టెర్మినల్ని కన్సోల్ అని కూడా అనవచ్చు. లినక్స్ లో ప్రతి పనినీ చెయ్యటానికి దీనిని వాడవచ్చు. ఇందులో ఒక్కొక్క పనికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కమాండ్లను కలిపి వాడవలసి ఉంటుంది.
టెర్మినల్ని తెరవటం ఎలా?
Alt + F2 నొక్కగానే ఒక చిన్న విండొ వస్తుంది. అక్కడ gnome-terminal అని టైప్ చేసి Enter నొక్కండి, టెర్మినల్ తెరుచుకుంటుంది.
ఉదాహరణ :
మౌస్ తో లేదా గ్ర్యాఫికల్ యూసర్ ఇంటర్‌ఫేస్(GUI) తో చేసే ప్రతి పనీ ఇందులో చెయ్యవచ్చు. కొన్ని పనులు పదే పదే చేయవలసిన అవసరం ఉంటుంది, వీటిని సునాయాసంగా టెర్మినల్ కమాండ్ల తో చెయ్యవచ్చు.
ఉదాహరణకు మీ కంప్యూటర్‌లో చిందరవందరగా ఏ డ్రైవ్‌లో అంటే ఆ డ్రైవ్‌లో పడి ఉన్న పాటలన్నింటినీ లేదా ఫోటోలన్నింటినీ ఒకే చోటకు చేర్చాలి. మామూలుగా చేస్తే దీనికి చాలా సమయం పడుతుంది (2 లేదా 3 గంటలు).
అదే టెర్మినల్ సాయంతో మన ప్రమేయం లేకుండా, దానంతటదే మన పాటలన్నింటినీ 10నిమిషాల్లో ఒకే చోటికి చేరుస్తుంది. ఇలా మనం ఊహించగలిగినది ఏదైనా చేయవచ్చు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి