ఉబుంటు అన్నది ప్రస్తుతం ఉన్న లినక్స్ లలో బాగా పేరున్న డిస్ట్రిబ్యూషన్. ఉబుంటు వెర్షన్ లు ఇప్పటికి పదమూడు వచ్చాయి. వీటి వివిద విచిత్ర పేర్లు పెట్టారు. దానితో పాటు ఏవో అంకెలను కుడా జోడించారు. ఇవి దేని ఆదారంగా పెట్టారో చూద్దాం.
ఉబుంటు వెర్షన్ పేరు రెండు భాగాలు ఉంటుంది మొదటిది విశేషణము రెండవది జంతువు లేదా పక్షి పేరు. ఉదాహరణకు జాంటి-జాకలోప్. మొదటి రెండు వెర్షన్ లు మినహా మిగిలినవన్నీ ఆంగ్ల అక్షరాల వరుసక్రమం లో ఉంటాయి. వీటి పక్కనే ఉన్న వెర్షన్ సంఖ్య లో మొదటి భాగం ఆ వెర్షన్ విడుదల చేసిన సంవత్సరం, రెండవది విడుదల చేసిన నెల. ఉదాహరణకు 9.10 వెర్షన్, అక్టోబర్ 2010 లో విడుదలైంది. కింద పట్టిలో వివిధ వెర్షన్ల పేర్లు తెలుపబడ్డాయి.
01 - 4.10 - వార్టీ వార్ట్‌హాగ్
02 - 5.04 - హోరీ హెడ్జ్‌హాగ్
03 - 5.10 - బ్రీజీ బ్యాడ్జర్
04 - 6.06 - డేప్పర్ డ్రేక్ - LTS
05 - 6.10 - ఏడ్జీ ఎఫ్ట్
06 - 7.04 - ఫియస్టీ ఫాన్
07 - 7.10 - గస్టీ గిబ్బన్
08 - 8.04 - హార్డీ హెరాన్ - LTS
09 - 8.10 - ఇంట్రెపిడ్ ఇబెక్స్
10 - 9.04 - జాంటీ జాకలోప్
11 - 9.10 - కార్మిక్ కోయల
12 - 10.04 - లూసిడ్ లింక్స్ - LTS
13 - 10.10 - మావరిక్ మీర్కట్
ఉబుంటు ఆరు నెలలకు ఒక కొత్త వెర్షన్ వస్తోంది. కాని కొన్ని మాత్రమే L.T.S అని పిలవబడుతున్నాయి. ఎందుకని? L.T.S అంటే లాంగ్.టర్మ్.సపోర్ట్ అని అర్థం. అంటే తక్కిన వాటికి సపోర్ట్ ఉండదని అర్థమా? సాధారణ వెర్షన్ లకు కుడా సపోర్ట్ ఉంటుంది కాని అది 18 నెలల వరకే. కాని ఈ L.T.S వెర్షన్ లకు మాత్రం మరిన్ని ఎక్కువ రోజులు సపోర్ట్ ఉంటుంది. డెస్క్టాపు L.T.S వెర్షన్ కు 3 సంవత్సరాలు, సర్వర్ L.T.S వెర్షన్ కు 5 సంవత్సరాలు ఉంటుంది. పైన బొమ్మలో వాటి సపోర్ట్ ఎప్పటివరకు ఉంటుంది అన్న విషయాలు మరియు వాటి విడుదల సమయాలు తెలుపబడ్డాయి. వీటికి వేరుగా ఎటువంటి చార్జి ఉండదు, మిగతా వాటి లాగానే ఇవి కుడా ఉచితంగా లభిస్తాయి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి