దేని గురించైనా తెలుసుకోవాలంటే దాని ఆకారం లేదా ప్రవర్తన గూర్చి తెలుసుకోవటం ఎంతైనా అవసరం. అలాగే లినక్స్ గూర్చి తెలుసుకోవటానికి దాని డైరెక్టరీ క్రమం గూర్చి తెలుసుకోవటం ఉపయోగకరం. అందులోనూ లినక్స్ కు మరియు విండోస్ కు, వాటి వాటి పొందికలలో చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలకు సంబందించిన దాఖలాలు ఉంటాయో ఈ టపాలో తెలుసుకొందాం.
విండోస్ లో ఏదైనా ఫైల్ ఉన్న దారి సూచించాలంటే క్రింద తెలిపిన విధంగా వాడతాము.
c:\folder\subfolder\file.txt
అదే లినక్స్ లో అయితే ఇలా వాడతాము
/folder/subfolder/file.txt
ఇక్కడ గమనిస్తే, విండోస్ లో వాడిన స్లాష్ గుర్తు వెనక్కు వాలినదై ఉంది(back slash). అదే లినక్స్ లో ఐతే ముందుకు వాలినదై ఉంటుంది. అలాగే విండోస్ లో లాగా లినక్స్ లో సీ మరియు డీ డ్రైవ్ ల లాంటివి కనపడవు. ఎందువలనంటే లినక్స్ లో ప్రతి ఒక్క డ్రైవ్ లేదా ఫైల్ లేదా ఏ డివైస్ అయినా కాని ఒకే ఒక పార్టిషన్ క్రింద ఉన్న డైరెక్టరీలలో ఎక్కుపెట్టబడి ఉంటాయి. దాని పేరు రూట్ పార్టిషన్. దానిని / గుర్తుతో సూచిస్తారు. పైన తెలిపిన వాడుకను గమనిస్తే ఆ దారిలో మొదటి గుర్తు / గా ఉంది.
విండోస్ కు మరియు లినక్స్ కు మరో తేడా ఉంది. విండోస్ లో దారి సూచించేటప్పుడు పెద్ద C కు మరియు చిన్న c కు తేడా లేదు. అందుకే c:\folder\subfolder\file.txt మరియు C:\FOLDER\subfolder\file.txt విండోస్ లో ఒక్కటే. కానీ లినక్సులో /folder/subfolder/file.txt మరియూ /FOLDER/subfolder/file.txt ఒకటి కాదు.
లినక్సులో మనం తెలుసుకోవలసిన డైరెక్టరీల పట్టీ ఇది:
విండోస్ కు మరియు లినక్స్ కు మరో తేడా ఉంది. విండోస్ లో దారి సూచించేటప్పుడు పెద్ద C కు మరియు చిన్న c కు తేడా లేదు. అందుకే c:\folder\subfolder\file.txt మరియు C:\FOLDER\subfolder\file.txt విండోస్ లో ఒక్కటే. కానీ లినక్సులో /folder/subfolder/file.txt మరియూ /FOLDER/subfolder/file.txt ఒకటి కాదు.
లినక్సులో మనం తెలుసుకోవలసిన డైరెక్టరీల పట్టీ ఇది:
/bin/ - బిన్
/dev/ - డెవ్
/etc/ - ఈ.టి.సీ
/home/ - హోం
/lib/ - లిబ్
/media/ - మీడియా
/root/ - రూట్
/sbin/ - ఎస్ బిన్
/tmp/ - టెంప్
/var/ - వ్యార్
డైరెక్టరీ | అందులో ఏం ఉంటాయి? |
బిన్ (bin) | ఇందులో ప్రతి యూజర్ వాడుకోగలిగే అన్ని ప్రోగ్రాంలు ఉంటాయి. అన్నీ బైనరీ ఫైళ్ళే. అందుకే దీని పేరు bin(ary). ఉదాహరణకి : cat, ls, cp ప్రోగ్రాంలు ఇందులోనే ఉంటాయి. |
డెవ్ (dev) | ఇందులో హార్డ్ డిస్కులు, మోడెం లు , సౌండ్ కార్డ్ లాంటి అన్ని పరికరాలని(devices) సూచించే ఫైల్లు ఉంటాయి. |
ఇటిసి (etc) | ఇందులో టెల్ నెట్, ఎస్ ఎస్ హెచ్, ఎస్.యమ.టి.పి/పాప్౩ లాంటివాటి సెట్టింగులు ఉంటాయి. DSN సెట్టింగుల లాంటివి ఇందులో ఉన్న ఫైల్ లలో నే ఉంటాయి. |
హోం (home) | ప్రతి యూజర్ ఎకౌంటు కు ఒక డైరెక్టరీ ఇందులో ఉంటుంది. మీరు లాగిన్ అయినప్పుడు మీకు కనపడే డెస్క్టాపు కుడా ఈ డైరెక్టరి లోని భాగమే. దిని యొక్క చిరునామా - /home/username/Desktop టెర్మినల్ ద్వారా లాగిన్ ఐతే ఆ యూజర్ యొక్క హోం డైరెక్టరీ లోనికి తిసుకేలుతుంది. /home/username ఈ డైరెక్టరీ ని మార్చాలంటే ఈ.టి.సీ లో ఉన్న ఫైల్ ను ఒకదానిని మార్చాలి. |
రూట్ (root) | లినక్స్ లో సర్వాధికారాలు కలిగిన వాడుకరి పేరు రూట్. ఈ వాడుకరికి తన హోం డైరెక్టరి /home లో ఇవ్వటానికి బదులు /root గా ఇవ్వబడుతుంది |
లిబ్ (lib) | ఇందులో కెర్నెల్ మాడ్యుళ్ళు మరియూ కంప్యుటర్ భాష లకు (పెర్ల్, పైతాన్, సీ మొ||) సంభందించిన లైబ్రరీలు(libraries) ఉంటాయి |
మీడియా (media) | ఇందులో హార్డ్ డిస్క్ డ్రైవ్ లు, సీ.డీ.డ్రైవ్ లు, పెన్ డ్రైవ్ లు లాంటివి ఎక్కుపెట్టబడి ఉంటాయి. విండోస్ లో మై-కంప్యుటర్ లో కనిపించినవన్నమాట. |
ఎస్.బిన్ (sbin) | సిస్టం ప్రోగ్రాంలు ఇక్కడ ఉంచబడుతాయి(secure binary files అన్నమాట.). పార్టిషన్ లు తయారు చేయటం, నెట్వర్క్ పరికరాలు లాంటివి. సాధారణ వాడుకరులకు ఇవి అందుబాటులో ఉండవు. |
టెంప్ (tmp) | తాత్కాలికంగా(temporary) ఏదైనా ఫైల్ ను భద్రపరచాలంటే ఈ డైరెక్టరీ ని వాడుతారు. యుట్యూబ్ లో విడియో లు చూస్తున్న సమయము లో, ఈ డైరెక్టరీ లో ఆ విడియో ఫైల్ ఉంటుంది. అలాగే ఏదైనా ఇంస్టాల్ చేస్తున్నప్పుడు తాత్కాలింకంగా కావలసిన ఫైళ్ళను ఇక్కడ ఉంచుతుంది. |
వ్యార్ (var) | డేటా బేసులు, సర్వర్లు, లాగ్ ఫైల్లు, సిస్టం యొక్క మెయిల్ మెసేజ్ లు ఇక్కడుంటాయి. అలాగే ఇంస్టాల్ చేసిన కొన్ని సాఫ్ట్వేర్ ల యొక్క బైనరీ ఫైల్లు కూడా ఇందులో ఉంటాయి |
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి