గూగుల్ వారి ఉపకరణం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేస్కోవచ్చు. మైక్రోసాఫ్ట్ వారిది ఇక్కడ నుండి డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాఠ్యాంశంలో చెప్పినట్టుగానే మాములు చాట్ భాషతోనే ఇంగ్లీషులో రాస్తే చక చకా తెలుగు లిపి లోకి మార్చేస్తుంది.
ఆ రెండు ఉపకరణాలు ఇన్స్టాల్ చేస్కున్నాక, వాడుకోవడానికి ఇలా చేయాలి, ఈ క్రింద చెప్పిన సూచనలు విండోస్ xp, విస్టా, ౭ లలో language bar ని టాస్క్బార్ లో చూపించేలా చేస్తాయి.
విస్టా, విండోస్ 7(౭) కి సూచనలు
- కంట్రోల్ ప్యానెల్ లో region and language setttings కి వెళ్లి,
- అక్కడ region and language క్రింద ఉన్న Change keyboards or other input methods అని ఉన్న దాన్ని ఎంచుకోండి.
- తెరుచుకున్న విండో లో, Keyboards and Languages అన్న ట్యాబు లో, Change keyboards అని ఉంటుంది. అది ఎంచుకోండి.
- ఆ వచ్చిన విండో లో, Language bar అనే ట్యాబు ఎంచుకుని, Docked in the taskbar అన్నదాన్ని ఎంచుకోండి.
- తెరిచున్న రెండు విండోలలోను ఓకే కొట్టేసి, నోట్పాడ్ అన్నా, వర్డ్పాడ్ అన్నా తెరిచి ఉంచుకోండి.
- క్రింద టాస్క్ బార్ లో EN అని ఉంటుంది. దాన్ని నొక్కితే, మెనూ లో తెలుగు కనిపిస్తుంది. ఎంచుకోండి.
- EN అన్నది TE గా మారి, దాని పక్కనే కీ బోర్డు బొమ్మ వస్తుంది. దాని పై నొక్కితే, గూగుల్, మైక్రోసాఫ్ట్ వారి లిప్యంతరీకరణ టైపింగ్ విధానాలు కనబడతాయి.
- ఎంచుకుని, ఇంగ్లీషులో తెలుగు టైపు చేయడం మొదలెట్టండి!
- కంట్రోల్ ప్యానెల్ లో region and language setttings కి వెళ్లి,
- Languages ట్యాబు లో, Text services and Input languages లో, Details నొక్కండి.
- ఆ తెరుచుకున్న విండో లో, preferences లో language bar ఎంచుకోండి.
- ఆ వచ్చిన విండో లో, Show language bar on desktop ని ఎంచుకోండి.
- తెరిచున్న రెండు విండోలలోను ఓకే కొట్టేసి, నోట్పాడ్ అన్నా, వర్డ్పాడ్ అన్నా తెరిచి ఉంచుకోండి.
- క్రింద టాస్క్ బార్ లో EN అని ఉంటుంది. దాన్ని నొక్కితే, మెనూ లో తెలుగు కనిపిస్తుంది. ఎంచుకోండి.
- EN అన్నది TE గా మారి, దాని పక్కనే కీ బోర్డు బొమ్మ వస్తుంది. దాని పై నొక్కితే, గూగుల్, మైక్రోసాఫ్ట్ వారి లిప్యంతరీకరణ టైపింగ్ విధానాలు కనబడతాయి.
- ఎంచుకుని, ఇంగ్లీషులో తెలుగు టైపు చేయడం మొదలెట్టండి!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి