మీకు ఒక సొంత సైట్ ఉంటే దాని నిర్మాణం మొత్తం మీకు మీరే చేతులమీదకి ఎత్తుకోవక్కర్లేకుండా, కాగల కార్యం చిక్కుల్లేకుండా కానిచ్చేసేందుకు ఎన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయ్. వాటిని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటారు. అందులో చాలా తేలికైన, ప్రసిద్దిచెందిన వర్డుప్రెస్సుని మీ సైట్ లో ఎలా ఇన్స్టాల్ చేస్కోవాలో చూద్దాం.
గమనిక: ఈ క్రింది సూచనలు వర్డుప్రెస్సు సైట్ లో ఇంగ్లీష్ లో ఉన్న సూచనలకు అనువాదాలు.
హోస్టింగ్/ఆవాసం తీస్కున్నప్పుడు వారు మీకు సర్వర్ కి కన్నెక్ట్ అవ్వడానికి ftp/ssh వినియోగదారునామము(username), సంకేతపదము(password) ఇస్తారు. వర్డుప్రెస్సు మీ సర్వర్ పై ఇన్స్టాల్ చేయడం చాల సులువైన, 5 నిమిషాల పని! ఈ క్రింది సూచనల్ని పాటిస్తే చాలు!
- ఇక్కడ నుంచి వర్డుప్రెస్సు ప్యాకేజీ ని డౌన్లోడ్ చేస్కుని, దాన్ని unzip చేయండి.
- మీ హోస్టింగ్/ఆవాస సర్వర్ లో ఒక డేటాబేసు సృష్టించుకోండి. ఒకవేళ ఆ డేటాబేసు కి వినియోగదారుడు ఇంతకు మునుపే లేకపోయుంటే, ఆ డేటాబేసు మీద సర్వ హక్కులు ఉండేలా ఒక వినియోగదారుని కూడా సృష్టించండి.
- మీరు unzip చేసిన ఫోల్డర్ కి వెళ్లి wp-config-sample.php అనే ఫైల్ పేరుని wp-config.php గా మార్చండి
- wp-config.php ఫైల్ ని తెరిచి ఆ డేటాబేసు వివరాలు పూరించండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ తో మాత్రం తెరవవద్దు. ఏ నోట్పాడో(notepad) ఐతే మంచిది. డేటాబేసు వివరాలు ఎలా పూరించాలో ఆ ఫైల్ తెరిచి చూస్తే మీకే అర్థమయిపోతుంది. దానిలో Database Username, Password etc.. అని రాసి ఉంటుంది. అవి చూసుకుని ఎక్కడ ఏ వివరం రాయాలో అది రాసేయ్యాలి.
- ఇప్పుడు ssh/ftp ద్వారా ఈ ఫోల్డర్ లో ఉన్నవన్నీ(ఆ ఫోల్డర్ మటుకు కాదు సుమా, అందులో ఉన్నవి మాత్రమే!) మీ హోస్టింగ్/ఆవాస సర్వర్ లో పెట్టాలి. సర్వర్ లో సరైన జాగాలో పెట్టడం ముఖ్యం. ఒకవేళ తెలియకపోతే ఎవరినైనా అడిగి చేయండి. లేదా ఇక్కడే మీ సందేహం ఏంటో తెలపండి. సాదారణంగా తలెత్తే కొన్ని సందర్భాలు ఇవీ,
- ఇక చివరి ఘట్టం! వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేయడానికి http://site.com/wp-admin/
install.php కి వెళ్ళాలి. ఇక్కడ site.com బదులు మీ సైట్ పేరు ఇవ్వండి. ఇది వర్డుప్రెస్సు సరాసరి వెబ్సైటు రూట్ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చేస్కునే వారికి. ఒకవేళ మీరు వేరే చోట పెట్టి ఉంటే అందుకు అనుగుణంగా ఆ URL మార్చుకోవాలి. ఉదాహరణకి blog అనే ఫోల్డర్ లో గనక ఇన్స్టాల్ చేస్కుని ఉంటే, http://site.com/blog/wp-admin/ install.php కి వెళ్ళాలి.
వర్డుప్రెస్సు తో ప్రాధమికంగా ఏమేమి చేయొచ్చో ఇక్కడ రాశాను. ఒకసారి అది చూడండి. వచ్చే టపాలో వర్డుప్రెస్సు లో కొత్త పొడిగింతలు/ప్లగిన్లు, అలంకారాలు/థీమ్స్ ఎలా పెట్టాలో తెలుసుకుని, పలురకాల సైట్లకి వర్డుప్రెస్సుని ఏ విధంగా మార్చుకోవొచ్చో కూడా చూద్దాం.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి