మీడియా ప్లేయర్ లో మనం ముఖ్యంగా చూసే ఫీచర్లు
- మల్టిమీడియా కీబోర్డు షార్ట్ కట్లు పని చేయడం
- రకరకాల మీడియా ఫైళ్లను సులువుగా ప్లే చేయడం
- పెద్ద పెద్ద లైబ్రరీలను అవలీలగా ఆపసోపాలు పడకుండా హేండిల్ చేయడం
- మీడియా ఫైళ్ళను టాగ్ చేయడం
- మామూలు & డైనమిక్ ప్లే-లిస్ట్లను సృష్టించుకోవడం
- ఆడియో స్క్రాబ్లర్ తో అనుసంధానం ఉండటం
- ట్రేలో పడుండి పనికి అడ్డురాకుండా ఉండటం
ఈ సౌకర్యాలు ఉన్న ప్లేయర్లు ఏంటో చూసి, ఏ ప్లేయర్ ఏయే పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతుందో కూడా చూద్దాం.
౧. రిథం బాక్స్. (Rhythmbox)
ఇది అన్ని లినక్సు లతో పాటుగా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు. కాబట్టి విడిగా ఇన్స్టాల్ చేస్కోనక్కర్లేదు. మరీ ఎక్కువ పాటలు (>౧౦ వేలు) ఉంటే చతికిలబడి మనల్ని కలవర పెట్టే లక్షణం కలదు, బహుపరాక్ :) ఇంకో నచ్చని విషయం ఏంటంటే, బ్రౌజరు లో, composer ఫీల్డ్ పెట్టుకుందామంటే వీలవ్వదు! మన తెలుగు లో గాయని గాయకుల్ని ఆర్టిస్ట్ ఫీల్డ్ లోనూ, సంగీత దర్శకుడ్ని composer ఫీల్డ్ లోనూ పెట్టడం ఆనవాయితీ. కాబట్టి ఒక ఫీల్డ్ వదులుకున్నట్టు అవుతుంది. ట్యాగ్ చేయడానికి ఉన్న సౌలభ్యమ్ కూడా అంతా గొప్పగా ఉండదు. ఇవి తప్పితే, మిగతా అన్నీ విషయాలు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు.
౨. లిజన్.(Listen)
ఇందులో కూడా composer ఫీల్డ్ ఉండదు. మరీ ఎక్కువ పతలుంటే, ఒక మోస్తరుగా పర్వాలేదు అన్నట్టుగానే ఉంది, మరి బేలగా కాకుండా. ట్యాగ్ చేసే సౌలభ్యమ్ కూడా ఒక మోస్తరుగానే ఉంది. మిగతావన్నీ బాగానే ఉన్నట్టు చెప్పొచ్చు.
౩. అమరాక్. (amarok)
కే.డి.యి లో దీనికి మించిన ప్లేయర్ లేదనే చెప్పొచ్చు. పైన చెప్పినవాటిల్లో అన్నిటికీ అన్నీ బావున్నాయనే చెప్పాలి. కానీ, నన్ను పదే పదే తొలిచి వేసే ప్రశ్నేంటంటే, ఇంతకు ముందు ఇంకా బావుండే ఈ ప్లేయర్ ని కొంచెం హడావిడి ఎక్కువ చేసి దానికి ఉన్న సాదా సీదా వన్నెని తీసేశారు! అయిన కూడా, అలవాటు పడ్డాక బాగానే అనిపించింది. మీరు కే.డి.యి వాడేవారు అయితే, ఇంకో ప్లేయర్ వైపు కన్నెత్తి కూడా చూడకండి :)
౪. కోడ్ లిబెట్. (quod libet)
లినక్సులో ఆవన్నీ ఉన్నవి చాలానే ఉన్నా, అన్నిటిలోనూ నాకు నచ్చిన ప్లేయర్ - కోడ్‌లిబెట్. మన దగ్గరున్న మ్యూజిక్ కి లైబ్రరీ నిర్మించుకుని, దాన్ని సర్వ హక్కులతో మనమే నిర్వహించుకోవాలంటే, ఇదో మంచి ప్రత్యామ్నాయం. దీన్ని మిగతా వాటితో పోల్చి ఇదే మంచిది అని చెప్పడానికి ముఖ్య కారణం - ఈ ప్లేయర్ ని మనం చాలా వరకు మనకు కావాల్సిన విధంగా మలుచుకుని వాడుకోవచ్చు. దీనిలో ముఖ్యమైన కొన్ని ఫీచర్లు ఇవీ..
- దీనికి ఉన్న ట్యాగ్ చేసే సౌలభ్యమ్ ఇప్పటి వరకు లినక్సు లో ఉన్నవాటిలోకెల్లా ఉత్తమమైనది.
- మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి అలవాటుపడిన జీవి ఐతే, మీకు కావాల్సిన సరైన తిరుగులేని జోడి ఇదే! ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి అలవాటు పడిన వాళ్ళకే తెలుస్తుంది దాని మజా, మీకు ఇంకా తెలియక పోయుంటే సరదాగా ఓ పట్టు పట్టండి.
- ఇంతకు ముందు చెప్పినట్టు, బ్రౌజరు లోనే, కాక, వ్యూయర్ లో కూడా మనకు ఇష్టమొచ్చిన ఫీల్డ్లు పెట్టుకోవచ్చు.
- మీ ప్లేలిస్టులను వెబ్ లో సులభంగా ప్రచురించవచ్చు, మంచి ఫార్మాట్టింగ్ తో!
- ఇంకా ఇలాంటివే శతకోటి! (ఇక్కడ చూడొచ్చు)
౫. పాటల పిట్ట!
వీటన్నిటికి అతీతంగా, ఇంకో పిట్ట దూసుకుపోతోంది.. అదే పాటల పిట్ట(Song bird)!. ఇందులో కూడా అన్ని ఉన్నాయ్! విండోస్ లో ఐట్యూన్స్ ని బాగా రుచిమరిగిన పిపాసులకి, ఇది కూడా భలే రుచిస్తుంది! అంటే కాక, ఐట్యూన్స్ లో లేని కొన్ని అదనపు విశేషాలు కూడా ఉన్నాయండోయ్!
కాబట్టి మాష్టారు, మీకు కావాల్సిన ప్లేయర్ ని ఎంచుకుని, నచ్చిన పాటకి చిందెయ్యండి!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి