Search
౩ డీ టెక్స్ట్ మేకర్ (3d text Maker)
మీకు నచ్చిన పేరుతో మీ యోక్క బ్రౌజర్
అందరికీ ఓ మంచి వెబ్ సైట్ పరిచయం చేయ్యబోతున్నాను.
కంప్యూటర్ దగ్గర కూర్చున్న ప్రతి ఓక్కరు గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు.
అలాంటప్పుడు మనకి కూడా బ్రౌజర్ లో మన పేరు వస్తే చాలా బాగుంటుంది కదూ..
ఇలా..
మీకు నచ్చినటువంటి ఇమెజ్ బ్యాక్ గ్రౌండ్ తో మీ యోక్క సెర్చ్ హోం పేజ్....
ఆన్ లైన్ నుండే మికు నచ్చిన వేబ్ కి వేళ్ళవచ్చు
పై టైటిల్ చూడగానే ఏమిటి అని అనుకుంటున్నారా!
మికు నచ్చిన సైట్స్ ని అందరూ బుక్ మార్క్ చేసుకుంటారు.అదే లేక కోంత మంది గుర్తు పేట్టుకుంటారు. కాని మనం టైప్ చేయ్యకుండానే ఓక సారి మన సైట్ లని ఆన్ లైన్ లో సేవ్ చేసుకుంటే క్లిక్ చేయ్యగానే మిరు సేవ్ చేసినటువంటి సైట్ కి వేళ్ళవచ్చు.
బకేట్ ప్రింటర్
మనం ఏక్కడికైనా ప్రింటర్ తిసుకోనివేళ్ళాలంటే ఓక బాక్స్ లో తిసుకోని వేళ్ళతాం కాని ఈ ప్రింటర్ బాక్స్ లో తిసుకోని వేళ్ళాల్సిన ఆవసరం లేదు .దినికి కంపేని వారే ఓక బకేట్ ఇస్తారు.దినిని మనం తిసుకోని వేళ్ళాలంటే చాలా ఈజిగా వుంటుంది.దినిని Canon SELPHY CP770 కంపేని వారు తయారు చేశారు.
మన ఇంట్లో కూడా ప్రింటర్ కంప్యూటర్ దగ్గర పేడతాము.కాని ఇంట్లో ఫ్యాషన్ గా వుండదు .అందుకని ఈ ప్రింటర్ అయ్యితే కావలసినప్పుడు వాడుకోని,వద్దునుకున్నప్పుడు బకేట్ లో పేట్టేసి ఇంట్లో పేట్టేస్తే ఇది కూడా ఓక ఫ్యాషన్.
ఇదిగా బకేట్ ప్రింటర్
Usb Fingerprint
4gb కలిగిన fingerprint usb
Windows Office USB Laser Mouse
దినిలో
1600 dpi sensor
Unique ball shape 3D scroll wheel
మనం ఏదైనా పోగ్రామ్ ఓపేన్ చేసి వుంటే దానిని క్లోజ్ చేయ్యాలంటే మౌస్ పాయింటర్ తిసుకోని (X) క్లిక్ చేయ్యాలి. కాని ఈ మౌస్ లో క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది.
Canon Foldable Mouse
దినిని canon కంపేని వారు తయారు చేశారు.
http://www.crunchgear.com/2008/06/16/foldable-3-in-1-mouse-from-canon/
USB లో చల్లదనం,వేడి
ఇంతకుముందు మనం usb fridge మాత్రమే చూశాం.దానిలో కూలింగ్ మాత్రమే చేసుకోవచ్చు.కాని దినిలో అలా కాకుండా చల్లగా కావాలంటే చల్లగా,వేడి కూడా చేసుకోవచ్చు.
ఇదిగో చూడండి అందరికి
The USB Video Adapter
చూడండి కంప్యూటర్ The USB Video Adapter
Keyboard Organizer
కీ బోర్డు స్టోరేజ్ అంటే కీ బోర్డులో ఏదైనా ఫైల్స్ ని స్టోరేజ్ చేసుకోవచ్చు అనుకున్నారా! కాదండి ఇప్పుడు వచ్చే కీ బోర్డు క్రింద ఓక అకారంలో పేట్టేలాగా వుంటుంది.ఇది కీ బోర్డు,కంప్యూటర్ కి సంబందించిన డివిడి,సిడి లు క్రింద పేట్టుకోవచ్చు.
చూడండి ఏలా వుందో.
USB Vacuum Mouse Cleaner
మనమందరం ఫోరంలో చూసేవుంటాము. కీ బోర్డు క్లీనర్ కాని ఇప్పుడు మనం కూడా ఇంకో క్లినర్ ని చూస్తాం అదే మౌస్ క్లినర్ చూద్దమా
ప్రపంచంలో మొట్ట మొదటి 100 Gb Mp3 ప్లేయర్
400GB(DVD) మెగాడిస్క్
దినిని pioneer's కంపేని వారు తయారుచేశారు.
ఇదే 400GB dvd disk
Mini Mouse USB Speaker
దినిని iPod, CD, PDA, computer,మరికోన్నింటికి ఉపయోగించుకోవచ్చు.
చూడండి చాలా ఆశ్చర్యంగా వుంది కదూ.
కీ బోర్డు ని మడత పేట్టండి?
సాఫ్ట్ వెర్ లేకుండా బ్లూటూత్ Dongle ?
నేను సెల్స్ చేసే అతనిని అడిగాను సాఫ్ట్ వెర్ డిస్క్ లేదు అని. అతను ఇది సాఫ్ట్ వెర్ లేకుండా పని చేస్తుంది అని చేప్పాడు. నేను ఓక్క సారిగా ఆశ్చర్యపోయాను.
నేను ఇప్పుడువాడేది విత్ అవుట్ సాఫ్ట్ వెర్ బ్లూటూత్.
hp touch screen all-in-one
మనం అంకోపరి ని చూస్తుంటాము.కాని hp కంపేని వారి సిస్టం all-in-one కనుగోన్నారు. కాని దినికి cpu వుండదు .అన్ని ఓకే దానిలో వుంటాయి. కాని అంకోపరి కాదు.చాలా బాగుంది కదూ చదువుతూ వుంటే
ఇదే hp సిస్టం
All in one & Touch Screen Computer
మనం చాలా వరకూ టచ్ స్రీన్ కంప్యూటర్ లు చూసే వుంటాము. కానీ ఆల్-ఇన్-వన్ టచ్ స్రీన్ కంప్యూటర్ ని చూసారా!
MSI కంప్యూటర్స్ వారు టచ్ స్రీన్ తో పాటు ఆల్-ఇన్-వన్ అంటే CPU వుండదు.
ఓక సారి ఈ కంప్యూటర్ చూడండీ.
కీ లాంటి... ప్లాష్ మెమరీ.....
ప్రతి ఓక్కరు ఇంతవరకూ చాలా ప్లాష్ మెమరిలు రకరకాలుగా వుంటున్నాయి.
కాని ఇప్పుడు ఇందరూ డిజైన్ లు , చిన్న, చిన్న ప్లాష్ మెమరిలు వున్నాయి.
కాని ప్రతి ఓక్కరి దగ్గర కూడా తాళం చేవి కూడా వుంటుంది.
అలాంటి తాళం చెవి మధ్యలో ప్లాష్ మెమరి కూడా తాళం చెవిలా వుంటె చాలా బాగుంటుంది కదూ.
కీ బోర్డు నుండి మీ పేపర్ లని ఏమి చేయ్యవచ్చో చూడండీ.
Pinnacle record, Video Transfer
మనం ఫైల్స్ ని TV, DVD player, PVR, camcorder or set-top box నుండి ప్లాష్ కావాలంటే ప్లాష్ మేమొరిలోకి కావాలంటే చాలా కష్టం.అందుకని ఇప్పుడు Pinnacle కంపేని వారు తయారు చేశారు.దినిని TV, DVD player, PVR, camcorder or set-top box కనేక్ట్ చేసి ప్లాష్ మేమొరిలోకి Pinnacle Video Transfer,record కనేక్ట్ చేయ్యాలి. అది రికార్డింగ్ చేసుకుంటుంది.మళ్ళి కంప్యూటర్ కి కనేక్ట్ చేసుకోని కంప్యూటర్ లో చూసుకోవచ్చు.కావాలంటే బర్నింగ్ చేసుకోవచ్చు.
ఇదిగో మి కోసం
ఐదు బటన్స్త్ తో మౌస్
Evoluent VerticalMouse
ఇప్పటివరకూ మనం మౌస్ లో 2లేదా3 బటన్స్ చూసివుంటాము.కాని ఇప్పుడు కోత్త గా వచ్చింది.మౌస్ దినిలో ఏకంగా 5 బటన్స్ ఇచ్చారు.
దినిని రేండు విదాలుగా ఉపయోగించవచ్చు.
1.బ్లూ టూత్
2.USB
ఇదిగో చూడండి
పేన్ ఆకారంలో మౌస్
ఇది wow కంపేని వారు తయారు చేశారు.
పేన్ ఆకారం లో వున్న మౌస్
Battery with Built in USB Charger
ముందు వున్న కరేంటు తో చార్జింగ్ చేసుకునేవి
వాటర్ ఫ్రూఫ్ కీ బోర్డు
ఇప్పుడు మార్కోట్లో కి వస్తున్నా కీబోర్డు వాటర్ ఫ్రూఫ్ తో వస్తున్నాయి.ఓక వేళ చేతిలో నుంచి జారీపోయి నిళ్ళు కీ బోర్డు మిద పడిన చేడిపోకుండా వుంటుంది.
క్రింద వున్న బోమ్మ ని చూడండి.టి పడింది
IPod Optoma Pico Handled Projector
మనం ఇంతవరకు iPod స్రీన్ లో నే చూశాం కానీ ఇప్పుడు మనకి నచ్చిన చోట చూసేదానికి ఉపయోగపడేవిదంగా optoma pico వారు తయారు చేశారు చేశారు
ipod నుంచి optoma pico కి కనేక్ట్ చేసి,విడియో గోడ పై పడుతున్న దృశ్యం
నేటి మహిళకు మేటి కంప్యూటర్
కాని ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటర్ ని కిచేన్ లో అమర్చుకునే విదంగా చేసారు.
అలస్యం ఏందుకు.తేచ్చి బిగించుకోండి .వంట చేస్తూ కంప్యూటర్ ఏరా ఛాట్ చేయ్యండి
క్రింద వున్న బోమ్మ చూడండి.ఏంత అందంగా వుందో.......
ice box flip screen kitchen entertainment center (slate)
తెలుగు వెబ్‌సైట్లకై శోధన
అత్యంత సులువుగా తెలుగు వెబ్‌సైట్లను గూగుల్‌లో వెతకటం ఎలా?
గూగుల్‌లో మీకు కావలసిన అంశంపై, ఏ ఏ "తెలుగు" వెబ్‌సైట్లు ఉన్నాయో వెతికే అవకాశం ఉంది.
దానికి సులువైన మార్గం ఈ లంకెకు వెళ్ళి ఇంగ్లీషులో టైప్ చేయటం. కానీ ఫలితాలు తెలుగులో ఉంటాయి.
మీరు టైప్ చేసే అక్షరాలకు మంచి ఫలితాలు కావాలంటే, ఈ లంకెలో ఉన్న బొమ్మను చూడండి. అది చూస్తే, ఏ కీ నొక్కితే ఏ తెలుగు అక్షరం వస్తుంది అన్న విషయం మీకే అర్థం అవుతుంది.
తెలుగులో కనిపించే సైట్లు అన్నింటినీ తెలుగులో చూడాలి అన్నటైతే ఈ లంకెలో ఉన్న విధానాన్ని పాటించండి.
తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
ఉపాయం
ఉదాహరణకి ఈనాడు సైటు తీసుకుందాం. ఈ సైటుని ఫైర్‌ఫాక్స్ లో తెరిచినట్లైతే, ఇదిగో ఆ పక్క బొమ్మలో చూపినట్టు కనబడుతుంది. ఈనాడు ఒక్కటే కాదు, తెలుగులో కొన్నేళ్ళ నుంచి ఉంటున్న చాలా సైట్లు అలాగే ఉన్నాయి. అయితే వీటిల్లో కొన్నింటిని ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో మాత్రం సరిగ్గానే చూడొచ్చు. అయినా అన్ని సైట్లకి కలిపి ఒక పరిష్కారం ఉంటే బావుంటుంది కదూ, అది కూడా మనకిష్టమైన ఫైర్‌ఫాక్స్ విహారిణిలో! ఉండనే ఉంది! అదే, పద్మ అని వెన్న నాగార్జున గారు మొదలుపెట్టిన ఒక ఫైర్‌ఫాక్స్ పొడిగింత(ప్లగిన్). ఇక్కడికెళ్ళి Add to Firefox లేదా Install అని కొడితే ఆ పొడిగింత ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒక్కసారి ఫైర్‌ఫాక్స్ మూసి తెరవాలి. ఇకనుంచి మీరు ఏ తెలుగు సైటు కెళ్ళినా అందులో సమస్యేంటో తెలుసుకుని అదే సరిచేసేస్తుంది. ఏ చింతా లేకుండా తెలుగు సైట్లు చూసుకోవచ్చు.
వివరణ
ఇప్పుడు, ఒక సగటు మనిషికి అర్థమయ్యే మాటల్లో, అసలు ఆ సైట్లు ఎందుకు అలా ఉన్నాయో చూద్దాం.
ఇదివరకు, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రిందట, కంప్యూటర్లో తెలుగు భాషకి ఒక అధికారిక ప్రామాణికమంటూ ఒకటి లేదు. కానీ తెలుగువారికి కుడా అంతర్జాలంలో సైట్లు ఉన్నాయ్ కదా, అవి తెలుగులోనే ఉండాలి కాబట్టి, ప్రామాణికాలేవీ లేకపోయే సరికి ఎవరికి వారే ఒక ప్రామాణికం ఏర్పాటుచేసుకున్నారు. ఎలా అంటే, ఒకరు "A" అంటే "అ" అనుకుంటారు. ఇంకొకరు "A" అంటే "క" అనుకున్నారు. ఇలా అప్పటికి కంప్యూటర్లో ప్రామాణికాలున్న లాటిన్ అక్షరాలను తెలుగు అక్షరాలకు ఎవరిష్టంవచ్చినట్టు వాళ్ళు మ్యాప్ చేసేసుకున్నారు. అలా పుట్టినవే ఈనాడు ఫాంటు, వార్తా ఫాంటు వగైరా వగైరా. ఇలా ఒకటా రెండా, బోల్డన్ని ఫాంట్లు వచ్చేశాయ్. కానీ ఇప్పుడు పరిస్థితి మారి యూనీకోడ్ అనే ఒక వ్యవస్థ పుట్టుకొచ్చింది. అది ప్రపంచభాషల్లో చాలావాటికి ప్రామాణికాలేర్పరిచింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే సైట్లు, బ్లాగులు, అన్నీ ఆ ప్రామాణికాన్నే వాడుతున్నారు. ఈ యూనీకోడ్ అన్ని కంప్యూటర్లలోనూ బాగానే కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ చెప్పిన విధానాన్ని అనుసరించండి. కానీ సారూ! ఈ 10-15 సంవత్సరాలుగా ఉన్న సైట్ల మాటేమిటి? అని మీరడగొచ్చు. హా..! సరిగ్గా ఇదే ఆలోచన నాగార్జున గారికి ఎప్పుడో వచ్చిందేమో, అందుకే ఆ "ఎవరికివారు చేసుకున్న" ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా ఒక ఉపకరణం తయారుచేయాలని సంకల్పించారు. ఇంకా ఎంతోమంది ఔత్సాహికులు ఆ ఉపకరణానికి తమతమ తోడ్పాటుని అందించారు. నేటికి పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల సామర్థ్యానికి ఎదిగింది.
నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
మనం రోజూ లినక్‌స్‌లో చేసే పనులకు కావలసిన సాఫ్ట్వేర్ల జాబితా క్రింద ఇవ్వటం జరిగింది. వీటిని (వీటిలో కొన్నింటిని) ఇంస్టాల్ చేసుకొంటే సాధారణ వాడుకరులకు కావలసిన అన్ని పనులూ చేసుకోవచ్చు.
సాధారణంగా వాడే లినక్స్ ఉబుంటు. ఆర్డర్ చేస్తే ఉచితంగా ఇంటికి సీడీ పంపుతారు. కానీ ఇది ఇంస్టాల్ చేసుకున్న తరువాత ఇందులో మనకు అవసరమైయ్యే సాఫ్ట్వేర్లు ఉండవు. వాటిని ఇంస్టాల్ చేసుకోవాలి.
మనకు నిత్యం అవసరమైయ్యే సాఫ్ట్వేర్ల జాబితా క్రింద ఇవ్వటం జరిగింది.
కేవలం ఉబుంటు లినక్సుకు మాత్రమే కాదు ఈ సాఫ్ట్వేర్లు అన్ని లినక్సులకూ పనిచేస్తాయి. అన్నీ ఉచితంగా లభిస్తాయి.
క్రింది జాబితాలో అన్నీ ఇంస్టాల్ చేసుకోనవసరం లేదు, మీరు తరచూ వాడే సాఫ్ట్వేర్‌ల జాబితాలోకి వచ్చే వాటిని వాడితే సరిపోతుంది.
ఇంటెర్‌నెట్ :
1. బ్రౌజర్ : ఫైర్ ఫాక్‌స్.
2. ఫైర్ ఫాక్‌స్ యాడ్-ఆన్‌లు మరియూ ఎక్‌స్టెన్‌షన్‌లు (Firefox addons) : పద్మా (Padma), ఎక్స్-మార్క్స్ (Xmarks), ఆంసర్స్ (Answers), స్టంబుల్ అపాన్ (Stumblw-Upon), కూల్-ఐరిస్ (Cooliris), ఫ్లాష్ సపోర్ట్
3. డౌంలోడ్ మ్యానేజర్: డీ4ఎక్స్ (D4X), జి.డబ్లూ.గెట్ (gwget)
4. ఇంస్టంట్ మెసెంజర్ (చాటింగ్): పిజియన్ (pidgin), స్కైప్ (skype)
5. టోరెంట్ క్లైంట్ : కె-టోరెంట్ (kTorrent), వూజ్ (vuze)
6. మరి కొన్ని : గూగుల్ అర్‌థ్ (Google Earth), పికాసా (Picasa)
ఆడియో వీడియో :
1. వీడియో : వీ.ఎల్.సి (VLC), ఎస్.ఎం.ప్లేయర్ (SMPlayer), టోటెం ప్లేయర్(Totem Player), మిథ్‌టీవీ (mythtv).
2. పాటల కోసం : అమెరాక్ (Amarok), సాంగ్ బర్డ్ (Song Bird).
3. వీడియో కన్‌వర్టర్‌లు : ఇరివర్‌టర్ (iriverter).
4. అడియో కన్‌వర్టర్‌లు : సౌండ్ కన్‌వర్టర్ (sound converter).
5. డెస్‌క్‌టాప్ రికార్డర్ : రికార్డ్ డెస్‌క్‌టాప్ (recorddesktop).
తక్కినవి :
భాషలు : తెలుగుతో పాటుగా కావలసిన ఇతర భాషలు.
సాఫ్ట్వేర్ ఇంస్టాలర్‌లు : వైన్ (Wine), సినాప్‌టిక్ ప్యాకేజ్ మ్యానేజర్(Synaptic Package Manager), ఏలియన్ (alien).
ఆఫీస్ టూల్‌స్ : ఓపెన్ ఆఫీస్ (Open Office).
సీడీ డీవీడీ బర్నర్ : కె3బి (K3b).
ఆటలు : పింగూస్ (pingus), జీయల్-117 (gl-117), జియల్‌ట్రాన్ (gltron).
మల్టీ మీడియా : జింప్ (Gimp), చీస్ (cheese) - వెబ్ క్యాం ఉన్నవారికి మాత్రమే.
డెస్‌క్‌టాప్ అపియరెంస్ : కాంపిజ్-కాంఫిగ్-సెట్టింగ్-మ్యానేజర్ (ccsm), స్క్రీన్‌లెట్‌స్ (screenlets), వాల్‌పేపర్ ట్రే (wallpaper-tray), ఎమెరాల్‌డ్ (Emerald).
నెట్వర్కింగ్ : ఓపెన్ ఎస్‌ఎస్‌ఎచ్ క్లైంటు మరియూ సర్వర్ (openssh client and server), డీ.సీ.ప్లస్‌ప్లస్ (DC++), కే.డీ.ఈ.బ్లూటూత్ (kdebluetooth).
ప్రోగ్రామింగ్ : క్వాంటా ప్లస్ (Quanta Plus), బిల్‌డ్-ఎసెన్షియల్ (Build-essential), మై-ఎస్‌క్యూఎల్(MySQL), అంబ్రెల్లో (Umbrello), అప్యాచీ (Apache), జిసిసి (gcc), యాక్యుయేక్ (yakuake).
వర్చువల్ మెషిన్ : వర్చువల్ బాక్‌స్ (VirtualBox).
డిస్క్ టూల్స్ : ఎన్‌టీఎఫ్‌ఎస్-కాన్‌ఫిగ్ (ntfs-config)