రోజు మనం బోల్డన్ని సైట్లు చూస్తుంటాం. అలాంటప్పుడు అవన్నీ మనమే తెరుచుకుని కొత్తగా ఏమొచ్చిందో చూడ్డంకంటే, ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది. RSS/Atom ఫీడ్లు చేసేది ఇదే. అవి ఎలా వాడుకోవాలో చూద్దాం.
ట్విట్టర్ గురించి "ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?" అనే టపా లో చూశాము. ఇప్పుడు ట్విట్టర్ మన అవసరాలకు అనుగుణంగా మలుచుకొని లాభం పొందడం ఎలాగో తెలుసుకుందాం.
అసలు ఇంటర్నెట్ లో ఒక కొత్త ఉపకరణం దిగింది అంటే, అది ఏ పనికైతే ఉద్దేశింపబడిందో దానికి మాత్రమే వాడాలన్న నిబందన ఏమీ కనబడదు. చాలా మంది వారి ఇష్టానుసారం వాడుకుంటూ ఉంటారు, అలా చాలా విచ్చలవిడిగా జనాలు వాడేస్తున్న ఒక ఉపకరణం, ట్విట్టర్ :) మనం కూడా ఎలా వాడలో తెలిసేసుకుందామా?
ఒక పెద్ద సైజు లో ఉన్న వీడియో ని ఏదైనా తక్కువ సైజు లోకి కన్వర్ట్ చేయాలన్నా, ఒక ఫార్మాటు లో ఉన్న దాన్ని వేరే ఫార్మాటు లోకి మార్చాలన్న, మనం VLC మీడియా ప్లేయర్ నే వాడుకోవచ్చు, వేరే కన్వర్టర్లు అవసరం లేదు. ఎలాగో ఈ వీడియోలో చూద్దాం.
మీ డెస్క్టాపు ఐకాన్ లతో నిండి పోయి విసుగోస్తుందా? ఐతే దానికో విరుగుడుంది. ఫెన్సెస్ అనే ఒక సాఫ్ట్వేర్ తో మన డెస్క్టాపు ని శుభ్రం చేసుకుని నీటుగా పెట్టుకోవోచ్చు. ఎలాగో చూద్దాం.
క్రిందటి టపాలో నెట్వర్క్ అనగా ఏమిటో , నెట్వర్కింగ్ అనగా ఏమిటో తెల్సుకున్నాము కదా , ఈ టపాలో నెట్వర్క్ లోని వివిధ పరికరాలైన ల్యాన్ కేబుల్, నిక్ (NIC), హబ్, స్విచ్, రూటర్, బ్రిడ్జ్ గూర్చి తెల్సుకుందాం.
ఈ టపా లో కొన్ని లినక్సు కమాండ్లను వాడటం ఎలానో నేర్చుకుందాం. ఈ కమాండ్లు బేసిక్ అని చెప్పొచ్చు. అంటే మనం ఫైల్ సిస్టం లో ఎక్కడ (ఏ ఫోల్డర్ లో) ఉన్నాం. ఇంకో చోటికి వెళ్ళాలంటే ఎలా? ఉన్న ఫోల్డర్ లో ఫైల్స్ చూడాలంటే ఎలా? ఈ విషయాలు చుద్దాం.
లినక్స్ మెషిన్‌ను చెడగొట్టటానికి, దానికోసం పని చేయాలి. అదే విండోస్ మెషిన్ ఐతే, దాని మీద పని చేస్తే చాలు - అన్నడు ఓ రచయిత. ప్రస్థుతం, లినక్స్ వైరస్ లు ఇలా మాట్లాడుకోవటానికి తప్ప విండోస్ ను హాని పరిచిన విదంగా ఎందుకు వ్యాప్తి చెందటం లేదు? మెకాఫీ యాంటీ వైరస్ ప్రాడక్ట్ మ్యానేజర్ క్లార్క్ అన్నరు - "విండోస్ వాడుకరులు ఎక్కువ అందుకే వైరస్ లను వ్రాసే వాళ్ళు దానికోసం వ్రాస్తున్నరు. లినక్స్ మరియూ యాపిల్ వారి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలు కూడా అంత పాపులర్ అయ్యినప్పుడు వాటి పరిస్థితి కూడా ఇంతే". ఈ వ్యాఖ్యను పూర్తిగా ఖండించలేం, ఒకొంతు అదీ నిజమే. కానీ పూర్తిగా కాదు.
ఆకలేస్తోంది, మీరు ప్రస్థుతం ఉన్న ప్రదేశానికి అతి దగ్గరలో ఉన్న బేకరీ ఎది? బోర్ కొడుతోంది, సినిమాకు వెళదాం అనుకొంటున్నారా? చుట్టుపక్కల ఏ సినిమా హాల్లు ఉన్నాయో తెలుసుకోవాలి, ఎలా? విహార యాత్రకు వెళ్ళినప్పుడు, మీరు చూడవలసిన ప్రదేశాలు, గూగుల్ మ్యాప్ లలో చూశారు, ఆ వివరాలన్నీగుర్తుంచుకోవాలి? ఇవన్నీ ఇంటర్నెట్ సాయంతో మన మొబైల్ ఫోన్ అందించగలిగితే ఎంత బాగుంటుంది! నిరుత్సాహ పడకండి, గూగుల్ వారి లోకల్ సెర్చ్ ఇవన్నీ చేయగలదు.
డెలీష్యస్ ఒక ఆన్లైన్ బుక్‌మార్క్ నిర్వాహక ఉపకరణం. ఇప్పుడు అంతమంది బుక్ మార్కుల్లో వెతకడానికి గ్రాఫ్ లతో కూడిన కొన్ని సులభమైన, సొంపైన పద్దతులు ప్రవేశపెట్టింది.
మీ వెబ్ సైట్ భాష, చదువరుల భాష వేరైనప్పుడు ఆటోమాటిక్ గా మన వెబ్సైటు లో ఉన్నదంతా చదివేవారి భాషలోకి తర్జుమా అయిపోతే భలేవుంటుంది కదూ. ఇప్పుడు వెబ్సైటు డెవలపర్ లకి ఈ అవకాశం కల్పిస్తూ గూగుల్ బ్లాగ్ లో వార్త ప్రచురించారు. అదెలా వాడుకోవాలో చూద్దాం.
ఇటీవలే మైక్రోసాఫ్ట్ వారు, సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్ పేరుతో యాంటీ వైరస్ ని విడుదల చేశారు. ఇది కూడా అన్ని యాంటీ వైరస్ ల లాగే పనిచేస్తుంది. కాకపోతే ఇది ఉచితం కూడాను.
మీరు ప్రయత్నించాలి లేదా వాడాలనుకుంటే ఇక్కడకు వెళ్ళి డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఒక ప్రయోజనమేంటంటే మైక్రోసాఫ్ట్ వారిదే కాబట్టి మామూలు సిస్టం తాజాకరణలతో పాటు ఇది కూడా ఆటోమేటిక్ గా తాజాకరించబడుతుంది. ఇంకా దీనితో సిస్టం రిస్టోర్ పాయింట్లను ఏర్పాటు చేస్కోవచ్చు. ఈ పని మామూలుగా ఇది లేకపోయినా చేస్కోవచ్చుగని దీనితో అనుసందానించడం వల్ల ఉపయోగమేగాని పోయేదేమీ లేదు. ఇవిగో కొన్ని తెరపట్లు.