ఉపయోగం: డైరెక్టరీ లో ఉన్న ఫైళ్ళ పట్టీని చూపటం
వాడకం: ls [ఆప్షన్] [ఫైలు]
వివరణ: ఫైళ్ళ గూర్చి సమాచారం ఇస్తుంది, సాధారణంగా ప్రస్తుతం ఉన్న డైరెక్టరీ గూర్చి. cftuvSUX లలో ఏదీ వాడనప్పుడు ఈ పట్టీని ఫైళ్ళ పేర్ల వారీగా అమర్చుతుంది.
ఆప్షన్లు
| -a, --all | . తో మొదల్లయ్యే వాటిని కూడా చూపుతుంది. ఇవి సాధారణంగా దాచబడి ఉంటాయి. |
| -A | . మరియూ .. ను చూపదు |
| --author | దీని -l తో పాటుగా వాడినప్పుడు, ప్రతి ఫైల్ యొక్క రచయిత పేరు దాని పక్కనే తెలుపుతుంది. |
| -b, --escape | ముద్రించబడలేని అక్షరాల బదులు ఆక్టల్ గుర్తులను చూపుతుంది. |
| --block-size=SIZE | SIZE-బైట్ బ్లాకులను వాడుతుంది. |
| -B | బ్యాకప్ లను చూపకు. అంటే ~ తో మొదలయ్యేవి. |
| -c | -lt తో వాడినపుడు చివరిసారి మార్పిడి చేసిన సమయం చూపుతుంది. |
| -C | పట్టీని కాలంల వారీగా చూపుతుంది. |
| --color[=WHEN] | వివిద రకాల ఫైల్లను వేర్వేరు రంగుల్లో చూపుతుంది. |
| -d, --directory | డైరెక్టరీలను మాత్రమే చూపుతుంది. |
| -f | సార్ట్ చేయదు రంగులు చూపదు. |
| -g | ఇది కూడా -l లాగానే కానీ రచయిత పేరు చూపదు. |
| -G | పొడవాటి పట్టీలో గ్రూపు పేరు చూపదు. |
| -h | ఫైల్ల సైజులను ఎంబీ కేబీ లేదా జీబీలలో చూపుతుంది (మనకు అర్థమయ్యేలా) |
| -i | ప్రతి ఫైలు ఇండెక్స్ నంబరు చూపుతుంది |
| -l | ఫైల్లకు సంభందించిన అన్ని వివరాలూ పొడవాటి పట్టీ లో ఇస్తుంది. |
| -m | పట్టీలోని పేర్లు కామాలతో వేరుపరిచి చూపుతుంది. |
| -N | ప్రత్యేక గుర్తుల విలువ మార్చకుండా చూపుతుంది. |
| -o | -l లానే కానీ గ్రూపు వివరాలు తెలుపదు. |
| -p | డైరెక్టరీల పేర్లకు / జోడించు. |
| -r | ఫైళ్ళ అమరికను తిరగేస్తుంది |
| -R | లోలోపల ఉన్న ఫైల్లను గూర్చికూడా తెలుపుతుంది. |
| -s | ప్రతి ఫైలుకూ కేటయించిన సైజును చూపుతుంది. |
| -U | డైరెక్టరీలో ఉన్న విదంగా చూపుతుంది. |







0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి