మీరు మీ వెబ్ సైటును మొదటిసారి ప్రారంభిస్తున్నా లేదా ఏదైనా పెద్ద మార్పిడి చేస్తున్నా, అది ఎలా కనపడుతుందో మొదట మీ కంప్యూటర్ లో ఒక సారి చూసుకోవటం మంచిది, మరియూ వేగవంతమూను. క్రింది పాఠ్యాంశం లో ఉబుంటూ(లినక్స్) లోకల్ హోస్టులో ఈ పనిని చేయటానికి ఏ సాఫ్ట్వేర్ లు కావాలో, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం.
౧. సినాప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్(సిస్టం > ఆడ్మినిస్ట్రేటర్) తెరిచి క్రింద తెలిపిన సాఫ్ట్వేర్ లను ఇన్‌స్టాల్ చేయండి.
mysql-serverకమాండ్ ద్వారా ఐతే క్రింద తెలిపిన కమాండు వాడండి.
php5
apache2
php5-mysql
libapache2-mod-php5filter
sudo apt-get install mysql-server php5 apache2 php5-mysql libapache2-mod-php5filter౨. mysql లో ఒక డేటా బేస్ ను సృష్టించాలి. దీని కోసం క్రింది కమాండ్ లను వాడండి. టెర్మినల్ తెరిచి ,
create database <మీ డేటా బేస్ పేరు>;ఉదాహరణ : create database wordpress;
grant all privileges on <మీ డేటా బేస్ పేరు>.* to root@localhost;ఉదాహరణ : grant all privileges on wordpress.* to root@localhost;
flush privileges;౩. అప్యాచీ ని ఒకసారి రీస్టార్ట్ చేయాలి, దీనికోసం క్రింది కమాండు ను వాడండి
exit;
sudo /etc/init.d/apache2 restartఇప్పుడు మీరు సైటు నిర్మించుకోవాలంటే, స్క్రాచ్ నుండి మొదలుపెట్టొచ్చు, లేదా ఉన్న కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లలో ఒకదాన్ని దించుకుని స్థాపించుకోవచ్చు. ఉదాహరణకి వర్డుప్రెస్ స్థాపనకి ఈ పాఠ్యాంశం చూడండి. అక్కడ unzip చేసిన ఫోల్డర్ ని /var/www లో పెట్టండి. అప్పుడు మీ సైటు http://localhost/
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి