మీ డెస్క్టాపు ఐకాన్ లతో నిండి పోయి విసుగోస్తుందా? ఐతే దానికో విరుగుడుంది. ఫెన్సెస్ అనే ఒక సాఫ్ట్వేర్ తో మన డెస్క్టాపు ని శుభ్రం చేసుకుని నీటుగా పెట్టుకోవోచ్చు. ఎలాగో చూద్దాం.
- ముందు ఇక్కడికి వెళ్లి ఆ ఫెన్సెస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసేస్కోండి.
- డౌన్లోడ్ అవ్వగా వచ్చిన సెటప్ ఫైల్ ని డబల్ క్లిక్ కొట్టి ఇన్స్టాల్ చేస్కోండి.
- రీస్టార్ట్ చేయమంటుంది, అవసరం లేదని నా ఉద్దేశ్యం :)
- ఇప్పుడు డెస్క్టాపు మీద "Customize Fences" అని ఒక ఐకాన్ ఉంటుంది.(అదనంగా ఇంకో ఐకాన్ ఆ అని అలా కారాలు మిరియాలు నూరమాకండి! ఒక్క నిమిషం..). ఒకవేళ డెస్క్టాపు మీద లేకపొతే All Programs కి వెళ్లి చూసి, ఆ ఐకాన్ మీద నొక్కి ఆ ప్రోగ్రాం తెరవండి. ఈ క్రిందబొమ్మలో చూపించినట్టు కనిపిస్తుంది.
- అక్కడ మీకు నచ్చిన లేఅవుట్ ని ఎంచుకుని, Customize మీద క్లిక్ చేసి దాని రంగు రూపులు మీకు నచ్చినట్టు సరిచేసుకోండి. ఒకవేళ డెస్క్టాపు సరి చేసిన ప్రతిసారీ అది మునుపు ఎలా ఉండేదో చూసుకోవాలి అంటే, Tools మీద నొక్కి, Take Snapshot మీద క్లిక్ చేయండి, ఒక తెరపట్టులా బద్రపరుస్తుంది. మీకు ప్రస్తుతం ఉన్న లే అవుట్ నచ్చక పొతే అందులో మీకు నచ్చిన లేఅవుట్ ఉన్న తెరపట్టు మీద నొక్కితే మీ ఐకాన్లు ఆ బొమ్మలో ఉన్న స్థానాలకి వెళ్లిపోతాయి!
- ఇక ఆ సెట్టింగుల విండో మూసేసి డెస్క్టాపు మీదకి వచ్చేసి, మీ ఇష్టం వచ్చిన ఐకాన్లు ఇష్టం వచ్చిన ఫెన్స్ లోకి లాగి పడేయండి, అదేనండి డ్రాగ్ అండ్ డ్రాప్. ఆ ఫెన్సెస్ ని కూడా ఇష్టం వచ్చిన చోటికి డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు.
- ఒక్కొక్క ఫెన్స్ లో ఒక్కక్క పనికి సంబందించిన ఐకాన్లు పెట్టుకోవచ్చన్నమాట. అలాగే ఆ ఫెన్సులకి మనకి కావాల్సిన పేర్లు కూడా పెట్టుకోవచ్చు. వాటి మీద రైట్ క్లిక్ చేస్తే ఆప్షన్లు కనబడతాయి.
దీని గురించి చిన్న వీడియో కూడా ఉంది
ఇక్కడ(పక్కనే Find out more అని, ఆ పక్కనే Click Play to check out Fenses ఉంటుంది), చూడండి, ఫెన్సెస్ తో ఇంకా ఏమేమి చేయొచ్చో తెలుస్తుంది. ప్రయత్నించండి మరి. జీవితం కాస్త సుఖమయం ఐనట్టు ఉంటుంది :)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి