గూగుల్ క్రమంగా తన సేవలన్నిటినీ భారతీయులకి భారతీయ భాషల్లో అందింస్తున్న క్రమంలో జీ-మెయిల్లో లిప్యంతరీకరణ సదుపాయం కల్పించింది(అంటే transliteration సదుపాయం, మన భాషని ఇంగ్లీషు కీబోర్డు సాయంతో టైప్ చేయడం). ఇప్పుడే మీరు మీ జీ-మెయిల్లోకి వెళ్ళి మెయిల్ టైప్ చేయడానికి ప్రయత్నిస్తే, అక్కడ ఒక కొత్త బటన్ చూడవచ్చు. ఆ పక్కనే ఉన్న బొమ్మలో చూపించినట్టు.
ఇప్పుడు మీరు అలా అలా ఇంగ్లీషులో తెలుగు టైపు చేసేస్తే, గూగుల్ ఇలా ఇలా తెలుగు లిపి లోకి మార్చేస్తుంది. ఇక మీరు ఎక్కడ, ఎవరి కంప్యూటర్ లో జీ-మెయిల్ వాడాల్సి వచ్చిన, "అరరే దీంట్లో తెలుగు టైపింగ్ కి సౌలభ్యం లేదే" అనే గొడవుండదు. మీకు ఒకవేళ ఆ బటన్ కనిపించకపోతే ఇలా చేయండి. సెట్టింగుల్లో(Settings) > సాధారణలో(General) > భాష(Language) క్రింద, transliteration/లిప్యంతరీకరణ enable చేయమని ఉంటుంది. చేసేసి, తెలుగు ఎంచుకోండి. సెట్టింగులు సేవ్ చేసేయ్యండి. అంతే! ఇక తెలుగులో మెయిల్స్ రాయడం మొదలు పెట్టండి!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి