1(౧). పైతాన్ ఇన్స్టాల్ చేస్కోవడం
విండోస్ వాడేవారు: ఈ లంకెకు వెళ్లి, మీరు ఇంటెల్ సిస్టం వాడుతుంటే, Windows x86 MSI Installer ని దించుకుని ఇన్స్టాల్ చేస్కోండి. 64 బిట్ సిస్టం వాడుతుంటే, Windows AMD64 MSI Installer దించుకుని ఇన్స్టాల్ చేస్కోండి. ఇక్కడ అంతకంటే తాజా వెర్షన్ ఉంది కానీ, ఇదివరకు వాడుకలో ఉన్న కొన్ని కమాండ్లు అందులో పని చేయకపోవచ్చు.
లినక్సు వాడేవారు: నూటికి 99.999999 శాతం మీరు వాడే లినక్సు లో పైతాన్ ఉండే ఉంటుంది. (ఒకసారి టెర్మినల్ లో python --version అని కొట్టి చూడండి. వెర్షన్ చూపిస్తే సరే, లేదంటే ఈ క్రింది చెప్పినట్టు ఇన్స్టాల్ చేస్కోండి)
ఉబుంటు వాడేవారు:
sudo apt-get install python
ఫెడోరా వాడేవారు:
yum -y install python
2(౨). ఎడిటర్ ఇన్స్టాల్ చేస్కోవడం
పైతాన్ సిద్దం! ఇక ప్రోగ్రామ్లు రాయడానికి ఒక ఎడిటర్ కావాలి.
విండోస్ లో notepad++ అని ఒకటుంది, అదైతే మంచిది, మనం రాసే ప్రోగ్రాంలన్నీ రంగులతో చూపిస్తుంది, ఇండెంట్ చేస్తుంది. సాధారణ notepad తో అవి కుదరవు. notepad++ కోసం, ఈ పేజి లో npp.x.y.z.Installer.exe అని ఉన్నదాన్ని దించుకుని ఇన్స్టాల్ చేస్కోండి.
లినక్సు లో vim కి ఇంకేది సాటి రాదనేది నా అభిప్రాయం. ఫెడోరా లో vim కావాల్సిన విధంగానే వస్తుంది, కానీ, ఉబుంటు లో, మరీ అస్థిపంజరంలా ఉంటుంది. vim వాడాలనుకునే వాళ్ళు, ఈ క్రింది కమాండ్ తో vim పూర్తి ప్యాకేజ్ పొందవచ్చు. మీకు టెర్మినల్ పడకపోతే, gedit కాని, kate కాని వాడుకోవచ్చు.
sudo apt-get install vim
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి