noarch m17n-db-telugu.noarch scim-lang-telugu
ఆ తర్వాత
- Gnome లో System>Preferences లో Input method అని ఉంటుంది, వెతికి పట్టుకోండి.
- ఆ వచ్చిన బాక్సులో Enable input method feature అని ఉంటుంది. దాన్ని టిక్ చేసి, కింద Use SCIM అన్నదాన్ని ఎంచుకుని OK కొట్టేయండి.
- ఒక్కసారి కంప్యూటర్ రీబూట్‌చేయండి.
ఈ సారి లాగిన్ అయినప్పుడు ప్యానెల్ లో కొత్త ఐకాన్ కనిపిస్తుంది. ఒకసారి Gedit తెరిచి, ఆ ఐకాన్ మీద క్లిక్ చేయండి, తెలుగు ఎంచుకుని, ఏ విధంగా టైప్ చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోండి. ఇంక దంచేయొచ్చు!
ఉబుంటు(Ubuntu) వాడేవారైతే
- Gnome లో System>Administration లో Language Support అని ఏదైనా ఉందేమో చూడండి.
- ఉంటే కేక – ఉన్నట్లైతే,
- అది క్లిక్ చేసి, వచ్చిన విండోలో తెలుగు ని టిక్ చేసి, కింద Enable support to enter complex characters అని ఉన్నదాన్ని కూడా టిక్ చేసేయ్యండి.
- అదేవో కొన్ని ప్యాకేజ్ లు దించుకుని స్థాపించుకుంటుంది, చేసుకోనివ్వండి.
- అది అయ్యాక ఒకసారి కంప్యూటర్ ని రీబూట్ చేస్తే ప్యానెల్ లో కొత్త ఐకాన్ కనిపిస్తుంది
- ఒకసారి Gedit తెరిచి, ఆ ఐకాన్ మీద క్లిక్ చేయండి, తెలుగు ఎంచుకుని, ఏ విధంగా టైప్ చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోండి. కుమ్మేయండి!
- లేకపోయినా బాధపడక్కర్లేదు.
- ఆ Language Support Option లేని వాళ్ళు ఈ కింద చెప్పిన కమాండ్ ని రన్ చేయండి(అంటే : Alt+F2 కొట్టి, gnome-terminal అని టైప్ చేసి Run చేయండి, ఆ వచ్చిన విండో లో ఈ కింద చెప్పిన కమాండ్ ని కాపీ చేసి, అతికించి Enter కొట్టండి.)
- sudo apt-get install scim scim-m17n scim-tables-additional
- ఆ తర్వాత Gnome లో System>Preferences లో Input method అని ఉంటుంది, వెతికి పట్టుకోండి.
- ఆ వచ్చిన బాక్సులో Enable input method feature అని ఉంటుంది. దాన్ని టిక్ చేసి, కింద Use SCIM అన్నదాన్ని ఎంచుకుని OK కొట్టేయండి.
- ఒక్కసారి కంప్యూటర్ రీబూట్‌చేయండి.
- ఈ సారి లాగిన్ అయినప్పుడు ప్యానెల్ లో కొత్త ఐకాన్ కనిపిస్తుంది. ఒకసారి Gedit తెరిచి, ఆ ఐకాన్ మీద క్లిక్ చేయండి, తెలుగు ఎంచుకుని, ఏ విధంగా టైప్ చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోండి. టైప్ చేయడం మొదలెట్టొచ్చు!
చివరిగా, తరచూ అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు వాడేవారికి సౌలభ్యంగా ఉండటం కోసం, ఒక చిన్న చిట్కా.. తెలుగు, ఇంగ్లీషు ఒక చిన్న shortcut తో మార్చి మార్చి వాడుకోవచ్చు. ఎలాగంటే, టెర్మినల్ తెరిచి ఈ కిందున్న command ని run చేయండి.
gopal@tidbits# im-switch -z en_US -s scim
ఆ తర్వాత ఒక్కసారి logout అయ్యి, login అయితే ఏ అప్లికేషన్ లో ఐనా Ctrl+Space తో తెలుగు, ఇంగ్లీషు మార్చి మార్చి టైపు చేసుకోవచ్చు. ఇలా చేయని పక్షంలో ప్రతిసారి అప్లికేషన్లో రాసే చోట right click చేసి, Input methid ని SCIM గా ఎంచుకోవాల్సి వస్తుంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి