ఇటీవలే మైక్రోసాఫ్ట్ వారు, సెక్యూరిటీ ఎస్సెన్‌షియల్స్ పేరుతో యాంటీ వైరస్ ని విడుదల చేశారు. ఇది కూడా అన్ని యాంటీ వైరస్ ల లాగే పనిచేస్తుంది. కాకపోతే ఇది ఉచితం కూడాను.
మీరు ప్రయత్నించాలి లేదా వాడాలనుకుంటే
ఇక్కడకు వెళ్ళి డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఒక ప్రయోజనమేంటంటే మైక్రోసాఫ్ట్ వారిదే కాబట్టి మామూలు సిస్టం తాజాకరణలతో పాటు ఇది కూడా ఆటోమేటిక్ గా తాజాకరించబడుతుంది. ఇంకా దీనితో సిస్టం రిస్టోర్ పాయింట్లను ఏర్పాటు చేస్కోవచ్చు. ఈ పని మామూలుగా ఇది లేకపోయినా చేస్కోవచ్చుగని దీనితో అనుసందానించడం వల్ల ఉపయోగమేగాని పోయేదేమీ లేదు. ఇవిగో కొన్ని తెరపట్లు.
ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న యాంటివైరస్ లలో కొన్ని ఉచితంగా కూడా లభిస్తున్నాయి. ఉదాహరణకి
AVG free ఒకటి. ముఖ్యంగా యాంటీ వైరస్ లు వాడేటప్పుడు వచ్చే ఇబ్బంది అవి CPU, మెమరీ లను మరీ అతిగా వాడేసి సిస్టం ని నెమ్మది చేసేయ్యడమే. కానీ ప్రయత్నించిన మేరకు సెక్యూరిటీ ఎస్సెన్‌షియల్స్ ఈ విషయంలో పర్వాలేదనే చెప్పొచ్చు. AVG free కూడా బాగానే ఉంటుంది. మా సిస్టం మీద సెక్యూరిటీ ఎస్సెన్‌షియల్స్ ప్రయత్నించగా, ఇదిగో ఈ క్రింద చూపిన విధంగా సిస్టం రిసోర్స్ లను వినియోగించుకుంటుంది. మొత్తానికి 35% CPU(ఇంటెల్ కోర్ 2 డ్యుయో 2.0 Ghz) ని, 50 మెగాబైట్ల వరకు మెమరీ ని తీస్కుంటుంది.
అసలు యాంటీ వైరస్ అవసరమా అని మీకు అనిపిస్తే, ఎందుకు అవసరమో తెలుసుకోవాడానికి
ఇది చూడండి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి