RSS
email

Search

Loading
0

యు-టోరెంట్ సాయంతో పెద్ద ఫైల్లను ఇతరులకు పంపగలగటం


లక్ష్యం:
స్నేహితులకూ ఇతరులకూ పెద్ద ఫైల్లను టోరెంట్ల ద్వారా పంపే విదానాన్ని తెలియజేయటం.

10MB కంటే ఎక్కువ ఉంటే దాన్ని మెయిలు చేయటం కుదరదు. కొన్ని 20 లేదా 30MB అట్టాచ్ మెంట్లను అంగీకరించవచ్చు, కొన్ని మైల్ సర్వర్లు కొన్ని రకాల సాఫ్ట్వేర్లను ఒప్పుకోవు. కానీ మీరు ఎలాంటివైనా 2, 3, 20GB లేదా అంతకంటే పెద్ద ఫైల్లు పంపాలంటే??

డబ్బు కట్టకుండా సాధారణంగా సర్వర్లు కూడా ఇందుకు ఒప్పుకోవు… కష్టం కూడా…

గమనిక :

1. మీరూ, మీరు పంపే ఫైలును డౌంలోడ్ చేసుకోవాలనుకొంటున్న ఆ స్నేహితుడూ( ఒకరికన్నా ఎక్కువ ఉన్నా పరవాలేదు ), అంతర్జాలానికి ( ఇంటర్నెట్ కు ) కనెక్ట్ అయ్యి ఉండాలి. మీ టోరెంటు క్లైంటును( చదువుతు వెళ్ళండి, దీని గూర్చి అర్థం అవుతుంది ) తెరిచి ఉండాలి.

2. ఒక వేళ మీరు మరీ సెక్యూర్ గా పంపాలనుకొంటే, ఆ ఫైల్ను zip లేదా rar చేసి password పెట్టి, మెసేజ్ ద్వారానో లేదా వేరే విదంగానో మీ స్నేహితుడికి ఆ పాస్ వర్డును పంపండి.

3. ఒక్క సారి మీరు క్రింది ప్రక్రియను మొదలు పెట్టాక, మీరు పంపాలనుకొన్న ఫైలును ఎక్కడ ఉందో అక్కడే ఉంచాలి.

కావలసినవి :

1. uTorrent సాఫ్ట్ వేరు. మీ దగ్గర లేనట్టైతే, ఇక్కడ డౌంలోడ్ చేసుకోగలరు. లినక్స్ వాడుకరులైతే wine సాఫ్ట్ వేర్ను వాడి ఇంస్టాల్ చేయవచ్చు.

uTorrent మాత్రమే వాడాలనటం లేదు, వేరే ఏ టోరెంట్ క్లైంటునైనా వాడ వచ్చు, uTorrent సులువుగా ఉంటుంది.

ఇక అసలు విషయానికి వస్తే…..

1. uTorrentను తెరిచి (ఒక వేళ ఇంస్టాల్ చేయాల్సి ఉంటే, చేసుకొన్న తరువత), File మెనూలోంచి, Create New Torrentను సెలెక్ట్ చేసుకోండి.

2. ఒక కొత్త విండో వస్తుంది, అందులో Fileను లేదా Folder బటన్ను, మీరు పంపాలనుకున్న ఫైలును బట్టి, బటన్ను సెలెక్ట్ చేసుకోండి. మీ ఫైలును చూపండి.

3. Trackers అని ఉన్న ఖాళీలో క్రింద ఇచ్చిన మూడు లైంలను కాపీ చేసి పేస్ట్ చేయండి.

http://open.tracker.thepiratebay.org/announce
http://denis.stalker.h3q.com:6969/announce
http://www.torrentsnipe.info:2701/announce

4. Web Trackers అవసరం లేదు. Comment మీ ఇష్టం. Pieces sizeను Auto Detectగానే ఉండనివ్వండి.

Start Seedingను టిక్ చేయండి, Private Torrentను టిక్ “”చేయకండి”".

5. Create and save as అన్న బటన్ను నొక్కండి, కాసేపు ఆగితే, పేరు అడుగుతుంది, పేరు ఇచ్చి ఆ ఫైల్ ను సేవ్ చేయండి. మీ uTorrentలో ఇది సీడ్ అవ్వటం మొదలు పెడుతుంది.

6. ఆ .torrent ఫైలును మీ స్నేహితుడికి mail ద్వారా పంపండి. ఒక వేళ చాలా మందికి( మీకు వారందరి mail idలు తెలిసి ఉండక పోవచ్చు) అందుబాటులో ఉండాలంటే, 7 మరియూ 8 ప్రక్రియలను(steps) అనుసరించండి. mail చేసి ఉంటే ఏకంగా తొమ్మిదవ ప్రక్రియ చూడండి.

7. ఇక్కడకు వెళ్ళి, క్రిందకు స్క్రోల్ చేస్తే Torrent File అని ఉంటుంది, పక్కనే Browse అన్న బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు కొత్తగా తయారు చేసి సేవ్ చేసిన .torrent ఫైల్ ను సెలెక్ట్ చేసుకోండి.

Category, Name మరియూ Description మీ ఇష్టం. Language Englishగా మార్చటం మంచిది.

అలాగే క్రిందకు వెల్తే, గజిబిజిగా రెండు పాదాలు ఉంటాయి( వీటిని CAPTCHA అంటారు), వాటికి కేటాయించిన ఖాళీలో వాటిని టైప్ చేయండి.

తరువాత Submit torrent అన్న బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, .torrent ఫైల్ ను అది తీసుకోవటానికి కాస్త సమయం పడుతుంది.

8. కాసేపటికి మీకు Torrent uploaded successfully అని వస్తుంది. Check your added torrent here అని ఉంటుంది, ఆ here అన్న పదం మీద క్లిక్ చేయగానే కొత్త పేజీ వస్తుంది, ఆ పేజీ లంకేను మీ స్నేహితునికి ఇవ్వండి.

9. అతను ఆ టోరెంటును ఎలా డౌంలోడు చేసుకోవాలన్నది లంకెను చూడమనండి.

ఇక మీ ఇంటర్నెట్టు ప్లాన్ మరియూ మీ స్నేహితుని ఇంటర్నెట్టు ప్లాన్‌లను బట్టీ దాని వేగం ఉంటుంది.




Read more
0

విర్చువల్ బాక్స్ సాయంతో రెండు ఆపరేటింగ్ సిస్టంలను ఒకేసారి వాడటం!


లక్ష్యం:
ఒకే సమయంలో రెండు ఆపరేటింగ్ సిస్టంలను విర్చువల్ బాక్స్ ద్వారా వాడటం ఎలా అన్న విషయాన్ని తెలుసుకొంటారు.

ప్రశ్న : ఒకే సమయంలో రెండేసి ఆపరేటింగ్ సిస్టంలను వాడవచ్చా?

జవాబు : వాడవచ్చు.

ప్రస్థుతం మనం కంప్యూటరుతో ఏ పనినైనా చేయించగలిగించేస్తున్నాం. అలాంటి ప్రయత్నానికి ఫలితమే ఇది. 1967లో ఇది మొదలైంది. ఈ కాంసెప్టు పేరు వర్చువలైజేషన్ (virtualisation). దీనిని అనుసరించి చేయబడినదే virtual machine.

అసలు దీని సంగతేమిటంటే…. virtual machine అనేది మన కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్. దీనిని వాడుకొని మనం ఒక కంప్యూటర్ను శృస్టిస్తాము. దీనికి కొంత RAM మరియూ HardDiskను ఇస్తాము. ఇలా సాఫ్ట్వేర్ లోపల తయారు చేయబడిన ఈ కంప్యూటర్ లో ఇంకొక ఆపరేటింగ్ సిస్టం ఇంస్టాల్ చేసుకోవచ్చు. ఈ ఆపరేటింగ్ ఇంస్టాల్ చేయటం ఎలా అంటే.. ఒక .iso ఫైల్ను సీ.డీ లాగా ఇచ్చి దాని నుండీ ఇంస్టాల్ చేయటమే..

మీకు వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ కావాలంటే ఇక్కడి నుంటి డౌంలోడ్ చేసుకోండి. అన్ని రకముల ఆపరేటింగ్ సిస్టంలకూ సరిపడిన ఫార్మాట్లు అక్కడ లభిస్తాయి.

లినక్స్ లోపల విండోస్, విండోస్ లోపల లినక్స్ వాడుకొనే అవకాశముంది.

మీరు ఎంత RAM దీనికి కేటాయిస్తే అంత ఈ సాఫ్ట్వేరు వాడుకొంటుంది.

పనితీరు ఎలా అంటే. ఉదాహరణకు మీరు విండోస్ వాడుతున్నారనుకోండి. వీండోస్ లో ఈ సాఫ్ట్వేర్ను(virtual machine) ఇంస్టాల్ చేసి, ఆ సాఫ్ట్వేర్ ఆధారంగా, అందులో సృస్టించబడిన కంప్యూటర్లో ఇంకొక ఆపరేటింగ్ సిస్టంను, అది ఏదైనా కావచ్చు(లినక్స్ లేదా విండోస్ లేక మరేదైనా), ఇంస్టాల్ చేయటం. మనమెప్పుడు కావలిస్తే అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఆధారంగా మరొక ఆపరేటింగ్ సిస్టంను ప్రస్థుతం వాడుతున్న ఆపరేటింగ్ తో పాటుగా ఒక విండో లోపల వాడుకో వచ్చు. బొమ్మలలో ఉదాహరణలు చూడండి.

Read more
0

ఫైయర్-ఫాక్స్ లో ఇంటర్‌నెట్ ఎక్‌స్‌ప్లోరర్ ట్యాబు


లక్ష్యం:
గమనిక : ఇది విండోస్ వాడుకరులకు మాత్రమే! ఉదాహరణకు ఈనాడు వెబ్‌సైట్ ఫైయర్-ఫాక్స్ లో మనకు అర్థం కానీ అక్షరాలలో కనిపిస్తుంది, మరి కొన్ని వెబ్‌సైట్లు అవి కనపడే విధానాన్ని కొల్పొతాయి. కొన్నివెబ్‌సైట్లలో లభించే ఆటలు ఆడటం వీలుకాదు. ఇలాంటి సమస్యలు మరెన్నో ఉంటాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో ఆడ్-ఆన్ ఇన్‌స్టాల్ చేసుకోవటం కన్నాIE Tab ఆడ్-ఆన్ వాడటం సులువు.

ఫైయర్-ఫాక్స్ యొక్క ప్రయోజనాలు చాలామందికి తెలిసినవే. మీరు వాడాలనుకుంటే ఇక్కన్నుటి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కానీ ఇప్పటిదాకా ఒక ఆటంకం ఉండేది

వాడటం ఎలా?
మీ ఫైయర్-ఫాక్స్ బ్రౌసర్ నుండి ఈ లంకెకు(వెబ్‌సైట్) వెళ్లండి. అక్కడ Add to Firefox(Windows) అన్న బటన్ను నొక్కండి, కొత్తగా వచ్చిన విండోలో Install బటన్ను నొక్కండి. ఫైయర్-ఫాక్సును రీ-స్టార్ట్ చేయండి (క్లోజ్ చేసి మరో మారు తెరవండి).

ఇక నుంచీ మీరెప్పుడైనా ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్లో చక్కగా కనపడుతూ ఫైయర్-ఫాక్సులో సరిగ్గా కనపడని వెబ్‌సైట్ చూస్తున్నప్పుడు, ఆ వెబ్‌సైట్లో రైట్ క్లిక్ చేసి, వచ్చిన మెనూ నుంటి View tab in IE Tab అన్న ఆప్షను ఎంచుకొంటే (బొమ్మలో చూపినట్టుగా) ఆది ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్లో కనిపించినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది.




Read more
0

టోరెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా?

లక్ష్యం:
టోరెంట్లను ఎలా డౌంలోడ్ చేసుకోవాలి అన్నది ఇక్కడ తెలుసుకొంటారు. టొరెంట్ల సాయంతో ఇతరులు అందుబాటులో ఉంచిన ఫైల్లను డౌంలోడ్ చేసుకొనే ఒక పద్దతి.

1. మన అవసరాన్ని బట్టీ ఒక Torrent Clientను ఎంచుకోవలి. కొత్తగా వాడేవారికి uTorrent ఐతే సరిపోతుందని నా అభిప్రాయం. ఇలా చాలా ఉన్నయి, కొన్నింటిని క్రింద పేర్కొన్నాను, అక్కడి నుండి వాటిని డౌంలోడ్ చేసుకొనవచ్చు.

Opera ఒక బ్రౌజర్, ఇందులో torrentలను కూడా డౌంలోడ్ చేయవచ్చు.

uTorrent ఐతే కేవలం 300KBలకన్నా తక్కువే ఉంటుంది.

2. దానిని ఇంస్టాల్ చెయ్యండి. ఇది ఒకసారి చేస్తే సరిపోతుంది.

3. మీకు కావలసిన డౌంలోడ్ కోసం క్రింద తెలిపిన ఏ వెబ్ సైట్లోనైనా లేదా గూగుల్లోనైనా వెతకవచ్చు.

ఒక వేళ మీరు గూగుల్లో సెర్చ్ చేయదలచితే మీరు వెతుకుతున్న పదానికి torrent అనే పదాన్ని జోడించి వెతకండి.

ఈ టోరెంట్లు డౌంలోడ్ చేసుకోవటానికి అది ఎవరి దగ్గరైనా ఉండాలి, మరియూ వారు దానిని సీడ్ చేసి ఉండాలి, సామాన్యంగా ఏదైన కొత్తది లేక బాగా పేరున్నది ఐతే దొరికే అవకాశం ఎక్కువ. ఉదాహరనకు కొత్త english సినిమా లేక హిందీ సినిమా లేక ఏదైనా హిట్ సినిమా. ఇవి ఉదాహరనకు తీసుకున్నానే తప్ప, కేవలం సినిమాలే దొరుకుతయన్నది నా ఉద్దేశం కాదు.

4. మీరు వెతికిన పదానికి సంబంధించిన టోరెంట్ దొరకగానే దాన్ని డౌంలోడ్ చెయ్యండి. ఇది సాధారనంగా 50KB కన్నా తక్కువగానే ఉంటుంది.కానీ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, ఇందులో seeds కనీసం ఒక్కటైనా ఉండాలి. Seedలు ఎందరున్నారనేది torrentను వెబ్ సైట్లో నుండి మీరు డౌంలోడ్ చేసుకొనేటప్పుడే చూసుకోవటం మంచిది, ఎలాగైనా మీ torrent client ఎన్ని seedలు ఉన్నాయనేది చూపిస్తుందనుకోండి, ఒకసారి చూసుకోవటం మంచిది.

5. మామూలుగా డౌంలోడ్ చేయమని క్లిక్ చేసిన వెంటనే డౌంలోడ్ చేసిన తరువాత ఏం చెయ్యలని అడుగుతుంది, మీరు ఇంస్టాల్ చేసిన ఆ torrent client సాఫ్ట్వేర్ తో ఓపెన్ చేయమనండి.

ఒక వేళ అడగకపోతే, దానిని మీరు సులభంగా గుర్తించదగ్గ ప్రదేశంలో సేవ్ చేసుకోండి. మీరు ఇంస్టాల్ చేసిన torrent clientను తెరిచి అందులోకి మీరిప్పుడే డౌంలోడ్ చేసిన టోరెంట్ ఫైల్ ను లాగివెయ్యండి(ఆ ఫైల్ ను క్లిక్ చేసి పట్టుకొని తెరిచి ఉన్న torrent client విండోలోకి తెచ్చాక వదలండి).

6.ఇక దానంతట అదే డౌంలోడ్ చేసేస్తుంది.




Read more
0

ఫ్రీవేర్, ఒపెన్ సోర్స్, షేర్ వేర్ మద్య వ్యత్యాసం ఏమిటి?



లక్ష్యం:
ఓపెన్ సోర్స్, ఫ్రీవేర్, షేర్ వేర్. ఈ మూడూ ఉచింగా లభించేవే, కానీ వీటి మద్య చాలా పెద్ద తేడాలే ఉన్నయి. ఇవి గమనించకపోవటం వళ్ళ మామూలు వాడుకరులకు నస్టం చిన్నదే ఐనా వ్యాపారులకు మాత్రం మంచి అవకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయి. వీటిని గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం...

ఫ్రీవేర్ :

ఈ పదాన్ని మరీ ఎక్కువగా వాడేయటం వలన దీని అర్థంలో ప్రస్థుతం స్పస్టత లేదు.

“ఫ్రీవేర్ ఉచితంగా లభిస్తూ, డౌంలోడ్ చేసుకోవటానికీ, వాడటానికీ, ఇతరులతో పంచుకోవటానికీ ఎటువంటి నిర్బందములూ లేనటువంటిది.”

శాస్త్రీయంగా ఓపెన్ సోర్సు మరియూ ఫ్రీవేర్ల మద్య తేడా ఏమిటంటే, ఓపెన్ సోర్సుల యొక్క కోడ్ను మనం చూడవచ్చు(లభిస్తుంది). అంటే, ఫ్రీవేరుకు ఓపెన్ సోర్సులా ఒక వ్యవస్థ కానీ, మెరుగు పరిచే విదానాలు కానీ ఉండవు.

కాబట్టి ఒక ఫ్రీవేరును, ఎలా ఉందో అలానే వాడాలే తప్ప, దానిని మెరుగు పరిచేదారి దొరకదు మరియూ సహాయము పొందుటకు వీలూ కాదు.

షేర్ వేర్ :

ఇదొక బిన్నమైన కాంసెప్టు. ఇది డౌంలోడ్ చేయటానికీ పరిక్షించటానికీ ఉచితమే, కాని వాడాలనుకుంటే మాత్రం డబ్బు కట్టాల్సిందే. వాడుకరికి కోడ్ను చూసేటటువంటి లేదా మార్చేటటువంటి స్వేచ్చా ఉండవు. పూర్తిగా దానిని తయారు చేసే సంస్థ చేతుల్లోనే దాని బాగోగులు ఉంటాయి. ఎలాంటి ఇతర వ్యవస్తలకూ ఇందులో స్థానము ఉండదు.

కొనవలసిన సాఫ్ట్వేర్లకూ వీటికీ మద్యనున్న తేడా ఒక్కటే, వీటిని డౌంలోడ్ చేసుకోవటం మరియూ ట్రై చేయటం మాత్రమే ఉచితం, పూర్తిగా వాడుకోవాలంటే డబ్బు కట్టాల్సిందే.

అంగట్లో మనకు స్యాంపెల్లు పరిక్షించటానికి ఇచ్చినట్టుగా అన్నమాట వీటి సంగతి.

ఓపెన్ సోర్సు :

ఇవి వాడగలిగినవారందరికీ లభిస్తాయి. వీటిని వాడటానికీ పంచటానికీ మార్చటానికీ ఎటువంటి నిబందంలూ ఉండవు. ఇందులో ఫ్రీ అనగా కోడ్ను అందరూ చూడటానికి గల స్వతంత్రత.

ఫ్రీవేర్లలా కాకుండా, వీటికి మెరుగులు దిద్దే అవకాశం ఉంది, షేర్ వేర్లలా కాకుండా, వీటికొరకు ఒకే సంస్థ పై ఆధారపడనవసరం లేదు.

ఉదాహరణలు :

ఫ్రీవేర్ : ఒక విద్యార్థి లేదా ఎవరైనా ఒక సామర్థ్యం కల వ్యక్తి దీనిని తయారు చేస్తారు.

షేర్ వేర్ : ఒక సాప్ట్వేర్ కంపెనీ వారి సాఫ్ట్వేర్ ప్రచరం కొరకు తయారు చేస్తారు.

ఓపెన్ సోర్సు : ఏదైనా పెద్ద సాఫ్ట్వేరు ఉచితంగా లభిస్తోంది అంటే అది ఓపెన్ సోర్సుదే.

Linux, Apache, FreeBSD, Open Office, PostgreSQL వంటివి ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్లే…

ఈ వ్యత్యాసాలు పరిగనించాలా?

చూడటానికి ఇవేవో న్యాయవ్యవస్తతో పని పడ్డప్పుడు పట్టించుకోవలసిన మాటల్లా కనిపించవచ్చు, కానీ నిజానికి వీటిని గుర్తించకపోవటం ఓపెన్ సోర్సు సాప్ట్వేర్ల అభివ్రుద్దికి ఆటంకమవుతుంది. కొన్ని సమయాల్లో ఫ్రీవేర్లు మరియూ షేర్ వేర్లు, adwareలు లేదా malwareలతో కూడి ఉంటాయి, వీటిని ఓపెన్ సోర్సులగా పొరపాటుపడే కంపెనీలు వీటి వైపు శ్రద్ద వహించవు, చివరకు ఎక్కువ కర్చులు చేస్తూ ఉంటాయి. సధారణ వాడుకరులు కూడా ఇలా మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదముంది, అలాగే షేర్ వేర్లను ఓపెన్ సోర్సులుగా బ్రమపడి సమయం వృదా చేసుకొనే ప్రమాదమూ ఉంది…

ఇక సాధారణంగా పొరపాటు పడే విషయమేమిటంటే RedHat Enterprise Linux(RHEL)ను ఓపెన్ సోర్సు కాదు అని అనుకోవటం. RHEL యొక్క కోడు విడి విడిగా ఉచితంగా లభిస్తుంది, కానీ దానినంతటినీ ఒకే సాఫ్ట్వేరుగా వారు మలచలేదు. ఇది ఒకే సాఫ్ట్వేరు రూపములో కావలసినా లేక దీనిని వాడుతున్న వారికి సపోర్టు కావలసినపుడు మాత్రమే డబ్బు కట్టవలసి ఉంటుంది. ఇవేవీ అవసరం లేదు డబ్బు కట్టకుండా ఉచితంగా లభించే కోడ్ను నేనే(మేమే) సేకరించి RHELను ఏ సహాయమూ లేకుండా వాడుకొంటాను(ము) అంటే, అలా కూడా చేయవచ్చు.



Read more
0

సోనీ గేమ్స్ - భారతీయ భాషల్లో


సంక్షిప్తంగా:
మీరు హనుమాన్ గేమ్‌ గురించి విన్నారా? హా! అలాంటివే మరిన్ని కలనయంత్రం-ఆటలతో అలరించడానికి సోనీ సిద్దమవుతోంది. హనుమాన్ గేమ్‌ భారతదేశపు ఆటగాళ్ళను బాగా ఆకర్షించడమే సోనీ ని ఇలాంటి ఆటల్ని తయారుచేయడానికి మరింత ఉసిగొల్పింది.

భారతదేశంలో కలనయంత్రంలో ఆటలకి, ప్రపంచంలో మిగతాచోట్ల, అంటే, యూరప్, అమెరికా లాంటి దేశాల్లో ఉన్నంత ప్రచారం, ప్రసిద్ది ఇంకా లేవు. కానీ, మన దేశంలో ఉన్న కథలతో, ఇతిహాసాలతో ఎన్నో, ఎన్నెన్నో అద్భుతమైన ఆటలు తయారుచేయవచ్చనే సదావకాశన్ని చేజిక్కించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు, ఫలితాలు సాధిస్తున్నారు కూడా!

అలాంటి ప్రయత్నాల్లో చెప్పుకోదగ్గ పెద్ద ప్రయత్నం, ఫలించిన ప్రయత్నం, హనుమాన్ ఆట! బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం, అసలు హనుమాన్ గేమ్‌ ని రిలీజ్ చేసిన రోజే 10000 వేల యూనిట్లు అమ్ముడుపోయాయంట. మామూలుగా ఐతే ఇలాంటి ఒక అంతర్జాతీయ గేమ్‌ టైటిల్ 3000-4000 యూనిట్ల దాకా అమ్ముడుపోతాయి. మొత్తం మొదటి సం॥నికి గాను ముందు 30000 యూనిట్లు గమ్యం పెట్టుకున్నా, అంతా కలిపి 50000 యూనిట్ల దాకా‌అమ్ముడుపోయాయని సోనీ యాజమన్యం పేర్కొంది. హైదరాబాద్ లో ఉన్న అరోనా టెక్నాలజీస్ అనే సంస్థ హనుమాన్ గేమ్‌ ని తయారు చేసింది. హైసియా వారు పెట్టిన Product Showcase లో దీన్ని చూశాను. 7-14 ఏళ్ళ పిల్లలకైతే హనుమాన్ గేమ్‌ బావుంటుందని అరోనా యాజమాన్యం పేర్కొంది.

బెల్టులు బిగించి ఆటపాటలకి సిద్దం కండి! సోనీ కంపెనీ ఆటలకి పెట్టింది పేరు. మంచి మంచి ఆటలు మన ముందుకు తెస్తుందని ఆశిద్దాం.




Read more
0

గ్రబ్ ఎడిట్ చేయటం ఎలా?


లక్ష్యం:
మీరు కంప్యూటర్ ఆన్ చేయగానే, మీ కంప్యూటర్లో లినక్స్ కనుక ఇంస్టాల్ చేసి ఉన్నట్టైతే, ఒక లిస్టు వచ్చి అందులోంచి ఏ ఆపరేటింగ్ సిస్టం కావాలో ఎంచుకోమంటుంది. దీన్నే గ్రబ్ అంటాం. కొంత సమయం ఇస్తుంది, సామాన్యంగా మూడు లేదా పది సెకంలు ఇస్తుంది. ఆ లిస్టులో ఉన్న పేర్లు, వాటి సంఖ్య మరియూ నిర్నయం తీసుకోవటానికి కేటయించిన సమయం, వీటిని మార్చటం ఎలా?
మీరు లినక్స్లోకి బూట్ అవ్వలి, టెర్మినల్ ను తెరవాలి. క్రింద తెలిపిన కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కాలి.

sudo gedit /boot/grub/menu.lst

ఒక వేళ మీరు gedit బదులుగా వేరే ఎడిటర్ వాడుతున్నటైతే, ఆ ఎడిటర్ యొక్క కమాన్డును టైప్ చేయండి. ఉదాహరణకు మీరు vim వాడుతున్నటైతే క్రింద చూపిన విదంగా టైప్ చేయాలి.

sudo vim /boot/grub/menu.lst ------- optional command

అలా చేయగానే మీ ఎడిటర్లో ఒక ఫైల్ తెరుచుకొంటుంది.

అందులో ఎక్కడైతే ‘#’ గుర్తు మొదట్లో ఉంటుందో ఆ లైన్ల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. వాటిని మనం పట్టించుకోనవసరం లేదు.

ఒక లైన్ లో default 0 ఇలా కనిపిస్తే, మనం ఏ అప్పరేటింగ్ సిస్టమ్ను టైమౌట్ తరువాత బూట్ చేయాలి అన్నదాన్ని default తరువాత ఉన్న సంఖ్య నిర్నయిస్తుంది. దీన్ని 2గా మరిస్తే మూడవ లైన్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ను టైమౌట్ తరువాత బూట్ చేస్తుంది.

2 గా మారిస్తే మూడో ఆపరేటింగ్ సిస్టం బూట్ చేస్తుంది.
0 – మొదటిది
1 – రెండోది
2 – మూడోది

మీరు కెర్నేల్ను అప్డేడ్ చేసిన ప్రతిసారీ, ఈ లిస్టులో కొత్త లైన్లు వచ్చి చేరుతాయి, కావున పైన తెలిపిన సంఖ్యను మార్చకపోవటమే మంచిది.

మరొక లైన్ లో timeout 10 అని కనిపిస్తే. దీని సంఖ్యను 20గా మరిస్తే 20 సెకంలు వేచి ఉంటుంది.

క్రిందకు స్క్రోల్ చేస్తే క్రింద చూపిన విదంగా పేరాలు ఉంటాయి.

title Ubuntu 8.10, kernel 2.6.27-14-generic
uuid e588c42f-0eea-b38b-532dde0f2106
kernel /boot/vmlinuz-2.6.27-14-generic root=UUID=e588c42f ro quiet splash
initrd /boot/initrd.img-2.6.27-14-generic
quiet

ఇక్కడ title అని మొదటి లైను ఉంటుంది, దాని ముందు ‘#’ గుర్తు పెట్టినట్టైతే అది గ్రబ్ లో కంపడదు. ఇలా మీరు వద్దనుకున్న వాటన్నిటి ముందూ ఈ గుర్తుని పెట్టండి.

title Ubuntu 8.10, memtest86+ ఇలాంటిది ఏదైనా ఉంటే, దాని ముందు # గుర్తుని ఉంచకండి.

title Gavesh’s Linux అని మారుస్తే గ్రబ్ లో కూడా ఇలానే వస్తుంది. మీ పేరు పెట్టండి.

ఇక సేవ్ చేసి క్లోజ్ చేసేయండి. ఇక రీబూట్ చేయగానే మీరు చేసిన మార్పులతో గ్రబ్ వస్తుంది.




Read more
0

టెర్మినల్ అనగా ఏమిటి?

లక్ష్యం:
టెర్మినల్ ఎందుకు? ఎలా తెరవాలి? అందులో ఏమేమి చేయవచ్చు అన్న విషయానికి ఉదాహరణ ఇక్కడ తెలుసుకుందాం.

టెర్మినల్ని కన్సోల్ అని కూడా అనవచ్చు. లినక్స్ లో ప్రతి పనినీ చెయ్యటానికి దీనిని వాడవచ్చు. ఇందులో ఒక్కొక్క పనికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కమాండ్లను కలిపి వాడవలసి ఉంటుంది.

టెర్మినల్ని తెరవటం ఎలా?

Alt + F2 నొక్కగానే ఒక చిన్న విండొ వస్తుంది. అక్కడ gnome-terminal అని టైప్ చేసి Enter నొక్కండి, టెర్మినల్ తెరుచుకుంటుంది.

ఉదాహరణ :

మౌస్ తో లేదా గ్ర్యాఫికల్ యూసర్ ఇంటర్‌ఫేస్(GUI) తో చేసే ప్రతి పనీ ఇందులో చెయ్యవచ్చు. కొన్ని పనులు పదే పదే చేయవలసిన అవసరం ఉంటుంది, వీటిని సునాయాసంగా టెర్మినల్ కమాండ్ల తో చెయ్యవచ్చు.

ఉదాహరణకు మీ కంప్యూటర్‌లో చిందరవందరగా ఏ డ్రైవ్‌లో అంటే ఆ డ్రైవ్‌లో పడి ఉన్న పాటలన్నింటినీ లేదా ఫోటోలన్నింటినీ ఒకే చోటకు చేర్చాలి. మామూలుగా చేస్తే దీనికి చాలా సమయం పడుతుంది (2 లేదా 3 గంటలు).

అదే టెర్మినల్ సాయంతో మన ప్రమేయం లేకుండా, దానంతటదే మన పాటలన్నింటినీ 10నిమిషాల్లో ఒకే చోటికి చేరుస్తుంది. ఇలా మనం ఊహించగలిగినది ఏదైనా చేయవచ్చు.




Read more
0

గూగుల్ పత్రాల్లో అనువాద ఉపకరణం


సంక్షిప్తంగా:
ఒక భాషలో ఉన్న పత్రాన్ని ఇంకో భాషలోకి తర్జుమా చేయాలంటే, ఒకటి - అది చాలా బోరింగ్ పని. రెండు - అలాంటి పత్రాలు ఎన్నున్నాయో ఏమో! ఇదివరకు గూగుల్ అనువాదాలు లభ్యత ఉన్నా వారి వివిధ సేవల్లో ఆ అనువాద ప్రక్రియని పరిచయం చేసే సాహసం ఎందుకో చేయలేదు. కాని చివరికి గూగుల్ పత్రాల్లో దీన్ని అమలుపరిచారు.

ఖచ్చితత్వం ఏమంతా ఇంప్రెసివ్ గా లేకపోయినా, పనితీరు దృష్ట్యా ఏదో పర్వాలేదు అనిపించుకుంటుంది. కానీ మొత్తం పత్రాన్ని మనమే మాన్యువల్ గా తర్జుమా చేయడం కంటే, ముందు దీంతో ఓ దఫా ప్రయత్నించేసి ఆ వచ్చిన రిజల్టుని సరిచేసుకుంటే పని తగ్గుతుంది. పైగా విదేశాల్లోగాని, భాషరాని ప్రదేశంలో గాని ఉన్నట్టైతే ఇది బాగానే అక్కరకొస్తుంది. ప్రయత్నించి చూడండి. గూగుల్ పత్రాలు తెరిచాక, ఒక పత్రాన్ని తెరిస్తే, ఆ పేజీలో ఉన్న మెనూలో ఉపకరణాలు లో "పత్రాన్ని అనువదించు" అనుంటుంది, అది నొక్కితే ఎన్ని భాషల్లోకి అనువదించవచ్చో కనబడుతుంది. పక్కనే ఉన్న బొమ్మలో కూడా చూడొచ్చు. ఇంకా తెలుగుకి ఇందులో సపోర్ట్ లేదు, త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.




Read more
0

ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?


లక్ష్యం:
ఇప్పుడు చాలా సైట్లు ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ఉంటున్నాయి. ఐతే అలా తెలుగు లో ఉన్న సైట్లు ఆటోమాటిక్ గా ఏ సమస్యా లేకుండా మీకు తెలుగు లో కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా? రెండే స్టెప్పులు! మీరు వాడుతున్న విహారిణి ఏంటో తెలుసుకుని, దాన్నిబట్టి ఈ క్రింద వాటిలో మీకు ఏది వర్తిస్తుందో అదిచేయండి.

ఫైరుఫాక్సు వాడుతున్న వారు, ఫైరుఫాక్సు తెరిచి

  1. విండోస్ లో ఐతే Tools > Options కి, లినక్సు లో ఐతే Edit > Preferences కి వెళ్ళండి. అక్కడ content ట్యాబు లో Languages ఉన్న చోట Choose క్లిక్ చేయండి. అక్కడ వచ్చిన లిస్టుకి తెలుగుని కలిపి, ఆ కలిపిన తర్వాత తెలుగు ని ఎంచుకుని, అది ఆ లిస్టులో అన్నికంటే పైకి వచ్చేదాకా "Move up" కొట్టండి. ఇప్పుడు OK కొట్టేయండి. చివరికి ఇదిగో ఈ క్రింద చూపించినట్టు ఉండాలి.
  2. ఆ content ట్యాబు లోనే, "Fonts & Colors" లో "Advanced" ని క్లిక్ చేయండి. అక్కడ Character Encoding అని ఉన్నదాన్ని Unicode (UTF - 8) అన్నదానికి సెట్ చెయ్యండి. ఇప్పుడు OK కొట్టేయండి. ఆ content ట్యాబు ఉన్న విండోని కూడా మూసెయ్యండి. ఇకపై తెలుగులో ఉన్న సైట్లన్నీ మీకు తెలుగులోనే కనబడతాయి.

IE(ఇంటర్నెట్ ఎక్సప్లోరర్) వాడుతున్నవారు, IE తెరిచి

  1. Internet Options తెరిచి, అందులో General ట్యాబు లో క్రింద Languages అని ఒక బటన్ ఉంటుంది. నొక్కి, అక్కడ వచ్చిన లిస్టుకి తెలుగుని కలిపి, ఆ కలిపిన తర్వాత తెలుగు ని ఎంచుకుని, అది ఆ లిస్టులో అన్నికంటే పైకి వచ్చేదాకా "Move up" కొట్టండి. ఇప్పుడు OK కొట్టేయండి. చివరికి ఇదిగో ఈ క్రింద చూపించినట్టు ఉండాలి.
  2. ఈ స్టెప్పు సాధారణంగా అవసరం పడదు. కానీ ఒకవేళ తెలుగు వెబ్ పేజి సరిగ్గా కనబడకపోతే, పాత IE(వెర్షన్ 5,6) లో పైన మెనూలో ఉన్న View లోకి వెళ్ళండి. కొత్త IE(వెర్షన్ 7,8) లో ఐతే మెనూలో ఉన్న Page కి వెళ్ళండి. అక్కడ Character Encoding అని ఉన్నదాన్ని Unicode (UTF - 8) అన్నదానికి సెట్ చెయ్యండి.

క్రోమ్ వాడుతున్నవారైతే, క్రోమ్ తెరిచి

  1. కుడిచేతి వైపున్న రెంచి మార్కు మీద నొక్కి, Options ఎంచుకోండి. అందులో, Minor Tweaks కి వెళ్లి, Fonts & Languages ని నొక్కండి. ఆ వచ్చిన విండోలో, Font and encoding ట్యాబు లో, Encoding ని Unicode (UTF-8) కి మార్చండి. ఇప్పుడు Language ట్యాబుకి వెళ్లి, అక్కడ ఉన్న లిస్టు కి తెలుగు ని కలిపి, అది ఆ లిస్టులో అన్నికంటే పైకి వచ్చేదాకా "Move up" కొట్టండి. ఇప్పుడు OK కొట్టేయోచు, కానీ మీరు క్రోమ్ మొత్తాన్ని తెలుగులోనే వాడాలనుకుంటే, అక్కడే ఉన్న google chrome language ని తెలుగు కి మార్చండి. ఇలా మార్చినప్పుడు ఒక్కసారి క్రోమ్ ని మూసేసి మల్లి తెరవమంతుంది, చేసెయ్యండి. ఇకపై మీరు తెలుగు సైట్లన్నీ తెలుగులో చదువుకోవచ్చు, కోరుకునుంటే క్రోమ్ మొత్తాన్ని తెలుగులో వాడుకోవచ్చు!
  2. రెండో స్టెప్పు లేదులెండి :)

ఒపేరా వాడుతున్నవారైతే, ఒపేరా తెరిచి

  1. Tools > Preferences కి వెళ్లి, General ట్యాబు లో, Language దగ్గర, Details అని ఒక బటన్ ఉంటుంది. అది నొక్కితే ఒక విండో వస్తుంది. అక్కడ "Encoding to assume..." అన్నదాన్ని utf-8 కి మార్చండి. అక్కడే, Preferred languages for web pages లో ఉన్న లిస్టుకి తెలుగుని కలిపి, అది ఆ లిస్టులో అన్నికంటే పైకి వచ్చేదాకా "Move up" కొట్టండి. ఇప్పుడు OK కొట్టేయండి. ఆ general ట్యాబు ఉన్న విండో లో కూడా OK కొట్టేయండి.
  2. దీనికి రెండో స్టెప్పు అవసరం లేదు :)



Read more
0

TreeSize Free తో ఫోల్డర్ సైజులు



లక్ష్యం:
మనం వాడుతున్న హార్డ్ డిస్క్ ఎంత పెద్దదైనా, కొన్నాళ్లకు ఆది నిండిపోక తప్పదు. కానీ అందులొ అన్నీ మనకు కావలసినవి ఉండవు. అనవసరమైన వాటిని తొలగించటానికి ఎక్కడ ఎక్కువ ఖాళీ వృధా అవుతుందో ఒక అవగాహనకు రావాలి. ఈ పనిని సులువుగా చేయటానికి TreeSize Free ఉపయోగపడుతుంది.

ఇన్‌స్టాల్ చెయటం ఎలా?

ఈ లంకెకు(వెబ్‌సైట్) వెళ్ళి డౌన్‌లోడ్(Download) బటన్ని క్లిక్ చేసి, ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకొగలరు.

వాడటం ఎలా?

ఏదైనా డ్రైవ్ లేదా ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి TreeSize Free అన్న ఆప్షన్ను ఎంచుకొంటే, దానిలో ఉన్న ఫైల్ల యొక్క సమాచారాన్ని మనకు చూపుతుంది.

ప్రత్యేకతలు :

ఇది ఒక థ్రెడ్ సాయంతో పనిచేయటం మూలానా, పని జెరుగుతున్న కొద్దీ ఫలితం చూపుతుంది.

ప్రింట్ తీసుకొనే సదుపాయం కూడా కలదు.

KB, MB మరియు GBలలో వాడకాన్ని చూడవచ్చు.



Read more
0

సర్వత్రా జోహో గాడ్జెట్లు


సంక్షిప్తంగా:
ఇకపై జోహో అప్లికేషన్లు సర్వత్రా ఉపయోగించుకోవచ్చు. అంటే, జీ-మెయిల్, ఐగూగుల్, ఆర్కుట్, ఫేస్‌బుక్, మీ మీ వెబ్‌పేజీల్లోనూ వాటిని ఇనుమడింపజేయొచ్చు. ప్రస్తుతానికి ఈ గాడ్జెట్లు పత్రములకి(డాక్స్), వేగులకి(మెయిల్), సంపర్కాలకి(కాంటాక్ట్స్), ప్లానర్, కాలెండర్లకి అందిస్తున్నారు.

జోహో సంస్థ జాలంలో అటు గూగుల్ తోనూ, డెస్క్ టాప్ అప్లికేషన్ల విషయంలో ఇటు మైక్రోసాఫ్ట్ తోనూ పోటీ పడుతుంది. ఇప్పటివరకు తను అందించిన సేవలకు గానూ మంచి పేరే సాధించుకుంది. ఇంకో అడుగు ముందుకేసి, ఆ సంస్థ అందించే సేవలన్నీ మరింత సులువుగా ఉపయోగించడానికి వీలుగా ఈ గాడ్జెట్లను రీలీజ్ చేస్తూ ఒక వార్తా కథనాన్ని వారి బ్లాగ్ లో ప్రచురించారు. అవి మీరు వాడాలనుకుంటే ఈ జోహో గాడ్జెట్ల పేజీకి వెళ్ళి మిగతా వివరాలు తెలుసుకోగలరు.




Read more
0

గూగుల్ ఉపకరణాలు


లక్ష్యం:
గూగుల్ అంటే గుర్తొచ్చేది శోధన! ఇందులో అది రారాజు, అది ఎవరు ఔనన్న కాదన్నా జగమెరిగిన సత్యం. కానీ గూగుల్ గుత్తాధిపత్యాన్ని నిలిపేది కేవలం శోధన మాత్రమే కాదు. వాళ్ళు అందించే ఎన్నో సేవలు నెటిజన్లకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. చాలా మంది వాళ్ల నిత్యజీవితాల్లో ఇవీ భాగమనే భావిస్తారంటే ఎంత ఉపయోగకరమైనవో ఆలోచించండి. వాటి గురించి తెలుసుకోండి.

మెయిల్

ఇదివరకంటే ఉత్తరం కోసం పడిగాపులు గాని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులేమీ లేవు. అలా మెయిల్ కొడితే ఇలా అందుకోవచ్చు. అలాంటి మెయిల్ సర్వీసులలో బాగా పేరు మోసిన గూగుల్ మెయిల్ లో ఎన్ని సౌకర్యలున్నాయో అంతే తేలికగా వాడుకోవచ్చు! ఇప్పటి వరకు మీకు జిమెయిల్ లో ఎకౌంటు లేకపోతే ఇక్కడ నొక్కి సృష్టించుకోండి. మీ జిమెయిల్ ఎకౌంటు ని తెలుగులో చూసుకోవాలి అనుకుంటే, settings అని పైన ఉంటుంది, అది నొక్కితే వచ్చిన పేజిలో General లో Language అని ఉంటుంది. అక్కడ తెలుగు ఎంచుకోండి. ఒకవేళ మీకు తెలుగులో టైపు చెయాలని ఉంటే అక్కడే "Enable Transliteration" ని టిక్ చేసి దాని క్రిందే ఉన్న "Default Transliteration Language" లో తెలుగు ఎంచుకోండి. ఇప్పుడు బాగా క్రిందకి వచ్చి "Save changes" కొట్టేయండి. ఇకపై జిమెయిల్ తెలుగులో కనిపిస్తుంది.

లిప్యంతరీకరణ(Transliteration) అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, లిప్యంతరీకరణ అంటే తెలుగుని ఇంగ్లీష్ లో టైపు చేయడం అన్నమాట. అంటే చాట్ భాష :) అర్థం కావడానికి ఈ క్రింది ఉదాహరణ చూడండి.

amma - "అమ్మ" గా మారుతుంది.
nenu school ki vellanu - "నేను స్కూల్ కి వెళ్ళను" గా మారుతుంది.

ఒకవేళ మీరు అనుకున్నట్టు రాకపోతే సరిచేసుకోవడం చాలా తేలిక. ఏదైతే పదం సరిగ్గా రాలేదో ఆ పదం దగ్గరికి వెళ్లి "Backspace" నొక్కినా, ఆ పదం మీద క్లిక్ చేసిన, మీరు టైపు చేసిన ఇంగ్లీష్ అక్షరాలకిఇంకా దగ్గరి తెలుగు పదాలు చూపిస్తుంది. వాటిల్లోంచి మీరు అనుకున్న పదం ఎంచుకోండి.

ఇవన్నీ ఎందుకయ్యా, మేము తెలుగుని తెలుగు కీబోర్డు మీదే టైపు చేస్తాం అంటే మరీ మంచిది :) అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి. జిమెయిల్ గురించి మరింత సమాచారం కోసం టెక్ సేతు లో శోధించండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వార్తలతో తాజకరిస్తూ ఉంటాం.

డాక్స్

గూగుల్ డాక్స్ అంటే ఆన్‌లైన్ ఆఫీసు సాఫ్ట్వేర్ అనే చెప్పుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీసు సాఫ్ట్వేర్ లో ఉన్నన్ని ప్రయోజనాలు ఇందులో లేకపోయినప్పటికీ దీనికున్న ప్రయోజనాలు వాంఛనీయం! ఇంతకీ ఆఫీసు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? లావాదేవీలు, డాక్యుమెంట్లు, ప్రెజంటేషన్లు లాంటివన్నీ ఈ ఆఫీసు సాఫ్ట్వేర్ లోనే చేస్తారు. దాదాపు కంప్యూటర్ వాడేవరందరికీ దీని అవసరం తప్పనిసరిగా ఉంటుందనే చెప్పొచ్చు! కాబట్టి ఒకవేళ మీ దగ్గర మైక్రోసాఫ్ట్ ఆఫీసు సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోయినా ఒకసారి గూగుల్ డాక్స్ మాత్రం చూడండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, ఇది మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ ఐన సాఫ్ట్వేర్ కాదు. మీరు సృష్టించి సేవ్ చేస్కున్న డాక్యుమెంట్లన్నీ ఏ ప్రదేశంలో ఐనా, ఏ సిస్టంనుంచి ఐనా విహారిణి సహాయంతో చుస్కోవచ్చు, మార్చుకోవచ్చు. అదే కాక, స్నేహితులతో గాని, ఇంకొంతమంది వ్యక్తులతో కానీ, ఒక గ్రూప్ తో గాని పంచుకోవాలంటే చాలా తేలికగా చేయవచ్చు.(గ్రూప్ అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే ఈ టపా చివర్లో చూడండి)

మీరు గూగుల్ డాక్స్ ని తెలుగులో వాడుకోవలనుకుంటే మీ గూగుల్ డాక్స్ ఖాతాకు వెళ్లి అక్కడ పైన ఉన్న "Settings" ని నొక్కి, "Language" ని తెలుగు గా ఎంచుకోండి. ఇకపై గూగుల్ డాక్స్ మీకు తెలుగులోనే కనిపిస్తుంది.

క్యాలెండర్

మీ పనులన్నీ చక్కబెట్టి చూసుకోవడానికి గూగుల్ ఫ్రీగా ఇచ్చే పర్సనల్ సెక్రటరీయే గూగుల్ క్యాలెండర్! ఇందుల్లో మనం మన పనులు ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడో, ఎవరెవరు అందులో భాగస్వాములో, ఏయే రోజుల్లో అదే పని పునరీకృతమవుతుందో చూసుకోవచ్చు. అంతే కాదు, మన దగ్గరవాళ్ళ పుట్టిన రోజులు, పండగలు-పబ్బాలు ఒక్కసారి నోట్ చేస్కుంటే చాలు, ఇంక జీవితకాలం మొత్తం మనకి గుర్తుచేస్తుంది. హా! గుర్తు చేయడం అంటే మనం సైట్ తెరిచి చూడనక్కర్లేదు, మన మొబైల్ నెంబర్ ఇస్తే సమయానికి అదే మెసేజ్ పంపిస్తుంది. అలాగే మనకి 24x7 ఇంటర్నెట్ సదుపాయం ఉంటే మన కంప్యూటర్ మీద క్యాలెండర్ కో, మొబైల్ లో ఉన్న క్యాలెండర్ కో కూడా దాన్ని అనుసంధానించుకోవచ్చు. ఇంతేనా అనుకుంటే ఇంకా ఉన్నాయ్! మన క్యాలెండర్ మన స్నేహితులతో పంచుకోవచ్చు. అప్పుడు మనం ఎప్పుడు ఖాళీగా ఉంటామో, ఎప్పుడు బిజీగా ఉంటామో వాళ్ళకి తెలుస్తుంది.

ప్రయత్నిస్తారా మరి? :)

రీడర్

ఇంటర్నెట్ వచ్చాక సమాచారం అతిపెద్ద సముద్రంలా గోచరిస్తుంది! అంత పెద్ద కడలిని ఈదాలంటే మనకు కావాల్సిన కొద్ది పాటి సమాచారాన్నే ఏరుకుని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. కానీ మనకు కావాల్సినవన్నీ ఒకేచోట నిక్షిప్తమయ్యి, మనం మళ్లీ మళ్లీ ఆ సైట్లకు వెళ్ళనక్కర్లేకుండా వాటిల్లో కొత్త సమాచారం వచ్చినప్పుడే, ఆ సమాచారాన్ని మనకు చూపిస్తే బావుంటుంది కదూ? ఇంక మనం మెచ్చిన సమాచారాన్ని నలుగురితో పంచుకోవడానికి ఒక సదుపాయం ఉంటే ఎంత సంతోషం? మనకి ముఖ్యం అనుకున్నవి గుర్తుపెట్టుకునేల ఒక సౌలభ్యమ్ ఉంటే ఎంత హాయి? ఇవన్నీ కలుపుకునే గూగుల్ వారు గూగుల్ రీడర్ ని అందించారు. కొన్నాళ్ళ తర్వాత మనం ఏం చదువుతున్నామో, ఏది అప్రస్తుతమని వదిలేస్తున్నమో ఇలాంటివన్ని లెక్కలతో సహా చూపిస్తుంది. సమాచారాన్ని ప్రేమించే వారు తప్పక చూసి వాడాల్సినసాయుధమిది :)

గ్రూపులు/గుంపులు

నలుగురు కలిస్తే అదో గ్రూపు! ఎందుకు కలిసారో, ఎలా కలిసారో అనవసరం. ఒక్కొక్కర్నీ సంప్రదించే బదులు ఇప్పుడు ఆ నలుగుర్ని కలిపి ఒక గ్రూపుగా సంప్రదించవచ్చు. అది మీ వ్యక్తిగతం కావచ్చు. ఆఫీసు పనే కావచ్చు, సరదాకైన సరే కావచ్చు, లేదూ ఇంకేదైనా కావచ్చు. దీని వల్ల ఉపయోగాలు పైనా చెప్పిన గూగుల్ ఉపకరణాలన్నిటితో ముడి పడి ఉన్నాయి. మెయిల్ ఒక్కరికి బదులు గుంపుకి కొట్టొచ్చు. డాక్యుమెంట్లు ఒకరికి బదులు గ్రూపుతో పంచుకోవచ్చు, ఇలా అన్నమాట. మీకు ఆసక్తి కలిగిన విషయాలపై ఇప్పటికే చాలా గ్రూపులు ఉండి ఉంటాయి. వెళ్లి చేరిపోండి మరి. ఒకవేళ లేకపోతే మీరు ఒకటి సృష్టించి, మీకు తెలిసిన వారిని, తెలియని వారిని ఆహ్వానించి అభిరుచుల్ని, ఆలోచనల్ని పంచుకోవచ్చు.

ఉదాహరణకి, మన తెలుగుబ్లాగు గుంపు ఉంది, చూడండి.


గూగుల్ ఉపకరణాలు కోసం ఇక్కడ నొక్కండి


Read more
0

లినక్స్ లో శాశ్వతంగా డ్రైవ్ లను మౌంట్ చేయటం ఎలా?



లక్ష్యం:
ఏదైనా బొమ్మను వాల్‌పేపర్ గా పెట్టినప్పుడు, ఆ బొమ్మ ఏ డ్రైవ్‌లో ఉందో ఆ డ్రైవ్ ను మౌంట్ చేసేంతవరకూ ఆ బొమ్మ వాల్పేపర్‌గా కనిపించదు. కొన్ని సమయాలలో మాటి మాటికీ డ్రైవులను మౌంట్ చేయటం చిరాకుగా కూడా అనిపించవచ్చు. దీనికి పరిష్కారంగా డ్రైవ్‌లను శాస్వతంగా మౌంట్ చేసే పద్దతినీ, దాని అనర్థాల నుండి బయట పడే మార్గాలనీ ఇక్కడ చూద్దాం.

NTFS Config ( యన్.టీ.ఎఫ్.ఎస్ కాన్‌ఫిగ్ ) అనే సాఫ్ట్వేర్‌ని ఇంస్టాల్ చేసుకుంటే అది మీ డ్రైవ్‌లను చూపుతుంది, ఏవైతే డీఫాల్‌ట్‌గా మౌంట్ కావాలనుకొంటున్నారో వాటిని ఎంచుకోండి.

ఒక వేళ మీ కంప్యూటర్‌లో విండోస్ కూడా ఉంటే, విండోస్‌ని సరిగ్గా షట్‌డౌన్ చేయటం మరవకండి.

మీరు ఒక వేళ NTFS Configను ఏ కారణంగా ఐనా ఇంస్టాల్ చేసుకోలేకపోతే క్రింది ప్రక్రియను పాటించండి.

కమ్యాండ్‌ల ద్వారా :

మీరు ఈ ప్రక్రియను పాటించటానికి ముందు మీరు మీ డ్రైవులన్నింటినీ మౌంట్ చేసుకోవాలి.

1. అవి ఏ పేరుతో మౌంట్ అవుతున్నాయో గమనించండి, ఇవి చూడటానికి మీరు క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేస్తే వాటి పేర్లు చూపుతుంది.

ls /media/

చూపిన పేర్లను నోట్ చేసుకోండి. (గమనిక :‌ Disk అన్నదానికీ disk అన్నదానికీ తేడా ఉంది.)

2. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయగానే ఒక టేక్స్టు ఫైల్ ఓపెన్ అవుతుంది.

gedit /etc/mtab

మీరు ఏ డ్రైవులనైతే మౌంట్ చేశారో, వాటికి సంభందించిన లైంలు క్రింద తెలిపిన విదంగా ఉంటాయి.

/dev/sda6 /media/disk fuseblk rw,nosuid,nodev,uhelper=hal,shortname=mixed,uid=1000,utf8,umask=077,flush 0 0

చివరిలో ఉన్న ఇలాంటి లైన్లు అన్నింటినీ కాపీ చేసుకోండి. ఆ ఓపెన్ ఐన ఫైల్ను మూసివేయండి.

3. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయగానే వేరొక టేక్స్టు ఫైల్ ఓపెన్ అవుతుంది.

sudo gedit /etc/fstab

ఇందులో చివరిలో మీరు కాపీ చేసుకున్న లైంలను పేస్ట్ చేయండి.(Enter నొక్కిన తరువాత కొత్త లైనులో పేస్టు చేయాలి)

ఒక వేళ fuseblk అని ఎక్కడైనా కనబడితే, దాన్ని ntfsగా మార్చండి.

Save చేసి దీనిని మూసివేయండి.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

పొరపాటుగా విండోస్ ను(ఒక వేళ మీ కంప్యూటర్లో ఉంటే) సరిగా Shutdown చేయనట్టైతే చిక్కుల్లో పడతారు. దీనికి పరిష్కారం క్రింద తెలిపిన ప్రక్రియను జాగ్రత్తగా పాటిస్తే చాలు.

1. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయండి. అన్ని డ్రైవులూ unmount అవుతాయి. ఇలా చేసేటప్పుడు ఏ డ్రైవునుంటి కూడా ఫైల్లను వాడుతూ ఉండరాదు. అంటే పాటలు సినిమాలూ ఇలాంటివి అన్నమాట.(అవి ఈ డ్రైవుల్లో ఉంటేనే).

sudo umount -a

2. ఇప్పుడు, క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో ఒక్కొక్క డ్రైవ్ కూ ఒక్కొక్క సారి వాడవలసి ఉంటుంది.

sudo mkdir /media/disk —- ఇక్కడ disk అన్నది డ్రైవ్ పేరు. ఇలా ప్రతి డ్రవ్ కూ చేయాలి( disk అని ఉన్న స్థానంలో మీరు ls /media/ అన్న కమాండ్ నుంటీ నోట్ చేసుకున్నారు కదా! ఆ పేర్లు ఒక్కొక్కటిగా వాడండి ).

ఉదాహరణకు :

sudo mkdir /media/fun

sudo mkdir /media/Videos

3. క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయగానే అన్ని డ్రైవ్ లనూ మౌంట్ చేస్తుంది.

sudo mount -a

ఇక మీరు ఎప్పుడు కంప్యూటర్ను స్టార్టు చేసినా అన్ని డ్రైవులూ వాటంతటవే మౌంటు అవుతాయి. ఒక వేళ అవ్వకపోతే(ఇలా జరగటం చాలా అరుదు), రీస్టార్టు చేయండి, లేదా sudo mount -a కమాండును వాడి చూడండి.



Read more
0

కంప్యూటర్ వైరస్‌లు


లక్ష్యం:
కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి? వీటిని అరికట్టటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఒక వేళ మన కంప్యూటర్‌కు ఇవి సోకితే ఏం చేయగలం?

కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి?

కంప్యూటర్ వైరస్, తక్కిన సాఫ్ట్వేర్‌లలానే ఒక చిన్న ప్రోగ్రాం. కానీ ఇది చేసే పనులు చాలా కౄరమైనవి. ఇవి మనం గుర్తించటానికి వీలుకాకుండా ఉండటానికి సాధారణంగా వేరొక సాఫ్ట్వేర్‌లో దాగి ఉంటాయి. అందుకే మనం వీటిని వైరస్‌ అని అంటాం. ఇవి మన ప్రమేయం లేకుండా మన కంప్యూటర్‌లోనే పలు ఫైల్లకు లేదా ఒక కంప్యూటర్ నుంటి మరొకదానికి వ్యాపిస్తూ ఉంటాయి.

వీటి గూర్చి నేనెందుకు పట్టించుకోవాలి?

మీరు లినక్‌స్ వాడుతున్నటైతే వీటి గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు, ఎందుకంటే ఇవి లినక్స్‌లో చాలా అరుదు(లేవని కాదు). కానీ ప్రస్తుతం 95% మంది విండోస్ వాడుకరులే.

వైరస్‌లు చాలా రకాలు ఉన్నాయి. అతి తక్కువ హాని తలపెట్టేవి అంటే వార్నింగ్ మెసేజిలు మనకు ఇచ్చి అంతటితో ఆగిపోయేవి. అత్యంత హానికరమైనవి అంటే మన డేటా మొత్తాన్నీ తుడిచిపెట్టెస్తాయి, లేదా మన ప్రమేయం లేకుండా మన ఈ-మైల్ నుండి మన అడ్రస్ బుక్కులో ఉండే వారందకీ అసబ్యకరమైన మైల్లను పంపేస్తుంటాయి.

వీటిని అరికట్టటం ఎలా?

1. ఒక మంచి Anti-Virus మీ కంప్యూటర్‌లో ఇంస్టాల్ చేసుకోవటం. కొన్ని ఉచితంగా లభిస్తాయి. కొన్ని ౩౦ రోజుల కాల పరిమితితో లభిస్తాయి ఇంకా మంచివి కావాలంటే రూ.750/- నుంటి లభిస్తాయి. దగ్గరే ఉన్న కంప్యూటర్ షాపులో అడగండి.

2. ఎప్పటికప్పుడు ఇంటెర్నెట్ ద్వారా మీ యాంటీ వైరస్‌లను అప్డేట్ చేసుకోవాలి. కనీసం వారానికి ఒకసారి, ఎందుకంటే ఏదో ఒక కొత్త వైరస్ వచ్చే ఉంటుంది.

3. మరీ ముఖ్యమైన డేటా ఏదైనా ఉంటే దానిని డీ.వీ.డీ లలో బద్రపరుచుకోవాలి.

4. .exe .vbs .scr .vbe .com .bat .shs .cpl .dll .ocx .pif .drv .lnk .bin .sys .eml .nws. ఎరుపు రంగులో తెలిపిన ఎక్స్టెన్‌షన్ ఉన్న ఫైల్లు మీ ఈ-మైల్‌లో వస్తే వాటిని తెరవకండి, అవి మీకు తెలిసిన వారు పంపినప్పటికి కూడా. ఎందుకంటే అవి వారి ప్రమేయలేకుండా వచ్చినవి ఉంటాయి.

5. పెన్‌డ్రైవ్‌ లను యాన్‌టీ-వైరస్ స్క్యాన్ చేయకుండా తెరవకండి.

6. ప్రతి వైరస్‌నూ అరికట్టే సామర్థ్యం ఏ యాన్‌టీ-వైరస్సుకూ ఉండదు, కావున అప్రమత్తంగా ఉండండి.




Read more
0

విండోస్‌ మొత్తం తెలుగులో వాడుకోవడం


లక్ష్యం:
ఈ పాఠ్యాంశంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ని తెలుగులోకి ఎలా అనువదించుకోవాలో తెలుసుకుందాం. అంటే ప్రస్తుతానికి ఇంగ్లీషులో కనబడేవన్నీ ఇకపై తెలుగులో కనబడతాయన్నమాట. ఐతే, మీరు ఇంగ్లీషులో రాసుకున్న ఫైల్స్, వాటికి, ఫోల్డర్లకి ఇంగ్లీషులో పెట్టుకున్న పేర్లు వగైరాలు మాత్రం అలాగే ఉంటాయి సుమా! విండోస్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడంతోనే వచ్చేవి మాత్రమే అనవదింపబడతాయి. మీరు స్వయంగా తర్వాత రాసుకున్నవి, కాపీ చేసుకున్నవి ఏవీ మారవు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా ఈ పాఠ్యాంశాన్ని అనుసరించవచ్చు.

మీరు చేయవల్సిందిదీ...

  • మీరు ఈ లంకెకు Internet Explorer లో వెళ్ళి Localization Language Offerings అన్న లంకె మీద నొక్కితే అక్కడ ప్రపంచపఠం ఒకటి ప్రత్యక్షమౌతుంది. సైటులో తగిన లంకెను ఎంచుకోవటం చూపించే చిత్రపఠం
  • భారతదేశం ఉన్న రంగు మీద నొక్కితే పక్కనే ఉన్న Step 2 లో Asian Languages అని వస్తుంది. దాని మీద నొక్కితే తెలుగు అని కనబడుతుంది. అది ఎంచుకోండి.
సైటులో  దేశాన్ని ఎంచుకోవటం చూపించే చిత్రపఠం సైటులో  భాషను ఎంచుకోవటం చూపించే చిత్రపఠం

  • అదవ్వగానే కింద ఉన్న Step 3 లో, మీ సిస్టమ్‌ విస్టా ఐతే విస్టా, ఎక్స్.పీ ఐతే ఎక్స్.పీ ఎంచుకోవాలి.

సైటులో  సిస్టమ్‌ను ఎంచుకోవటం చూపించే చిత్రపఠం

  • ఒకవేళ ఇక్కడ కింద చూపిన విధంగా కాకుండా, search results ఉన్న పేజీ వస్తే ఈ లంకె మీద నొక్కండి. "ఇది తెలిసినప్పుడు ఈ ముక్కేదో ముందే చెప్పొచ్చుకదా, ఆ సుత్తంతా ఎందు"కంటారేమో, మీరు ఇది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోగలిగితే భవిష్యత్ లో స్వయంగా కొన్ని సమస్యలు పరిషరించుకోగలుగుతారు, అందుకన్న మాట!
సైటులో  సిస్టమ్‌ను ఎంచుకోవటం చూపించే చిత్రపఠం
  • అదయిన తర్వాత అసలు మీ కంప్యూటర్లో ఉంది నకిలీ విండోసా, డబ్బెట్టి కొనుక్కున్న నికార్సైన విండోసా అని పరీక్షించడానికి ఏవో చిన్నచిన్నవి కొన్ని చేయమంటుంది. ఏమీ అనుకోకుండా, గొణుక్కోకుండా చేసేయ్యండి.
  • ఆ తర్వాత డౌన్లోడ్ మొదలవుతుంది. పూర్తయ్యాక రన్‌ చేయండి. రన్‌ చేసినప్పుడు ఈ లంకెలో చెప్పిన విధానం అమలు చేయని పక్షంలో మధ్యలో XP CD అడగొచ్చు. ఆడిగితే పెట్టండి.
  • ఇన్‌స్టాల్‌ చేశాక సిస్టమ్‌ రీబూట్ చేయమంటుంది. చేశాక మీ తెలుగు కంప్యూటర్ సిద్దం అయినట్టే!

అయితే, అన్నీ తెలుగులో కనబడక పోవచ్చు. చాలా వరకు తెలుగులోనే ఉంటాయి కాని, విండోస్‌తో రానివి, మీరు స్వయంగా పెట్టుకున్న కొన్ని సాఫ్ట్వేర్లు మాత్రం ఇంగ్లీషు లోనే ఉంటాయి. విండోస్‌ లో ఉన్నవాటికే ఒకవేళ తెలుగు పదం లేకపోతే, ఆ పదం తెలుగులో మీకు తెలిస్తే వాళ్ళకు ఇక్కడికి వెళ్ళి మీరే చెప్పొచ్చు. దానికి విండోస్‌ లైవ్‌ ఐడి కావాలి. అది ఆ సైటులో ఉచితంగానే పొందవచ్చు. మీరు చెప్పినట్టైతే తర్వాత వచ్చే వర్షన్‌ లో ఆ పదం పెడతారు. లేదంటే అది వాళ్ళ దృష్టికి వెళ్ళక ఎప్పటికీ అనువాదం కాకపోవచ్చు.




Read more
0

విండోస్‌లో తెలుగు టైప్‌ చేయడం

లక్ష్యం:
ఇందులో మనం విండోస్ లో తెలుగు వ్రాయడం, అంటే టైప్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇదొక్కటి తెలుసుకోవడం వల్ల మీరు ఎంత ఆనందిస్తారో తెలుసుకున్నాక మీరే తెలుసుకుంటారు :) ఆత్మీయులందరితోనూ ఆత్మీయత కలగలపిన తేట తెలుగులో మాటలు/రాతలు పంచుకోవడం కంటేనా? మీ మనోభావాలు, ఆత్మఘర్షణలు అన్నీ బ్లాగుల్లో మోగించేయడానికి ఇది తొలి మెట్టు కాదూ? మొదలెట్టండి మరి!

టైప్‌ చేయడంలో ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి, ఇన్‌స్క్రిప్ట్(inscript), ఇంకోటి లిప్యంతరీకరణం(transliteration). ఇన్‌స్క్రిప్ట్ అంటే సరాసరి తెలుగు కీబోర్ద్ మీద టైప్‌ చేసినట్టు చేసేయడం. లిప్యంతరీకరణం అంటే మనం ఇంగ్లీషులిపిలో తెలుగు టైప్‌ చేస్తే అది తెలుగులిపిలోకి మారడం. అంటే మనం amma అన్ని టైప్‌ చెస్తే అది అమ్మ గా మారుతుందన్నమాట. మీకు ఏది తేలికనిపిస్తే అదే ఉపయోగించమని నేను చెప్పక్కర్లేదనుకుంటా.

ఇన్‌స్క్రిప్ట్(Inscript)

  • ఇక్కడ చెప్పినట్టు నియంత్రణ ఫ్యానల్ లో తేదీ, సమయం, భాష మరియు ప్రాంతీయ ఎంపికలు లో ప్రాంతీయం, భాష ఎంపికలు లో భాషలు ట్యాబ్‌ (Control Panel లో Date, Time Language and Regional Settings లో Regional and Languages settings లో Languages) కి వెళ్ళండి.
  • అక్కడ వివరాలు(Details) లోకి వెళ్ళండి.అందులో కింద చూపించినట్టు జోడించు (Add) అన్న బాక్స్‌ మీద క్లిక్‌ చేయండి.

  • ఆ తెరుచుకున్న విండోలో తెలుగు ఎంచుకొని OK కొట్టేయండి.

  • ఇందాక తెరిచుకున్న విండో కూడా OK చేసేయండి.
  • అలా చేయగానే కింద చూపించినట్టు ప్యానెల్‌ లో మీకు భాషలపట్టీ ఒకటి కనబడుతుంది. ఎరుపు రంగుతో మార్క్‌ చేసిన చోట క్లిక్ ‌చేస్తే మీరు ఏ భాషలో టైప్‌ చేయాలంటే ఆ భాష ఎంచుకోవచ్చన్నమాట.
  • అక్కడ తెలుగు ఎంచుకొని, Notepad అన్నా, Wordpad అన్నా తెరిచి టైప్‌ చేయడానికి ప్రయత్నించండి. మీకు తెలుగు కీబోర్డ్‌ అలవాటు లేకపోతే ఇది కష్టమే. తెలుగు కీబోర్డ్‌ నమూనా ఇక్కడ చూడొచ్చు. టైపింగ్‌ కూడా నేర్చుకోవచ్చు.

లిప్యంతరీకరణ(Transliteration)

మీకు నిత్యం ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటే కనుక, లేఖిని సాధనం బాగా ఉపయోగపడుతుంది. లేదా ఎల్లప్పుడూ కంప్యూటర్‌ లో తెలుగు ఈ transliteration పద్దతిలో టైప్‌ చేసే వీలు కావాలనుకుంటే అక్షరమాల అని ఇంకోటుంది.అది వాడుకోవచ్చు.

అక్షరమాల వాడడానికి సూచనలు

  1. ఇక్కడికి వెళ్ళితే అక్కడ డౌన్‌లోడ్‌ లంకె ఉంటుంది.
  2. డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేస్కున్నాక All Programs > Aksharamala 2007 కి వెళ్ళి aksharamala 2007 ని క్లిక్‌ చేయండి.
  3. ప్యానల్‌ లో అక్షరమాల ఐకాన్‌ ఒకటొస్తుంది. దాని మీద మౌస్‌ కుడి బటన్‌ తో క్లిక్‌ చెసి Options ఎంచుకోండి.
  4. Default Language, Current Language రెండూ తెలుగే ఎంచుకోండి. OK కొట్టేయండి.
  5. మీరు Control+Shit+T కొడితే టైప్‌ చేయబడే భాష మారుతుంది. ఇంగ్లీషుంటే తెలుగుకి, తెలుగుంటే ఇంగ్లీషుకి.
  6. ఒకసారి ఏ Notepad అన్నా Wordpad అన్నా తెరిచి ప్రయత్నించండి.
  7. (ఇంగ్లీషు లిపిలో)ఏం కొడితే (తెలుగు లిపిలో)ఏం వస్తుందో తెలుసుకోవాలంటే, లేఖినికి వెళ్ళి తెలుసుకోవచ్చు.



Read more
0

విండోస్‌లో తెలుగు చదవడం

లక్ష్యం:
ఈ పాఠ్యాంశంలో విండోస్ లో తెలుగు సరిగ్గా కనబడడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ఐతే ఎక్స్.పీ లో ఏమీ చెయ్యక్కర్లేకుండానే తెలుగు బ్రహ్మాండంగా కనబడుతుంది. కానీ కాపీ చేసీ, పేస్ట్ చేసి, సేవ్ చేసి ఆ ఫైల్ మళ్ళీ తెరిస్తే ఆ పేస్ట్ చేసిన అక్షరాలు ఏవో పిచ్చిపిచ్చిగా కనిపిస్తాయి. అది ఎందుకో కూడా చూద్దాం. ఇలాంటి విషయాలు నిశితంగా తెలుసుకోవాలనుకుంటే అసలు ఖతులు(ఫాంట్లు) అంటే ఏంటో కూడా తెలుసుకుందాం.

అన్నిటికంటే ముందు, ఇదిగో ఈ కింద చెప్పిన విధంగా చేస్తే, XP లో ఏ అక్షరాలయినా మృదువుగా, సుతారంగా, అందంగా కనబడతాయి.

  1. Desktop మీద right click చేసి
  2. Settings ఎంచుకుని
  3. Appearence లో effects క్లిక్ చేసి
  4. "Use the following method to smooth edges of screen fonts" అన్నదాన్ని "ClearType" కి మార్చండి.
  5. అన్నీ Ok కొట్టేస్తే తేడా మీకే తెలుస్తుంది.


ఇక XP‌లో తెలుగు చదవడానికి, స్టోర్‌ చేయడానికి ఈ క్రింది రెండు పద్దతుల్లో మీకు సరిపోయేది ఎంచుకుని చేసేయ్యండి. ఒక పద్దతిలో XP ది ఎదో ఒక CD ఉండాలి. ఇంకోదాంట్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. మొదటిది CD ఉన్న వాళ్ళకి. ఒకవేళ CD లేదు, ఇంటర్నెట్ సదుపాయం ఉంది అంటే ఇక్కడ నొక్కండి. రెండూ లేకపోతే, ఇక్కడ నొక్కండి.

CD ఉన్న వాళ్ళైతే

  • నియంత్రణ ఫ్యానల్ లో తేదీ, సమయం, భాష మరియు ప్రాంతీయ ఎంపికలు లో ప్రాతీయం, భాష ఎంపికలు (Control Panel లో Date, Time Language and Regional Settings లో Regional and Language settings) కి వెళ్ళండి






ఆ తెరుచుకున్న విండోలో, క్రింద బొమ్మలో చూపించినట్టు భాషలు(Languages) అనే ట్యాబ్ మీద నొక్కండి.






  • అక్కడ పైన చూపిన విధంగా టిక్కు పెట్టని రెండు బాక్సులుంటాయి. వాటిని టిక్ చేసేసి OK కొట్టేయండి. CD పెట్టమని అడుగుతుంది, పెట్టేసి OK అని కొట్టేయండి.
  • అంతా అయిపోయాక CD తీసేసి కంప్యూటర్ని రీబూట్ చేయండి.
  • ఏదైన తెలుగు వెబ్‌సైట్‌ కి వెళ్ళి చూడండి. మీరు ఇక మీ కంప్యూటర్లో తెలుగు నిక్షేపంగా చదువుకోవచ్చు, స్టోర్‌ చేస్కోవచ్చు.

ఒక్క మాట! Notepad లో సేవ్‌ చేసేటప్పుడు, ఎన్‌కోడింగ్‌(encoding) UTF-8 ఉండేలా చూస్కోండి. లేకపోతే మీరు సేవ్‌ చేసింది మళ్ళీ తెరిచి చూస్తే అది సరిగ్గా చూపించదు.

ఒకవేళ CD లేకపోతే, ఇంటర్నెట్ సదుపాయం ఉంటే

  1. లంకె నొక్కి పోతన, వేమన ఫోంట్లు దించుకోండి.
  2. దించుకున్నాక, దాన్ని unzip చేస్తే వచ్చే Pothana2000.ttf మరియు vemana.ttf లను C:\Windows\Fonts లోకి copy చేయండి.
  3. ఏదైన తెలుగు వెబ్‌సైట్‌ కి వెళ్ళి తెలుగు చదవడం మొదలెట్టండి.

రెండూ లేకపోతే

ఒకవేళ ఇంటర్నెట్ సదుపాయం కూడా లేకపోతే, వేరే ఏదైనా ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్లో పైన(ఇక్కడ) చెప్పిన ఫోంట్లు దించుకుని, పెన్‌ డ్రైవ్‌ లో కాపీ చేస్కుని, దాంట్లోనుంచి మీ కంప్యూటర్కి కాపీ చేసి, ఇక రెండో Step లో చెప్పినట్టు చేసేయ్యండి. పై రెండు మార్గాలకి తేడ ఏంటంటే, మొదటి పద్దతిలో మీరు తెలుగుతో పాటు ఇలాంటి ఎన్నో భాషలు కూడా చదువగలుగుతారు, రెండవదాంట్లో ఒక్క తెలుగు మాత్రమే చదువగలుగుతారు.






Read more
0

లినక్స్ లో తెలుగు టైప్‌ చేయడం


లక్ష్యం:
ఇందులో మనం లినక్స్ లో తెలుగు వ్రాయడం, అంటే టైప్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇదొక్కటి తెలుసుకోవడం వల్ల మీరు ఎంత ఆనందిస్తారో తెలుసుకున్నాక మీరే తెలుసుకుంటారు :) ఆత్మీయులందరితోనూ ఆత్మీయత కలగలపిన తేట తెలుగులో మాటలు/రాతలు పంచుకోవడం కంటేనా? మీ మనోభావాలు, ఆత్మఘర్షణలు అన్నీ బ్లాగుల్లో మోగించేయడానికి ఇది తొలి మెట్టు కాదూ? మొదలెట్టండి మరి!

ఇహ విషయానికొస్తే, టైప్‌ చేయడంలో ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి, ఇన్‌స్క్రిప్ట్(inscript), ఇంకోటి లిప్యంతరీకరణం(‌transliteration).
ఇన్‌స్క్రిప్ట్ అంటే సరాసరి తెలుగు కీబోర్డ్ మీద టైప్‌ చేసినట్టు చేసేయడం. లిప్యంతరీకరణం అంటే మనం ఇంగ్లీషులిపిలో తెలుగు టైప్‌ చేస్తే అది తెలుగులిపిలోకి మారడం. అంటే మనం amma అన్ని టైప్‌ చెస్తే అది అమ్మ గా మారుతుందన్నమాట. మీకు ఏది తేలికనిపిస్తే అదే ఉపయోగించమని నేను చెప్పక్కర్లేదనుకుంటా.

ఇన్‌స్క్రిప్ట్(Inscript)

KDE లో ఐతే

  • System Settings లో Regional & Language ని వెతికి పట్టుకోండి(అంటే అక్కడో search బాక్సుంటుంది, ఉపయోగించమని).
  • అందులో Keyboard Layout అనే దాంట్లోకి వెళ్ళి, Enable keyboard layouts అన్నదాన్ని టిక్‌ చేయండి.
  • దాని కిందే, Available layouts అని ఉంటుంది, దాంట్లో India ని ఎంచుకుని Add బటన్‌ క్లిక్‌ చేయండి.
  • ఇప్పుడు పైన కొత్తగా చెర్చిన India ని ఎంచుకుని Layout variant కి tel అని ఎంచుకోండి.
  • చివరిగా Apply బటన్‌ కొట్టేశక మీకు ప్యానల్‌లోlayout బటన్‌ ఒకటి కనిపిస్తుంది. క్లిక్‌ చేసినప్పుడల్లా layout మారుతుందన్నమాట.

Gnome లో ఐతే

కింద చెప్పిన లిప్యంతరీకరణం పద్దతితోనే ఇన్‌స్క్రిప్ట్ టైప్‌ చేయడానికి కూడా వీలు కలుగుతుంది. దీని కోసం వేరేగా ఇంకోటి చేసే బదులు ఇన్‌స్క్రిప్ట్ కి కూడా అదే ఉపయోగించుకోవడం మేలని నా అభిప్రాయం. ఇది KDE కి కూడా ఉపయోగపడుతుందనుకోండి.

లిప్యంతరీకరణ(Transliteration)

ఈ పాఠ్యాంశం రాసింది ఈ పద్దతిలోనే.ఇంగ్లీషు కీ-బోర్డ్ కి అలవాటు పడి, నాకిది సులువనిపిస్తుంది. కాని మీరు టైపింగ్ కి కొత్త ఐతే మాత్రం నేను ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోమని ప్రోత్సహిస్తాను. ఇక లిప్యంతరీకరణ(transliteration) ఉపయోగించాలంటే, మనకి SCIM అనే పరికరం కావాలి. దీంతో లిప్యంతరీకరణం పద్దతే కాకుండా, ఇన్‌స్క్రిప్ట్ మరియు Phonetic పద్దతిలో కూడా టైప్‌ చేసే వీలుంటుంది.ఇప్పటి వరకూ వచ్చిన complex script input సాఫ్ట్వేర్‌ పరికరాల్లోకెల్లా అత్యున్నతమైంది, ఈ SCIM. అందుకే నాకిదంటే భలే ఇష్టం. ఇది మీక్కూడా కావాలి అంటె ఇలా చేయాలి.

ఫెడోరా(Fedora) వాడేవారైతే

ఈ క్రింది కమాండ్‌ టర్మినల్‌ తెరిచి రన్‌ చేయండి.

yum -y install scim scim-devel scim-m17n m17n-contrib-telugu.noarch m17n-db-telugu.noarch scim-lang-telugu

ఆ తర్వాత

  • Gnome లో System>Preferences లో Input method అని ఉంటుంది, వెతికి పట్టుకోండి.
  • ఆ వచ్చిన బాక్సులో Enable input method feature అని ఉంటుంది. దాన్ని టిక్‌ చేసి, కింద Use SCIM అన్నదాన్ని ఎంచుకుని OK కొట్టేయండి.
  • ఒక్కసారి కంప్యూటర్ రీబూట్‌చేయండి.

ఈ సారి లాగిన్‌ అయినప్పుడు ప్యానెల్ లో కొత్త ఐకాన్‌ కనిపిస్తుంది. ఒకసారి Gedit తెరిచి, ఆ ఐకాన్‌ మీద క్లిక్ చేయండి, తెలుగు ఎంచుకుని, ఏ విధంగా టైప్‌ చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోండి. ఇంక దంచేయొచ్చు!

ఉబుంటు(Ubuntu) వాడేవారైతే

  • Gnome లో System>Administration లో Language Support అని ఏదైనా ఉందేమో చూడండి.
  • ఉంటే కేక – ఉన్నట్లైతే,
    • అది క్లిక్ చేసి, వచ్చిన విండోలో తెలుగు ని టిక్‌ చేసి, కింద Enable support to enter complex characters అని ఉన్నదాన్ని కూడా టిక్ చేసేయ్యండి.
    • అదేవో కొన్ని ప్యాకేజ్ లు దించుకుని స్థాపించుకుంటుంది, చేసుకోనివ్వండి.
    • అది అయ్యాక ఒకసారి కంప్యూటర్ ని రీబూట్ చేస్తే ప్యానెల్ లో కొత్త ఐకాన్‌ కనిపిస్తుంది
    • ఒకసారి Gedit తెరిచి, ఆ ఐకాన్‌ మీద క్లిక్ చేయండి, తెలుగు ఎంచుకుని, ఏ విధంగా టైప్‌ చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోండి. కుమ్మేయండి!
  • లేకపోయినా బాధపడక్కర్లేదు.
    • ఆ Language Support Option లేని వాళ్ళు ఈ కింద చెప్పిన కమాండ్‌ ని రన్‌ చేయండి(అంటే : Alt+F2 కొట్టి, gnome-terminal అని టైప్‌ చేసి Run చేయండి, ఆ వచ్చిన విండో లో ఈ కింద చెప్పిన కమాండ్‌ ని కాపీ చేసి, అతికించి Enter కొట్టండి.)
    • sudo apt-get install scim scim-m17n scim-tables-additional
    • ఆ తర్వాత Gnome లో System>Preferences లో Input method అని ఉంటుంది, వెతికి పట్టుకోండి.
    • ఆ వచ్చిన బాక్సులో Enable input method feature అని ఉంటుంది. దాన్ని టిక్‌ చేసి, కింద Use SCIM అన్నదాన్ని ఎంచుకుని OK కొట్టేయండి.
    • ఒక్కసారి కంప్యూటర్ రీబూట్‌చేయండి.
    • ఈ సారి లాగిన్‌ అయినప్పుడు ప్యానెల్ లో కొత్త ఐకాన్‌ కనిపిస్తుంది. ఒకసారి Gedit తెరిచి, ఆ ఐకాన్‌ మీద క్లిక్ చేయండి, తెలుగు ఎంచుకుని, ఏ విధంగా టైప్‌ చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోండి. టైప్‌ చేయడం మొదలెట్టొచ్చు!

చివరిగా, తరచూ అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు వాడేవారికి సౌలభ్యంగా ఉండటం కోసం, ఒక చిన్న చిట్కా.. తెలుగు, ఇంగ్లీషు ఒక చిన్న shortcut తో మార్చి మార్చి వాడుకోవచ్చు. ఎలాగంటే, టెర్మినల్ తెరిచి ఈ కిందున్న command ని run చేయండి.

gopal@tidbits# im-switch -z en_US -s scim

ఆ తర్వాత ఒక్కసారి logout అయ్యి, login అయితే ఏ అప్లికేషన్‌ లో ఐనా Ctrl+Space తో తెలుగు, ఇంగ్లీషు మార్చి మార్చి టైపు చేసుకోవచ్చు. ఇలా చేయని పక్షంలో ప్రతిసారి అప్లికేషన్లో రాసే చోట right click చేసి, Input methid ని SCIM గా ఎంచుకోవాల్సి వస్తుంది.




Read more
0

లినక్స్ లో తెలుగు చదవడం


లక్ష్యం:
ఈ పాఠ్యాంశంలో లినక్స్ లో తెలుగు సరిగ్గా కనబడడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ఐతే కొన్ని వర్షన్‌లలో ఏమీ చెయ్యక్కర్లేకుండానే తెలుగు బ్రహ్మాండంగా కనబడుతుంది. అది ఎందుకో కూడా చూద్దాం. ఇలాంటి విషయాలు నిశితంగా తెలుసుకోవాలనుకుంటే అసలు ఖతులు(ఫాంట్లు) అంటే ఏంటో కూడా తెలుసుకుందాం.

అసలు ముందుగా ఈ పాఠ్యాంశం చదవి, చెప్పింది చేయడానికి, తెలియాల్సినవి ఏమన్నా తెలియకపోతే తెలుసుకుందాం. ఏది తెలియకపోయినా దాని మీద నొక్కేసి, చదివేసి మళ్ళీ వెనక్కి వచ్చేయండి.

  • terminal (టర్మినల్)
  • yum (యమ్‌)
  • apt-get (యాప్ట్-గెట్) లేదా synaptic(సినాప్టిక్)

హా! ఇప్పుడు అన్నీ తెలుసన్నమాట! మీకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటే ఇదిగో ఈ క్రింది చెప్పింది చేసేయ్యండి. లేకపోతే ఇక్కడ నొక్కితే ఇంకొంచెం క్రిందికెళతారు, అక్కడ చెప్పింది చేసేయ్యండి.

ఇంటర్నెట్ సదుపాయం ఉంటే

Alt+F2 కొట్టి ఆ వచ్చిన బాక్సులో gnome-terminal అని కొట్టి ఈ కిందున్న commands ని copy paste చేసి రన్ చేయండి

ఫెడోరా(Fedora) వాడేవారు

yum -y install openoffice.org-langpack-te_IN aspell-te fonts-telugu.noarch lohit-fonts-telugu.noarch

ఉబుంటు(Ubuntu) వాడేవారు

sudo apt-get install aspell-te language-pack-te language-support-te openoffice.orgl10n-te-in ttf-telugu-fonts

ఒకసారి కంప్యూటర్ రీబూట్ చేయండి. పైన చెప్పినట్టు చేసినప్పటికీ, అప్పుడప్పుడు విహారిణిలో(browsers) బాగా చదవగలగాలంటే అందులో కూడా తగు మార్పులు చేయాల్సుంటుంది.

పైర్‌ఫాక్స్ వాడేవారికి అదంతా అవసరం లేదులేండి. ఫైర్‌ఫాక్స్ ౩.౦ వర్షన్‌ నుండి ఏం చేయనక్కర్లేకుండానే తెలుగు శుభ్రంగా కనిపిస్తుంది. కాని అంతకు ముందు వర్షన్‌లలో ఏమన్నా తేడగా ఉంటే మాత్రం తలనొప్పే సుమా. అందుకే, ఇక్కడ నుండి అత్యాధునిక వర్షన్‌ని దింపుకుని(download చేస్కుని), స్థాపించేస్కోండి(install అన్నమాట). అంతే!

ఒకవేళ మీరు ఎపిఫనీ(Epiphany) విహారిణి(browser) వాడే అరకొరమందిలో ఒకరైతే, అందులో తెలుగు పదాలు సరైన రీతిలో కనబడడానికి Pango rendering అనేది ఒకటవసరం. దానికోసం మీరు చేయాల్సిందల్లా…

  • Alt+F2 కొట్టి ఆ వచ్చిన Run Application బాక్సులో gconf-editor అని కొట్టి Run కొట్టండి.
  • అలా కొడితే వచ్చిన విండోలో ఎడమవైపునున్న menu లో apps>epiphany లో web section కి వెళ్ళండి.
  • ఇప్పుడు అదే విండోలో కుడివైపు చూస్తే enable_pango అనేదొకటుంటుంది. దానికి టిక్‌ పెట్టేయండి.
  • హమ్మయ్య! ఓ మారు ఎపిఫనీని మూసి-తెరిస్తే మన తెలుగు, తెలుగులా అందంగా కనబడుతుంది :)

ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే

  1. లంకె నొక్కి పోతన, వేమన ఫోంట్లు దించుకోండి.
  2. దించుకున్నాక, దాన్ని unzip చేస్తే వచ్చే Pothana2000.ttf మరియు vemana.ttf లను ~/.fonts డైరెక్టరీలోకి copy చేయండి. విహారిణిని(బ్రౌజర్‌) తెరిచివుంటే ఒకసారి మూసి, తెరవండి.
  3. ఏదైన తెలుగు వెబ్‌సైట్‌ కి వెళ్ళి తెలుగు చదవడం మొదలెట్టండి.

అక్కడికీ సమస్య తీరకపోతే, పోనీ ఇక్కడ చెప్పిన పద్దతి మీకు నచ్చకపోతే మీరు వాడుతున్న OS, విహారిణి(browser) పేర్లు, వర్షన్‌ల వివరాలతో ఇక్కడే అడిగేస్తే నా శక్తి కొద్దీ సమాధానం చెప్తాను.




Read more
0

లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయటం ఎలా?



లక్ష్యం:
ఈ టపాలో, ఉబుంటు లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌కు ఎలా కనెక్ట్ చెయ్యాలో వ్రాయటం జరిగింది, ఇది మరి కొన్ని gnome లినక్సులకు కూడా వర్తించవచ్చు.

టెర్మినల్ తెరవటానికి, Alt+F2 నొక్కి gnome-terminal అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే చాలు.



టెర్మినల్ లో “sudo pppoeconf” అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే అడ్మినిస్ట్రేటర్ పాస్‌వర్డ్ కోసం అడుగుతుంది, పాస్‌వర్డ్ ఇవ్వగానే ‘ఎస్ ఆర్ నో’ అని అడుగుతుంది, ఇలా’ కనిపించిన ప్రతి సారీ ఎంటర్ నొక్కటామే మనం చెయ్యవలసినది.

కాసేపు ఉన్న అవకాశాల కోసం స్క్యాన్ చేస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ username password అడుగుతుంది. అవి ఇవ్వటం ఎంటర్ నొక్కటం, ఇదే మనం చెయ్యవలసింది. ఇలా మొదటి సారి చేశాక, మీరు కంప్యూటర్ ఆన్ చేసిన ప్రతి సారీ దానంతటదే ఇంటెర్నెట్‌కు కనెక్ట్ ఐపోతుంది.

కనెక్ట్ అయ్యిందో లేదో చూడటానికి Firefox తెరిచి ఏదైనా వెబ్సైట్ వెళ్ళటానికి ప్రయత్నించి చూడండి.

Read more
0

డీ-ఫ్రాగ్ మెంట్ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి?



లక్ష్యం:
ఈ టపా చదివిన తరువాత, మీరు డీఫ్రాగ్‌మెంటేషన్ అనగా ఎమీటి? ఎందుకు చేయాలి? విండోస్‌లో దీన్ని ఎలా చేయాలి? అన్న విషయలను తెలుసుకొంటారు.

డీ-ఫ్రాగ్ అంటే ఏమిటి?


ఏదైనా పెద్ద ఫైల్ ను మీరు మీ కంప్యూటర్ లో సేవ్ చేసినపుడు అది ఒకే చోట సేవ్ కాకుండా, ముక్కలు ముక్కలుగా వివిద ప్రాంతాల్లో ఉంచబడుతుంది. క్రింది బొమ్మలో, ఒక్కో రంగూ ఒక్కో ఫైల్ అన్నమాట, అది de-Fragment చేయటానికి మునుపు ఎలా ఉన్నాయి, ఎలా de-Frag నిర్వహించబడుతుంది, తరువాత ఎలా మరుతాయి అన్న అంశాలకు ఉదాహరణ చూడగలరు.

ఈ ఇబ్బంది లినక్స్ యూజర్లకు ఉండదు. ఎందుకంటే లినక్స్ లో ఎప్పటికప్పుడు De-fragmentation దానంతటదే అవుతూ ఉంటుంది.

ఎందుకు చేయాలి?
కంప్యూటరు ఇంకాస్త వేగంగా పని చేసే అవకాశం ఉంది. మరియూ వీలైనంత ఖాళీని ఒకే చోటకు చేర్చగలదు.

విండొస్‌లో ఎలా చేయాలి?
1. My Computerకు వెళ్ళి, మీరు ఏ పార్టిషన్ను డీ-ఫ్రాగ్మెంట్ చేయాలో దాన్ని Right-Click చేసి Propertiesను ఎంచుకోండి.

2. కొత్తగా వచ్చిన విండోలో Tools అనే ట్యాబులో Defragment Now అన్న బటను ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కండి.

పూర్తి కావటానికి కొన్ని నిమిషాల నుండీ కొన్ని గంటల సమయం తీసుకుంటుంది.
Read more
1

ఉబుంటూ 8.10 లినక్స్‌ను ఇంస్టాల్ చేయటం!

లక్ష్యం:
మీ కంప్యూటర్‌లో ఉబుంటూ లినక్స్‌ను ఇంస్టాల్ ఎలా చేయాల క్లుప్తంగా నేర్చుకొంటారు.
గమనిక :
8.10 మరియూ 9.04 అన్నవి ఉబుంటూ యొక్క వేర్వేరు వర్షన్ లు.
మీకు ఈ టపాలోని బొమ్మలు మసకగా కనపడుతున్నటైతే, ఆ బొమ్మల్ని క్లిక్ చెయ్యండి, స్పష్టముగా కనపడుతాయి.
అన్ని ఉబుంటూ వర్షన్ లూ, ఇంస్టాల్ చేసే విషయానికొస్తే ఇంచు మించు ఒకేలా ఉంటాయి. 9.04 కొన్ని హార్డ్ వేర్లని సపోర్టు చేయలేక పోవటం వల్లనే 8.10 ఇంస్టాల్ చేయటం గూర్చి వ్రాయటం జెరిగింది.
ఇంస్టాల్ చేసే సమయంలో ఈ టపా చదవలేం కదా, ఒక కాగితంలో వ్రాసుకుందాం అనుకుంటున్నారా?? అవసరం లేదు, దీన్ని ఇంస్టాల్ చేసే సమయంలో ఇంటర్నెట్ను వాడవచ్చు, కానీ ఈ టపా తెలుగులో ఉంది కావున, అలా చదవటానికి ముందు ఒక సులువైన పద్దతిలో తెలుగు Supportను ఇంస్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక వేళ మీది ID మరియూ Password ఇచ్చి కనెక్ట్ అయ్యే బ్రాడ్ బ్యాండ్ ఐతే

ఇది చూడండి.
విండోస్‌లో ఒక సాఫ్ట్వేర్ లా కూడా దీన్ని ఇంస్టాల్ చేయవచ్చు, లేదా వేరొక పార్టిషంలోనైనా ఇంస్టాల్ చేయవచ్చు. ఈ టపా 8.10ను రెండవ పద్దతిలో ఎలా ఇంస్టాల్ చేయాలో వివరిస్తుంది, 9.04కూడా దాదాపుఇలానే ఉంటుంది.
కావలసినవి :
1. మీ దగ్గర ఉబుంటూ CD లేదా DVD ఉండాలి.
2. కనీసం 5 లేదా 6GB ఉన్న ఒక పార్టిషన్ ఉండాలి. ఈ పర్టిషన్ లో ముఖ్యమైన డేటా ఏదీ లేకుండా చూసుకోండి. ఒక వేళ ముఖ్యమైన డేటా ఉంటే ఇంస్టాల్ చేసే సమయంలోనైనా వేరొక డ్రైవ్ లోకి మార్చి బద్రపరుచుకోవచ్చు. మీ దగ్గర కేవళం ఒక్క పార్టిషన్ మాత్రమే ఉందా?? ఐతే ఇది చూడండి.
3. మొదటి బూట్ డివైస్, CD డ్రైవ్ ఉండేలా చూసుకోండి. సామాన్యంగా ఇదే ఉంటుంది, ఒక వేళ లేకపోయినట్టయితే BIOSలో మర్చాలి. BIOSలోకి వెళ్ళటానికి ఏ బటన్ను నొక్కాలో అన్నది, కంప్యూటర్ను స్టార్ట్ చేయగానే చూపుతుంది.
బూట్ చేసే పద్దతి :
1. CD లేదా DVDని ట్రేలో ఉంచి రీస్టార్ట్ చేయండి.
2. భాషను ఎంచుకోమని అడుగుతే, భాషను Englishగా ఎంచుకోండి.
3. ఐదు ఆప్షన్ లు వస్తాయి, అనుభవం కలవారైతే రెండవ దాన్ని(Install Ubuntu) ఎంచుకొంటారు. అనుబవం లేని వారు మొదటి(Try Ubuntu with out any change to computer) దాన్నే ఎంచుకోండి. ఇలా కూడా ఇంస్టాల్ చేయవచ్చు.
కాసేపట్లో పూర్తిగా బూట్ కాగానే క్రింద చూపిన విధంగా వస్తుంది.


ఇంటర్నెట్ నుండీ ఈ టపా చదవటం :
ఒక వేళ మీరు ఈ టపాని చదువుతూ ఇంస్టాల్ చేసుకోదలచితే క్రింది పద్దతిని పాటించండి. టపా చూడవలసిన అవసరం లేదు అని అనుకుంటే, ‘ఇంస్టాల్ చేసే పద్దతి’ అన్న ప్రక్రియను చూడండి.
1. ఇంటర్నెట్టుకు కనేక్ట్ కావటం ఎలా అన్నది ఇక్కడ చూడగలరు.
2. మీ స్క్రీన్ లో, పైనున్న Systemలో Administratorలో Language Supportను ఎంచుకోండి.



3. కొత్తగా వచ్చిన విండోలో పైనున్న లిస్టు నుండీ తెలుగును టిక్ చేసుకోండి. Apply బటన్ను నొక్కగానే రెండు MB డౌంలోడ్ చేసి తెలుగును ఇంస్టాల్ చేస్తుంది. OK బటన్ను నొక్కండి.
4. పైనున్న Firefox ఐకాన్ ను క్లిక్ చేసాక, తెరుచుకున్న Firefox విండోలో క్రింద తెలిపిన అడ్రస్సును టైప్ చేస్తే ఈ టపాను మీరు చూడవచ్చు.
http://e-nadu.blogspot.com/2009/08/810.html

డేటా Backup చేసుకోవటం :
ఒక వేళ మీరు Linux ఇంస్టాల్ చేద్దమనుకున్న డ్రైవ్ లో ముఖ్యమైన డేటా ఏదైనా ఉంటే ఈ ప్రక్రియను అనుసరించండి. లేదంటే ఇంస్టాల్ చేసే ప్రక్రియను చూడండి.
1. పైనున్న మెనూలో Placesలో > Computerను ఎంచుకోండి.
2. క్రింద చూపిన విదంగా, ఎడమ వైపునున్న లిస్టులో నుంటీ మీకు కావలసిన డ్రైవ్ పేరు మీద క్లిక్ చేయండి, ఒకటి ఇంస్టాల్ చేసే డ్రైవు, మరోకటి ఇంస్టాల్ చేయబోయే డ్రైవ్ నుంటీ మీకు కావసిన డేటాను కాపీ చేసి బద్రపరుచుకొనే డ్రైవు. ఇలా రెండింటి మీద క్లిక్ చేయలి, ఇలా చేయగానే ఇవి మౌంట్ అవుతాయి.



3. డెస్క్ టాప్ మీద కనిపించే ఈ మౌంట్ ఐన డ్రవ్ లలో, ఒక డ్రైవ్( ఇందులోనే ఇంస్టాల్ చేయబోయేది) నుంటీ మీ డేటాను మరొక డ్రైవ్ లోకి కాపీ చేసుకోండి.
4. కావలసిన డేటాను Backup చేసుకున్న తరువాత, డెస్క్ టాప్ మీద మౌంట్ చేయగా, కొత్తగా వచ్చిన డ్రైవ్ ల మీద right-click చేసి Unmount Volume అన్న ఆప్షన్ను క్లిక్ చేయండి.
ఇంస్టాల్ చేసే పద్దతి :
1. డేటా బ్యాకప్(పైన చెప్పిన పద్దతి) చేసే ప్రయత్నం ఏది చేయకున్నట్టయితే రెండవ స్టెప్ కు వెళ్ళండి. ఏవైనా డ్రైవ్ లు మీరు మౌంట్ చేసి ఉంటే (డెస్క్ టాప్ మీద కనిపిస్తాయి), వాటి మీద right-click చేసి Unmount Volume అన్న ఆప్షన్ను క్లిక్ చేయండి.
2. పైనున్న మెనూ నుంటీ, Systemలో Administratorలో Partition Editorను ఎంచుకోండి,



అక్కడ మీరు ఇంస్టాల్ చేయబోయే డ్రైవ్ ఏదో గుర్తించండి. గుర్తించాక, దాని పక్కన /dev/sda2 లేదా /dev/hda2 అని ఉంటుంది, ఇక్కడి ఉదాహరణలో నేను 2 అనే సంఖ్యను ఎంచుకున్నాను. మీకు వేరే సంఖ్య వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు /dev/sda3 లేదా /dev/sda5 ఇలా రావచ్చు. ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. Partition Editor విండోను క్లోజ్ చేసేయండి.



3. డెస్క్ టాప్ మీద ఉన్న Install అన్న ఐకాన్ను క్లిక్ చేయండి. క్రింద చూపిన విదంగా కొత్త విండో ఒకటి తెరుచుకుంటుంది. అందులో Forward అన్న బటన్ను నొక్కండి.





4. భారత దేశంలో ఉన్న వాళ్ళు Kolkataను ఎంచుకొని, Forward క్లిక్ చేయండి. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు మీరున్న దేశాన్ని ఎంచుకోండి.

5. తరువాతి విండోలో కూడా Forward బటన్ను క్లిక్ చేయండి.



6. ఇక్కడి నుండీ జాగ్రత్తగా ఉండాలి, తరువాతి విండోలో Manualను ఎంచుకొని Forward బటన్ని నొక్కండి. Scanning disks… అని మరొక విండో వచ్చి కాసేపటి తరువాత క్రింద చూపిన విదంగా కనిపిస్తుంది.

7. ఇక్కడ మీరు ఏ డ్రైవ్ లో ఐతే ఇంస్టాల్ చేయాలనుకొంటున్నరో దాన్ని సెలెక్ట్ చేసుకొని, క్రిందనున్న Delete Partitionను నొక్కండి. అది ఫ్రీ స్పేస్ గా మారిపోతుంది.

8. వచ్చిన ఆ ఫ్రీ స్పేస్ ను క్లిక్ చేసుకొని New Partition అన్న బటన్ను క్లిక్ చేయండి. ఒక చిన్న విండో వస్తుంది.



9. మొదట Swap పర్టిషన్ పెట్టాలి, RAM చిన్నదైనప్పుడు(1GB కన్నా తక్కువైతే) ఇది కచ్చితంగా ఉండాలి. ఇది కనీసం 1GB ఉండటం మంచిది, కావున మీరు ఇంస్టాల్ చేయాలనుకున్న పార్టిషన్ కనీసం 5GB అన్నా ఉండేలా చూడండి. క్రింద చూపిన విదంగా వివరాలను మార్చండి. OK బటన్ను క్లిక్ చేయండి.



10. మిగిలిన FreeSpaceను ఎంచుకొని, మళ్ళీ New Partition అన్న బటన్ను క్లిక్ చేయండి. క్రింద చూపిన విధంగా వివరాలు నింపండి(New Partition Size అన్నది మాత్రం, ఎలాగుందో అలానే వదిలేయండి). OK బటన్ను క్లిక్ చేయండి. తరువాత Forward క్లిక్ చేయండి. ఇక కష్టమైన పనులు అయ్యిపోయాయి.


11. తరువాతి విండోలో పేరూ పాస్ వర్డూ టైప్ చేయండి. Forward క్లిక్ చేయండి. తరువాతి విండోలో కూడా Forward బటన్ను క్లిక్ చేయండి.
12. చివరిగా Install అన్న బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి.

ఇక 20నిమిషాలు ఆగితే రీస్టార్ట్ చేయమని అడుగుతుంది, రీస్టార్ట్ చేయండి. ఇక మీ సిస్టంలో ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ ఐపోయినట్టే.
తెలుగు బ్లాగులు చదవటానికి, ఇంతకు మునుపు చెప్పిన పద్దతిని పాటిస్తే సరిపోతుంది.
Read more
Related Posts with Thumbnails

Share This Article

Share |

Categories

100GB Mp3 3d text maker 400 GB అంటి వైరస్ అంతర్జాలం అసక్తికరమైన వెబ్ సైట్లు ఆటోమేటిక్ అనువాదం ఆడియో కన్వర్టర్ ఆడియో ప్లేయర్లు ఆర్కిటెక్చర్లు ఇంటర్నెట్ ఈ-పుస్తకం ఉచితబ్లాగు నిర్వహణ ఉపకరణాలు ఉబుంటు ఉబుంటూ ఎక్స్.పీ ఇన్‌స్టాల్ ఓపెన్ సోర్స్ కంప్యూటర్ వైరస్ కమాండ్లతో నావిగేషన్‌ కీబోర్డ్ కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ క్రొత్త పరికరాలు గాడ్జెట్లు గువేక్ - గ్నోమ్ లో యాకువేక్ గూగుల్ గేమ్స్ గ్రబ్ ఎడిట్ జోహో టెర్మినల్ టోరెంట్లు ట్విట్టర్ డీ-ఫ్రాగ్ మెంట్ డెలీష్యస్ డెస్క్టాపు డౌన్లోడ్ ఉపకరణాలు డ్రైవ్ తెలుగు అనువాదం తెలుగు చదవడం తెలుగు టైపుచేయడం తెలుగు వెబ్ సైట్స్ తెలుగు వెబ్ సైట్స్ శోధన తెలుగులో వాడుకోవడం థీమ్‌ నెట్ నెట్వర్కింగ్ పత్రాలు పిసి రక్షణకోసం ప్రోగ్రాం ప్రోగ్రామర్ ప్రోగ్రామింగ్ ప్లగిన్లు ఫాంట్ సహాయం ఫెడోరా ఫైతాన్ ఫైరుఫాక్సు ఫోటోలు అమ్ముకోండి ఫోల్డర్లు ఫ్రీ వేర్ బకేట్ ప్రింటర్ బ్రాడ్ బ్యాండ్ బ్లాగు బ్లూ టూత్ భారతీయ భాషల్లో మార్చడం మైక్రోసాఫ్ట్ యాంటీ వైరస్ మొజిల్లా మొబైల్ మౌంట్ మౌస్ రెండు సిస్టంలు లినక్సు లినక్సు ఇన్స్టాల్ లినక్సు ఈ-నాడు లినక్సు డైరెక్టరీ లినక్సు మింట్ లినక్స్ లినక్స్ లో వైరస్ లోకల్ సెర్చ్ లోకల్ హోస్టు వర్డుప్రెస్సు విండోస్ విడియో కన్వర్టర్ వీడియో కన్వర్టర్ వీడియో ఫార్మాటు వెబ్ వెబ్ సర్వీసు వేడి వైరస్ పదాలు శామ్ సంగ్ షేర్ వేర్ సాప్ట్ వేర్స్ సైటుల గురించి వివరణ సొంత సైట్ సోనీ స్పీకర్లు హార్డ్ డిస్క్ డ్రైవర్ హార్డ్‌డిస్క్ హార్డ్‌డిస్క్ partition Anti Virus Audio Players Blogger Widget Blue Tooth Bookmarks Build Site fedaro Feed FFMPEG Flash Memory Gmail google Hard Disk Hard Disk Drivers Hard Disk Partition Hard Disk Problems IE Tab Interesting Sites internet k Keyboard Language Translate Linux Linux Commands Linux mint Local Search Logo Creater ls కమాండ్ LS Command Mobile Networking New Accessories Own Site PC Security photo sales Phython plugins Printers Program RSS/Atom ఫీడ్లు Search Enginee Tab view Telugu Mail Telugu Subtitles Telugu Tech Vidoes Telugu Websites Touch Screen Twitter Ubantu USB లో చల్లదనం Usb Fingerprint USB Laser Mouse USB Speakers Virus Words VLC మీడియా ప్లేయర్ Web Service Windows winFF: Wordpress XP Install